By: ABP Desam | Updated at : 11 Sep 2023 09:55 AM (IST)
రామ్ గోపాల్ వర్మ 'వ్యుహం' (Image Credit: RGV X)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోలను, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఆయన పెట్టే సెటైరికల్ కామెంట్స్, ట్వీట్స్ వైరల్ అవుతుంటాయి. ఇటీవల కాలంలో జనసేన అధినేతను ఉద్దేశిస్తూ ట్వీట్లు పెడుతూ పవర్ స్టార్ అభిమానుల ఆగ్రహానికి గురవుతూ వస్తున్న ఆర్జీవీ.. పవన్ కళ్యాణ్ మనస్తత్వాన్ని తనకంటే బాగా ఎవరు అర్థం చేసుకోగలరు? అంటూ మరోసారి వార్తల్లో నిలిచారు.
రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఫిక్షనల్ రియాలిటీ జోనర్ లో 'వ్యూహం' అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ గా ప్రచారం చేయబడుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఏపీ పాలిటిక్స్‌లో హీట్ పెంచింది. అయితే ఈ సినిమాలోని స్టిల్స్ కు పవన్ కళ్యాణ్ నిజ జీవిత ఘటనకు పోలిక పెడుతూ ట్విట్టర్ ఎక్స్ లో తాజాగా ట్వీట్ చేశారు వర్మ.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అంతకంటే ముందు విచారణ నిమిత్తం చంద్రబాబును విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తరలించిన నేపథ్యంలో, ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మొదట స్పెషల్ ఫ్లైట్ లో గన్నవరం వెళ్లడానికి ప్లాన్ చేసుకోగా, గన్నవరం ఎయిర్‌పోర్టు అథారిటీ అనుమతి నిరాకరించింది. దీంతో రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్లేందుకు ప్రయత్నించగా లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ఏపీ పోలీసులు ఆయన్ను గరికపాడు చెక్ పోస్టు వద్ద అడ్డుకున్నారు.
అయితే ముందుగా ప్లాన్ చేసుకున్న మంగళగిరి పార్టీ మీటింగ్ కోసమే తాను వెళ్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పగా.. అరెస్టైన చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించడానికి తమ నాయకుడు వెళ్తుంటే అడ్డుకున్నారని నాదెండ్ల మనోహర్ మీడియా ముఖంగా చెప్పారు. ఆ సంగతి అటుంచితే కారులో విజయవాడ వెళ్తున్న తనను పోలీసులు ఆపేయడంతో, గరికపాడు చెక్ పోస్ట్ వద్ద రోడ్డుపై పడుకుని పవన్ నిరసనకు దిగారు. నడి రోడ్డుపై కాలుపై కాలు వేసుకుని పడుకున్న పవన్ ఫోటోలను ఆయన అభిమానులు నెట్టింట వైరల్ చేసారు. ఈ ఫోటోలనే ఆర్జీవీ తన మూవీ స్టిల్స్ తో కంపేర్ చేస్తూ పోస్టులు పెట్టారు.
Who can understand a persons psychology better than me ? 😎 పైన నేను నెల క్రితం రిలీజ్ చేసిన “వ్యుహం” సినిమా ఫొటో.. కింద నిన్న రాత్రి రోడ్డు మీద తీసిన రియల్ ఫోటో pic.twitter.com/SHNVPxp0Lv
— Ram Gopal Varma (@RGVzoomin) September 10, 2023
''పైన నేను నెల క్రితం రిలీజ్ చేసిన “వ్యుహం” సినిమా ఫోటో.. కింద నిన్న రాత్రి రోడ్డు మీద తీసిన రియల్ ఫోటో. ఒక వ్యక్తి మనస్తత్వాన్ని నాకంటే బాగా ఎవరు అర్థం చేసుకోగలరు?'' అంటూ పవన్ రోడ్డపై పడుకున్న ఫోటోలని తన చిత్రంలోని స్టిల్స్ ను పోస్ట్ చేసారు రామ్ గోపాల్ వర్మ. ఎప్పటిలాగే ఈ ట్వీట్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు ఫైర్ అయ్యారు. అయినా సరే అవేమీ పట్టించుకోని కాంట్రవర్సీ కింగ్ వర్మ.. పవన్ ప్రెస్ మీట్ ని ఉద్దేశిస్తూ మరో సంచలన ట్వీట్ చేసారు.
పైన నేను నెల క్రితం రిలీజ్ చేసిన “వ్యుహం” సినిమా ఫొటో.. కింద నిన్న రాత్రి రోడ్డు మీద తీసిన రియల్ ఫోటో pic.twitter.com/ve6CLfmOUW
— Ram Gopal Varma (@RGVzoomin) September 10, 2023
ఇక 'వ్యూహం' విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, వైఎస్‌ఆర్ మరణం తర్వాత పరిస్థితులు, జగన్ అరెస్ట్, రాష్ట్ర విభజన, ఓదార్పు పాదయాత్ర, జగన్ సీఎం అవ్వడం వంటి అంశాలతో ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. అందులో 'వ్యూహం' ఫస్ట్ పార్ట్ కాగా, రెండోది 'శపథం' పేరుతో రానుంది. ఈ చిత్రాల్లో జగన్ తో పాటుగా వైఎస్ విజయమ్మ, భారతి, షర్మిల, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ నిజ జీవిత పాత్రలను పోలిన ఫిక్షనల్ క్యారెక్టర్లు ఉండబోతున్నాయి. ఇప్పటికే విడుదలైన 'వ్యూహం' టీజర్ ఎంత పెద్ద సంచలనం రేపిందో చెప్పనవసరం లేదు. దాసరి కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Also Read: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కింగ్ ఖాన్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాడా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ - 'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?
Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ
BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది
Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!
Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..
పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన కేసీఆర్, త్వరలోనే ప్రకటన
Telangana BJP : సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?
Breaking News Live Telugu Updates: రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ టీం
Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ - దానం ఇలా కూడా చేయొచ్చు
/body>