Bunny Vasu: సిగ్గు, లజ్జ వదిలేస్తేనే రండి, నిర్మాత బన్నీ వాసు సంచలన వ్యాఖ్యలు
Bunny Vasu: నిర్మాత బన్నీ వాసు ప్రస్తుత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చక్కగా చదువుకుని డబ్బు సంపాదించిన వారు రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదని చెప్పారు.
Producer Bunny Vasu fire on Politics: తెలుగు సినిమా పరిశ్రమలో గీతా ఆర్ట్స్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ సంస్థ నిర్మించిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. ప్రస్తుతం తెలుగునాట అగ్ర నిర్మాణ సంస్థగా కొనసాగుతోంది. ఈ బ్యానర్ GA2 పిక్చర్స్ భాగం అయ్యింది. GA2లో నిర్మాత బన్నీ వాస్ భాగస్వామిగా ఉన్నారు. అల్లు అరవింద్ ప్రొడక్షన్ నుంచి వచ్చే సినిమాల్లో వాసు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే GA2 బ్యానర్ లో చాలా సినిమాలు తీశారు. రీసెంట్ గా 'కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ మలయాళం సినిమా 'నయట్టు' కి రీమేక్ గా రూపొందింది. 'జోహార్', 'అర్జున ఫాల్గుణ' సినిమాలకు దర్శకత్వం వహించిన తేజ మార్ని ఈ సినిమాను తెరకెక్కించారు. బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ తెలుగు రీమేక్ లో సీనియర్ నటుడు శ్రీకాంత్ ప్రధానపాత్రలో కనిపించగా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించింది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషించారు.
ప్రస్తుత రాజకీయాలపై బన్నీవాసు సంచలన వ్యాఖ్యలు
తాజాగా 'కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్' సినిమా ప్రమోషనల్ లో పాల్గొన్న బన్నీ వాసు ప్రస్తుత రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాల్లోకి అడుగు పెట్టాలి అనుకునే వారికి ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పారు. “కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్.. సినిమాను అనుభవం ఉన్నపొలిటీషియన్ గానే చూశాను. భవిష్యత్ ఇలా ఉండబోతుందని నేను అనుకోను. కానీ జరుగుతున్నది ఇలాగే ఉంది. బాగా చదువుకుని, బాగా సంపాదిస్తే, ఇంట్లోనే హ్యాపీగా ఉండండి. అంతేతప్ప రాజకీయాల్లోకి రాకండి. ఈ రోజు ఉన్న రాజకీయాల్లోకి ఒక వ్యక్తి రావాలంటే సిగ్గు, లజ్జ అన్నీ వదిలేయాలి. నన్ను ఎవడు తిట్టినా ఫర్వాలేదు. నా ఫ్యామిలీ ఫోటోలు ఎవడు సోషల్ మీడియాలో పెట్టిన ఫర్వాలేదు. నా ఫ్యామిలీని, కూతురును, భార్యను ఎవరు ఏమన్నా ఫర్వాలేదు. నాకేం పట్టదు అని బట్టలు విప్పి రోడ్డు మీద నడవగలిగిన వాడే ఈ రోజు రాజకీయాల్లోకి వెళ్లగలడు. చదువుకున్న వారు, ఆత్మాభిమానం ఉన్నవారు, చిన్న మాట అంటే పడని వారు మాత్రం రాజకీయాలకు సూట్ కారు. ఒకవేళ నేను పోటీ చేయాలి అనుకుంటే నేనూ అన్నింటిని వదిలేయాల్సిందే. లేదంటే ఇంట్లో కూర్చొవడం బెస్ట్” అని బన్నీవాసు వెల్లడించారు.
ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ ఊహాగానాలు
ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా పాలకొల్లుకు చెందిన బన్నీ వాసు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలకొల్లు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బన్నీ వాసు పవన్ కల్యాణ్ కు, ఆయన జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. "పవన్ కల్యాణ్ నన్ను ఏది అడిగినా చేస్తాను. నేను ఎప్పుడూ పవన్ కల్యాణ్, జనసేనతోనే ఉంటాను. అతడు నన్ను రాజకీయంగా ఏ పని చేయమని ఆదేశించినా వెనుకాడను. పార్టీలో ఏ హోదాలోనైనా పని చేయడానికి నేను రెడీగా ఉన్నాను" అని గతంలోనే వెల్లడించారు.
Read Also: కాస్త ఓపిక పట్టండి - నెక్ట్ట్స్ మూవీపై యష్ రియాక్షన్ ఇదే!
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply