అన్వేషించండి

Keerthy Suresh: ఓటీటీలోకి కీర్తి సురేష్ ఎంట్రీ, బోల్డ్ బ్యూటీతో కలిసి తొలి వెబ్ సిరీస్

Keerthy Suresh Akka Web Series: ‘మహానటి’ బ్యూటీ కీర్తి సురేష్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సిరీస్ లో రాధికా ఆప్టేతో కలిసి నటిస్తోంది.

Keerthy Suresh Akka Web Series: ‘నేను శైలజ’ మూవీతో తెలుగు సినిమా పరిశ్రమలోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది కీర్తి సురేష్. తొలి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరైంది. ‘మహానటి’ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమాలో నటనకు గాను ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళంలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇప్పటికే పలువురు నటీనటులు ఓటీటీలో అడుగు పెట్టగా, కీర్తి సురేష్ తొలిసారి ఓ వెబ్‌సిరీస్‌ లో నటించబోతోంది. నటి రాధికా ఆప్టేతో కలిసి ఈ వెబ్ సిరీస్ లో కనిపించనుంది. ఈ సిరీస్ కు మేకర్స్ ‘అక్క’ అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ప్రత్యర్థులగా కనిపించనున్న కీర్తి సురేష్, రాధికా ఆప్టే

ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ  కొత్త వెబ్ సిరీస్ నిర్మిస్తోంది. ధర్మరాజ్ శెట్టి దర్శకత్వంలో ఈ సిరీస్  తెరకెక్కబోతోంది. ప్రముఖ దర్శకుడు ఆదిత్య చోప్రా యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో సిరీస్ ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యాయి. గత 6 నెలలుగా ఈ వెబ్ సిరీస్ కోసం గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. పీరియడ్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ రూపొందనున్నట్లు టాక్ నడుస్తోంది. ఇందులో కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రత్యర్థులుగా కనిపించనున్నట్లు సమాచారం.   

షూటింగ్ కంప్లీట్ అయ్యాకే వివరాల వెల్లడి?

ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు చెప్పకూడదని నిర్మాణ సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ షూటింగ్ 75 శాతానికి పైగా పూర్తి అయిన తర్వాతే అఫీషియల్ ప్రకటనలు చేయాలి అనుకుంటున్నారట మేకర్స్. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ లో కీర్తి సురేష్, రాధికా ఆప్టే కలిసి నటిస్తారని తెలిసినా, మిగతా నటీనటుల వివరాలను మాత్రం వెల్లడించలేదు. షూటింగ్ తర్వాతే ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.   

వరుస సినిమాలతో కీర్తి ఫుల్ బిజీ

అటు కీర్తి సురేశ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తోంది. వరుణ్ ధావన్ తో కలిసి ఈ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతానికి ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. VD18 అనే వర్కింగ్ టైటిల్ లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అటు జయం రవి, అనుపమ పరమేశ్వరన్ తో కలిసి ‘సైరన్‘ అనే సినిమాలో నటిస్తోంది. తమిళంలో ‘కన్నివెడి’, ‘రివాల్వర్ రీటా’, ‘రఘు తాత’ లాంటి సినిమాల్లో నటిస్తోంది.

Read Also: సింపుల్ గా ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ హీరోయిన్ పెళ్లి, వరుడు ఎవరో తెలుసా?

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
T20 World Cup 2026: కాసేపట్లో టి20 ప్రపంచ కప్ 2026 భారత జట్టు ప్రకటన! ముంబై సమావేశంలో ముగ్గురు క్రికెటర్లపైనే చర్చ!
కాసేపట్లో టి20 ప్రపంచ కప్ 2026 భారత జట్టు ప్రకటన! ముంబై సమావేశంలో ముగ్గురు క్రికెటర్లపైనే చర్చ!

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
T20 World Cup 2026: కాసేపట్లో టి20 ప్రపంచ కప్ 2026 భారత జట్టు ప్రకటన! ముంబై సమావేశంలో ముగ్గురు క్రికెటర్లపైనే చర్చ!
కాసేపట్లో టి20 ప్రపంచ కప్ 2026 భారత జట్టు ప్రకటన! ముంబై సమావేశంలో ముగ్గురు క్రికెటర్లపైనే చర్చ!
Sharif Usman Hadi: కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
Bigg Boss Telugu Grand Finale : బిగ్​బాస్​ గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజివీ.. నిధి అగర్వాల్ రాకతో కళ్యాణ్​కు గాయం!
బిగ్​బాస్​ గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజివీ.. నిధి అగర్వాల్ రాకతో కళ్యాణ్​కు గాయం!
Peddi Review : ఆ స్టోరీకి చికిిరీ గికిరీలు అవసరమా? - వారు తిన్న కంచంలో ఉమ్మేసినట్లే... రివ్యూయర్స్‌కు విశ్వక్ స్ట్రాంగ్ కౌంటర్
ఆ స్టోరీకి చికిిరీ గికిరీలు అవసరమా? - వారు తిన్న కంచంలో ఉమ్మేసినట్లే... రివ్యూయర్స్‌కు విశ్వక్ స్ట్రాంగ్ కౌంటర్
Hardik Pandya : తను కొట్టిన సిక్సర్‌ బంతి తగిలి గాయపడ్డ కెమెరామెన్‌ను పరామర్శించిన హార్దిక్ పాండ్యా!
తను కొట్టిన సిక్సర్‌ బంతి తగిలి గాయపడ్డ కెమెరామెన్‌ను పరామర్శించిన హార్దిక్ పాండ్యా!
Embed widget