అన్వేషించండి

‘లియో’, ‘భగవంత్ కేసరి’ రివ్యూలు, ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌లో ఎన్టీఆర్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

స్పెయిన్​లో మొదలైన 'వార్ 2' షూటింగ్ - సెట్స్ నుంచి లీకైన వీడియో!
'ఆర్ఆర్ఆర్' సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'వార్ 2'(War2) తో బాలీవుడ్​కి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. యశ్ రాజ్ స్పై యూనివర్స్​లో భాగంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. బాలీవుడ్​లోనే మోస్ట్ యాంటీస్ పెటెడ్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్​గా 'వార్ 2' రూపొందుతోంది. 2019లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసిన నటించిన 'వార్'(war) చిత్రానికి సీక్వెల్​గా వస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్​ను అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి రాబోతున్న స్పై మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'లియో' రివ్యూ : LCUలో విజయ్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ మేజిక్ వర్కవుట్ అవుతుందా? లేదా?
తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ 'లియో' మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఆయనతో పాటు ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకుడు కావడమే అందుకు కారణం. LCU (లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్)లో సినిమా కావడం మెయిన్ రీజన్! విడుదలకు ముందు భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రమిది. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

భగవంత్ కేసరి రివ్యూ: బాలకృష్ణ నయా అవతార్ ఎలా ఉంది? అనిల్ రావిపూడి మళ్లీ హిట్టు కొట్టాడా?
‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ సక్సెస్‌లతో బాలయ్య కెరీర్‌లోనే సూపర్ ఫాంలో ఉన్నారు. అలాగే టాలీవుడ్‌లో అపజయం ఎరుగని దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. వీరి కాంబినేషన్‌లో సినిమా అనగానే అంచనాలు ఒక రేంజ్‌లో ఉంటాయి. దీనికి తోడు బాలకృష్ణ తన వయసుకు తగ్గ పాత్ర చేయడం, అనిల్ రావిపూడి తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొత్తగా ప్రయత్నించడంతో ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరిగాయి. టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు, ‘రోర్ ఆఫ్ కేసరి’ సాంగ్ విపరీతంగా సక్సెస్ అయింది. దీంతో ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేశారు. దసరా సందర్బంగా గురువారం (అక్టోబర్ 19వ తేదీ) ‘భగవంత్ కేసరి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘భగవంత్ కేసరి‘ ఆ ఓటీటీలోనే, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో కుర్ర హీరోలతో పోటీ పడి నటించే స్టార్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ. వయసు పెరుగుతున్నా, తన నటనలో ఏమాత్రం జోష్ తగ్గలేదంటారు ఆయన. నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్ లో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. వరుస హిట్లతో బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్నారు. రీసెంట్ గా ‘అఖండ’, ‘వీర సింహారెడ్డి’ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. తాజాగా ‘భగవంత్ కేసరి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దసరా కానుకగా ఈ చిత్రం ఇవాళ(అక్టోబర్ 19న) విడుదల అయ్యింది. ఈ సినిమా రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ సినిమా ఓటీటీ భాగస్వామికి సంబంధించిన వివరాలను మూవీ టైటిల్ కార్డ్స్‌ లోనే చిత్రబృందం వెల్లడించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్రతిష్టాత్మక 'ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్'లో తారక్‌కు చోటు
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరో అరుదైన గుర్తింపు సాధించారు. ఆస్కార్ 'యాక్టర్స్ బ్రాంచ్‌'లో సభ్యత్వం పొందారు. ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ కొత్త మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్‌లో తారక్ స్థానం చోటు సంపాదించారు. RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన తారక్.. ఇప్పుడు ప్రతిష్టాత్మక అకాడమీ యాక్టర్స్ లిస్టులో చేరిపోయారు. ఈ విషయాన్ని అకాడమీ అధికారికంగా ప్రకటించింది. ఎన్టీఆర్ కి కూడా ఆహ్వానం అందిస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Embed widget