‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
'కేజీఎఫ్' ని తలపించేలా 'ఘోస్ట్' ట్రైలర్ - గ్యాంగ్‌స్టర్‌గా శివన్న విధ్వంసం
కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' సినిమాలో గెస్ట్ రోల్ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. సినిమాలో నరసింహ పాత్రలో కొన్ని క్షణాల పాటు కనిపించినా ఆయన ఎంట్రీ, స్టైల్, స్వాగ్ చూసి ప్రేక్షకులు థియేటర్స్ లో విజిల్స్ వేశారు. సినిమాలో ఆయన ఎంట్రీకి ఫ్యాన్స్ అరుపులతో థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. అలా 'జైలర్'లో భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన శివ రాజ్ కుమార్ ఇప్పుడు 'ఘోస్ట్'(Ghost) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లిమ్స్ కన్నడ తో పాటు అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'
సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు 'జైలర్' విజయంతో హ్యాపీగా ఉన్నారు. ఆగస్టు 9న విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ బరిలో వసూళ్ల సునామీ సృష్టించింది. ఐదు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. వాళ్లకు ఓ గుడ్ న్యూస్! సంక్రాంతికి కూడా రజనీకాంత్ సినిమా థియేటర్లలోకి రానుంది. రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో నటించిన సినిమా 'లాల్ సలాం' (Lal Salaam Movie). ముంబైకి చెందిన మాఫియా డాన్ మొయిద్దీన్ భాయ్ పాత్రలో ఆయన కనిపిస్తారు. ఆల్రెడీ విడుదల చేసిన ఫస్ట్ లుక్ అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రానికి రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth) దర్శకురాలు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
రెండు భాగాలుగా విజయ్ దేవరకొండ సినిమా - డైరెక్టర్ ఎవరంటే?
'లైగర్' వంటి భారీ డిజాస్టర్ తర్వాత ఇటీవల 'ఖుషి' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్ కి జోడిగా సమంత కథానాయికగా నటించింది. సెప్టెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ ని అందుకొని బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. కానీ విజయ్ దేవరకొండకి కావలసిన భారీ కం బ్యాక్ ని ఇవ్వలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు విజయ్ దేవరకొండ. ఈ క్రమంలోనే తన తదుపరి చిత్రాన్ని 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్నాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
హేమలత లవణంగా రేణు దేశాయ్ - రవితేజ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ చూశారా?
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా, వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి భారీగా అంచనాలు నెలకొన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమా పలు భాషల్లో విడుదలకానుంది. గ్రిప్పింగ్ టీజర్, చార్ట్ బస్టర్ పాటలతో టైగర్ నాగేశ్వర్ రావు చిత్రం నేషనల్ వైడ్ గా హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాతో రవితేజ పాన్ ఇండియన్ స్టార్ గా మారబోతున్నారు. సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అదిరిపోయే అప్ డేట్ ఇచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'భగవంత్ కేసరి' బంధం విలువ చెప్పే పాట - 'ఉయ్యాలో ఉయ్యాల' రిలీజ్ ఎప్పుడంటే?
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటించిన సినిమా 'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari Movie). విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ఆల్రెడీ సినిమా టీజర్, ఫస్ట్ సాంగ్ 'గణేష్ యాంథమ్' విడుదల చేశారు. ఇప్పుడు రెండో పాటను ఎప్పుడు విడుదల చేసేదీ వెల్లడించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)