అన్వేషించండి

Actor Yash: కాస్త ఓపిక పట్టండి - నెక్ట్ట్స్ మూవీపై యష్ రియాక్షన్ ఇదే!

Actor Yash Next Movie: కన్నడ స్టార్ హీరో యష్ తర్వాతి సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.

Actor Yash Next Movie: కన్నడ స్టార్ హీరో యష్ ‘KGF’ సినిమాలతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ రెండు సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ‘KGF2’ మూవీ విడుదలై ఏడాదిన్నర అవుతోంది. అయినప్పటికీ ఆయన తదుపరి సినిమా గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. రీసెంట్ గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన నెక్ట్స్ ప్రాజెక్టు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 

తన తర్వాతి సినిమాపై యష్ కీలక వ్యాఖ్యలు

‘KGF’ సినిమాల తర్వాత అభిమానులలో తన సినిమాలపై భారీగా అంచనాలు నెలకొన్నాయని చెప్పారు యష్. ఈ నేపథ్యంలోనే తన తర్వాతి చిత్రాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు. “‘KGF’ చిత్రాల తర్వాత తన తర్వాతి సినిమాలపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్ నా నుంచి మరింత అద్భుతమైన సినిమాలను ఆశిస్తున్నారు. నా ఫ్యాన్స్ కు సగం ఉడికిన ఫుడ్ పెట్టలేను. అందరూ గర్వపడే సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాను. కాస్త, ఓపిక పట్టాలని కోరుతున్నాను” అని వెల్లడించారు. వాస్తవానికి గతంలోనూ యష్ ఇలాంటి ప్రకటనే చేశారు. తన నెక్ట్స్ మూవీ కోసం చాలా కష్టపడుతున్నట్లు వెల్లడించారు. అభిమానుల అంచనాలకు మించి సినిమా చేస్తానని చెప్పారు. కానీ, ఇప్పటికీ ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పుడు కూడా అలాంటి ప్రకటనే ఆయన నుంచి రావడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. 

గీతా మోహన్ తో సినిమా చేస్తున్న ఊహాగానాలు

‘KGF2’ సినిమాల తర్వాత యష్ సినిమాల గురించి ఇప్పటికి చాలా ఊహాగానాలు వినిపించాయి. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తో కలిసి ఓ సినిమా గురించి చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరి కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్లు టాక్ వినిపించింది. అయితే, ఈ సినిమా గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. బాలీవుడ్ లో తెరకెక్కనున్న ‘రామాయణం’ చిత్రంలో యష్ రావణుడిగా కనిపించనున్నట్లు ప్రచారం జరిగింది. దీని గురించి కూడా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మొత్తంగా ఆయన తర్వాత సినిమా ఎప్పుడు? ఎవరితో చేస్తారు? అనేది చాలా సస్పెన్స్ గా మారింది.    

‘KGF’ చిత్రాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు

ఇక యష్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన 'కేజీఎఫ్' సినిమాలు సంచలన విజయాలను అందుకున్నాయి. దేశవ్యాప్తంగా ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. గోల్డ్ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ‘KGF’ సినిమా అంచనాలు లేకుండా విడుదలైన ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' సెన్సేషన్ క్రియేట్ చేసింది. సౌత్, నార్త్ అని తేడా లేకుండా విడుద‌లైన ప్ర‌తి భాష‌లో వ‌సూళ్ళ వ‌ర్షాన్ని కురిపించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రావు రమేష్, ప్రకాష్ రాజ్, రవీనా టాండన్, సంజయ్ దత్ లు కీలక పాత్రలు పోషించారు. హొంబలే ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.

Read Also: ఓటీటీలోకి కీర్తి సురేష్ ఎంట్రీ, బోల్డ్ బ్యూటీతో కలిసి తొలి వెబ్ సిరీస్

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

టాప్ హెడ్ లైన్స్

Nara Rohith Kapaali : సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో నారా రోహిత్ - తెలియని ప్రపంచంలో న్యూ జర్నీ 'కపాలి'
సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో నారా రోహిత్ - తెలియని ప్రపంచంలో న్యూ జర్నీ 'కపాలి'
The Odyssey Collections : ఇండియాలో ది ఒడిస్సీ రికార్డు కలెక్షన్స్ - వారం రోజుల్లోనే ఆ మార్క్ దాటేసిందిగా...
ఇండియాలో ది ఒడిస్సీ రికార్డు కలెక్షన్స్ - వారం రోజుల్లోనే ఆ మార్క్ దాటేసిందిగా...
Sumo Didi OTT : ఓటీటీలోకి ఇండియాస్ ఫస్ట్ మహిళా సుమో రెజ్లర్ స్టోరీ - ఇంట్రెస్టింగ్ టీజర్... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి ఇండియాస్ ఫస్ట్ మహిళా సుమో రెజ్లర్ స్టోరీ - ఇంట్రెస్టింగ్ టీజర్... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Vanda Devullu OTT : ఓటీటీలోకి వంద దేవుళ్లు - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి వంద దేవుళ్లు - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Brezza Facelift: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
Ravneet Singh Bittu Resign: ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
Embed widget