అన్వేషించండి

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీమ్యాన్’ ట్రైలర్ డేట్, ‘జవాన్’ను దాటిన యానిమల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

సుకుమార్ రేర్ రికార్డ్ - తెలుగులో రాజమౌళి తర్వాత లెక్కల మాస్టారే!
దర్శకుడు సుకుమార్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? 'పుష్ప' విడుదల ముందు వరకు తక్కువ ఉండేది. 'పుష్ప : ది రైజ్' కోసం ఆయన తొలిసారి 25 కోట్ల రూపాయల చెక్ అందుకున్నారు. ఇప్పుడు 'పుష్ప : ది రూల్'కి గాను ఫస్ట్ పార్ట్ కోసం తీసుకున్న దాని కంటే నాలుగు రేట్లు ఎక్కువ సుక్కు అందుకుంటున్నారని ఫిల్మ్ నగర్ ఖబర్. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకున్న దర్శకుడు ఎవరు? అంటే... మరో సందేహం లేకుండా దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి పేరు చెప్పవచ్చు. 'బాహుబలి'కి ఆయన భారీ అందుకున్నారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' చిత్రానికి అయితే వంద కోట్లకు పైగా రెమ్యూనరేషన్ రూపంలో రాజమౌళి తీసుకున్నారని టాక్. తెలుగులో ఆ తర్వాత ఆ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నది సుకుమారే అని టాక్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

నితిన్ జెండా, ఎజెండా ఒక్కటే - 'ఎక్స్ట్రా' ట్రైలర్ ఆ రోజే విడుదల
నితిన్ తన జెండా, ఎజెండా ఒక్కటే అని అంటున్నారు. అంటే... ఆయన రాజకీయాల్లోకి ఏమీ రావడం లేదు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'ఎక్స్‌ట్రా - ఆర్డిన‌రీ మ్యాన్'. అందులో జెండా, ఎజెండా ఎంటర్‌టైన్‌మెంట్ అని చెబుతున్నారు. 'ఎక్స్‌ట్రా - ఆర్డిన‌రీ మ్యాన్' చిత్రాన్ని ప్రముఖ రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రీ లీల కథానాయిక. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ విలన్ తరహా పాత్రలో నటిస్తున్నారు. హీరోగా నితిన్ 32వ చిత్రమిది. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ భాగస్వామ్యంతో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 8న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలో ట్రైలర్ విడుదల చేయనున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

సిగ్గు, లజ్జ వదిలేస్తేనే రండి, నిర్మాత బన్నీ వాసు సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా పరిశ్రమలో గీతా ఆర్ట్స్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ సంస్థ నిర్మించిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. ప్రస్తుతం తెలుగునాట అగ్ర నిర్మాణ సంస్థగా కొనసాగుతోంది. ఈ బ్యానర్ GA2 పిక్చర్స్ భాగం అయ్యింది. GA2లో నిర్మాత బన్నీ వాస్ భాగస్వామిగా ఉన్నారు.  అల్లు అరవింద్‌ ప్రొడక్షన్‌ నుంచి వచ్చే సినిమాల్లో వాసు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే GA2 బ్యానర్‌ లో చాలా సినిమాలు తీశారు. రీసెంట్ గా 'కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ మలయాళం సినిమా 'నయట్టు' కి రీమేక్ గా రూపొందింది.  'జోహార్', 'అర్జున ఫాల్గుణ' సినిమాలకు దర్శకత్వం వహించిన తేజ మార్ని  ఈ సినిమాను తెరకెక్కించారు. బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ తెలుగు రీమేక్ లో సీనియర్ నటుడు శ్రీకాంత్ ప్రధానపాత్రలో కనిపించగా, వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలో నటించింది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

24 గంటల్లో 71 మిలియన్ల వ్యూస్, ‘జవాన్’ను వెనక్కి నెట్టినా, ప్రభాస్ మూవీని బీట్ చేయలేకపోయిన ‘యానిమల్’
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన తాజా చిత్రం ‘యానిమల్’. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ట్రైలర్ ను విడుదల చేసింది. మూడు నిమిషాల వ్యవధి ఉన్న ఈ మూవీ ట్రైలర్ కత్తిపోట్లు, బుల్లెట్ల వర్షంతో రక్తసిక్తంగా మారిపోయింది. తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్, కళ్లు చెదిరే యాక్షన్ సీన్స్ తో ఆద్యంతం అలరించింది. ఈ ట్రైలర్ తో వయెలెన్స్ అంటే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకుడు సందీప్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

కాస్త ఓపిక పట్టండి - నెక్ట్ట్స్ మూవీపై యష్ రియాక్షన్ ఇదే!
కన్నడ స్టార్ హీరో యష్ ‘KGF’ సినిమాలతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ రెండు సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ‘KGF2’ మూవీ విడుదలై ఏడాదిన్నర అవుతోంది. అయినప్పటికీ ఆయన తదుపరి సినిమా గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. రీసెంట్ గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన నెక్ట్స్ ప్రాజెక్టు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Earthquake In Prakasam: ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Earthquake In Prakasam: ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
UI Movie Leaked Online: రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్
రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్ చేసేశారు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Earthquake In Prakasam: ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Earthquake In Prakasam: ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
UI Movie Leaked Online: రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్
రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్ చేసేశారు
Look Back 2024 - Celebrity Divorce: పెటాకులైన పెళ్లిళ్లు... 2024లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీ కపుల్స్ వీళ్లే
పెటాకులైన పెళ్లిళ్లు... 2024లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీ కపుల్స్ వీళ్లే
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌
2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌
Embed widget