![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Prerana Wedding: సింపుల్ గా ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ హీరోయిన్ పెళ్లి, వరుడు ఎవరో తెలుసా?
krishna mukunda murari Prerana: వరుసగా బుల్లితెర నటుల పెళ్లిళ్లు జరుగుతున్నాయి. రీసెంట్ గా నటుడు మానస్ పెళ్లి చేసుకోగా, ఇప్పుడు ఓ తెలుగు సీరియల్ హీరోయిన్ వివాహ బంధంలోకి అడుగు పెట్టింది.
![Prerana Wedding: సింపుల్ గా ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ హీరోయిన్ పెళ్లి, వరుడు ఎవరో తెలుసా? krishna mukunda murari serial prerana wedding photos goes viral details here Prerana Wedding: సింపుల్ గా ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ హీరోయిన్ పెళ్లి, వరుడు ఎవరో తెలుసా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/25/14ec10607f258d5d91fa59d68371f9251700885858297544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Krishna mukunda murari actress Prerana wedding: గత కొంత కాలంగా సెలబ్రిలులో వరుసగా పెళ్లి చేసుకుంటున్నారు. ఒకరి తర్వాత మరొకరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి అవుతున్నారు. రీసెంట్ గా సినీ నటుడు శర్వానంద్, వరుణ్ తేజ్ సంసార జీవితంలోకి అడుగు పెట్టారు. శర్వానంద్ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోగా, మెగా హీరో వరుణ్ తేజ్ మాత్రం హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇటలీ వేదికగా అంగరంగ వైభవంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. బుల్లితెర నటీనటులు కూడా బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్తున్నారు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్, నటుడు మానస్ పెళ్లి చేసుకున్నాడు. పెద్దలు చూసిన శ్రీజ అనే అమ్మాయితో ఏడడుగులు నడిచాడు. ప్రస్తుతం మరో తెలుగు సీరియల్ హీరోయిన్ పెళ్లి చేసుకుంది.
సంసార జీవితంలోకి ‘కృష్ణ ముకుంద మురారి’ ప్రేరణ
తెలుగులో బాగా పాపులర్ అయిన సీరియల్స్ లో ‘కృష్ణ ముకుంద మురారి’ ఒకటి. ఈ సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తూ బాగా పాపులర్ అయ్యింది నటి ప్రేరణ. ఈ ముద్దుగుమ్మ తాజాగా పెళ్లి చేసుకుంది. శ్రీపాద అనే యువకుడితో కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది. అక్టోబర్ చివరి వారంలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. తాజాగా ఇరు కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. వీరిద్దరి పెళ్లి కన్నడ సంప్రదాయం ప్రకారం జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కొత్త జంటకు సీరియల్ అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెప్తున్నారు. కలకాలం సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నారు. ప్రేరణ భర్త శ్రీపాదకు ఇండస్ట్రీతో సంబంధం లేనట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్తగా కొనసాగుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు మాత్రం బయటకు తెలియలేదు.
View this post on Instagram
View this post on Instagram
సినిమాల్లో నటించినా సీరియల్స్ తోనే మంచి గుర్తింపు
వాస్తవానికి తెలుగులో కొన్ని సీరియల్స్ కు మంచి క్రేజ్ ఉంది. అలాంటి వాటిలో 'కృష్ణ ముకుందా మరారీ' సీరియల్ ఒకటి. ఈ సీరియల్ కు తెలుగు రాష్ట్రాల్లో మంచి ప్రేక్షకాదరణ ఉంది. రేటింగ్ లో టాప్ లో ఉంటుంది. ఇందులో హీరోయిన్ గా నటిస్తూ బాగా పాపులారిటీ సంపాదించింది ప్రేరణ. ఆమె పుట్టింది హైదరాబాద్ లోనే అయినా, బెంగళూరులో పెరిగింది. చిన్నప్పటి నుంచే ఆమెకు నటన అంటే ఎంతో ఇష్టం. పలు కన్నడ సినిమాల్లో నటించింది. అయితే, అనుకున్న స్థాయిలో ఈమెకు గుర్తింపు రాలేదు. నెమ్మదిగా తన ప్రయాణాన్ని సీరియల్స్ వైపు మళ్లించింది. తెలుగులో 'కృష్ణ ముకుందా మరారీ' సీరియల్ తో హీరోయిన్ గా మారింది. మంచి నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. కృష్ణ అనే అమాయకపు అమ్మాయి పాత్రలో ఇట్టే ఒదిగిపోయి నటించింది. ఇప్పుడు శ్రీపాద అనే క్రురాడిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టింది.
Read Also: నీ సమస్య పరిష్కర్కిస్తే నాకేం ఇస్తావు అన్నాడు - ఆ సెలబ్రిటీపై శ్రీ సుధా షాకింగ్ కామెంట్స్
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)