అన్వేషించండి

‘ఆపరేషన్ వాలెంటైన్’ ఓటీటీ స్ట్రీమింగ్, త్రిషకి మెగా గిఫ్ట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయిన 'ఆపరేషన్ వాలెంటైన్', మరీ ఇంత త్వరగానా?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వైమానిక దాడులు, దేశభక్తి కలబోతగా కొన్ని రియల్ ఇన్సిడెంట్ ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాని రూపొందించారు. వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కింది. రిలీజ్ కు ముందు పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో ఆడియన్స్ లో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయి కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయినట్లు తెలుస్తోంది. 'ఆపరేషన్ వాలెంటైన్' ఓటీటీ స్ట్రీమింగ్ కి సంబంధించిన వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

త్రిషకి స్పెషల్ గిఫ్ట్ పంపిన మెగాస్టార్ - థ్యాంక్స్ చెప్పిన 'విశ్వంభర' హీరోయిన్!
చెన్నై బ్యూటీ త్రిష తెలుగులో చాలా కాలం తర్వాత స్ట్రెయిట్ మూవీ చేస్తోంది. ప్రజెంట్ కోలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన 'విశ్వంభర' మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. మెగాస్టార్ తో అప్పుడెప్పుడో 'స్టాలిన్' సినిమాలో నటించిన త్రిష.. మళ్లీ ఇన్నేళ్ళ తర్వాత 'విశ్వంభర' సినిమాలో జోడి కడుతుండడంతో మరోసారి ఈ జంటను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గానే త్రిష ఈ మూవీ సెట్స్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఇటీవలే చిరు, త్రిషలపై ఓ సాంగ్ కూడా షూట్ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం చిరంజీవి, త్రిష ఇద్దరు షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ గ్యాప్ లో. త్రిషకి చిరంజీవి స్పెషల్ గిఫ్ట్ పంపించారు. ఈ విషయాన్ని త్రిష స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

వైజాగ్ లో అడుగుపెట్టిన 'పుష్ప' - బన్నీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన ఫ్యాన్స్, వైరల్ అవుతున్న వీడియో!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'పుష్ప: ది రూల్' కోసం సినీ ఆడియన్స్ ఎంత ఆసక్తితో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'పుష్ప: ది రైజ్' భారీ విజయం అందుకోవడంతో 'పుష్ప2' ని మరింత గ్రాండ్ స్కేల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రీసెంట్ గా రామోజీ ఫిలిం సిటీ లో ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న మూవీ టీం నెక్స్ట్ షెడ్యూల్ ని వైజాగ్ లో ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే షూటింగ్ కోసం అల్లు అర్జున్ నేడు వైజాగ్ కు వెళ్లారు. బన్నీ వైజాగ్ వస్తున్నాడనే విషయం తెలియడంతో అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

అల్లు అర్జున్ Vs శివరాజ్ కుమార్ - పుష్పరాజ్​ను ఢీకొట్టబోతున్న ‘భైరతి రణగల్’
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన యాక్షన్ డ్రామా 'పుష్ప'. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ పాన్ ఇండియా చిత్రం.. 2021లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ఇప్పుడు రెండో భాగం 'పుష్ప: ది రూల్' మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ఆగస్టులో రాబోతున్న బన్నీకి సోలో డేట్ దొరకడం లేదు. పోటీగా ఇప్పుడు మరో అగ్ర హీరో వస్తుండటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

బాక్సాఫీస్ దగ్గర ‘గామి’ దూకుడు, రెండో రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో చాందినీ చౌదరి హీరోయిన్ గా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘గామి’. విద్యాధర్ దర్శకత్వంలో అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ చిత్రం శివరాత్రి కానుకగా మార్చి 8న  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తోంది. మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకెళ్తోంది. ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ ఈ మూవీకి మంచి స్పందన లభిస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Davos Tour: దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం - తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు దిగ్గజ సంస్థ యూనిలీవర్ అంగీకారం
దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం - తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు దిగ్గజ సంస్థ యూనిలీవర్ అంగీకారం
Janasena: జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు - గాజు గ్లాసు గుర్తు రిజర్వ్
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు - గాజు గ్లాసు గుర్తు రిజర్వ్
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల లిస్టులో మీ పేరు లేదా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల లిస్టులో మీ పేరు లేదా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ - ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ - ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Electric Wires Falling Down Baby Incident | అల్లవరం మండలంలో ప్రాణాలకే ప్రమాదంగా మారిన విద్యుత్ వైర్లు | ABP DesamGautam Adani Maha Kumbh Mela 2025 | ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో పాల్గొన్న అదానీ | ABP DesamJawan Karthik Passed Away | కశ్మీర్ లో ఉగ్రదాడి...కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి | ABP DesamSaif Ali Khan Discharged From Hospital | ఐదురోజుల తర్వాత ఇంటికి వచ్చిన సైఫ్ అలీఖాన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Davos Tour: దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం - తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు దిగ్గజ సంస్థ యూనిలీవర్ అంగీకారం
దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం - తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు దిగ్గజ సంస్థ యూనిలీవర్ అంగీకారం
Janasena: జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు - గాజు గ్లాసు గుర్తు రిజర్వ్
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు - గాజు గ్లాసు గుర్తు రిజర్వ్
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల లిస్టులో మీ పేరు లేదా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల లిస్టులో మీ పేరు లేదా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ - ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ - ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Janasena: 'నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం అంశం' - జనసేన కేంద్ర కార్యాలయం కీలక ఆదేశాలు
'నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం అంశం' - జనసేన కేంద్ర కార్యాలయం కీలక ఆదేశాలు
Viral News: చిన్నప్పుడు అమ్మా,నాన్న ఆటాడారు - 20 ఏళ్ల తర్వాత నిజంగానే భార్యభర్తలయ్యారు - ఇదో క్యూట్ లవ్ స్టోరీ
చిన్నప్పుడు అమ్మా,నాన్న ఆటాడారు - 20 ఏళ్ల తర్వాత నిజంగానే భార్యభర్తలయ్యారు - ఇదో క్యూట్ లవ్ స్టోరీ
Chandrababu Speech: హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం, పీ4 మోడల్‌తో మరిన్ని అద్భుతాలకు రెడీ: దావోస్‌లో చంద్రబాబు
హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం, పీ4 మోడల్‌తో మరిన్ని అద్భుతాలకు రెడీ: దావోస్‌లో చంద్రబాబు
Viral News: ఈమె లక్కీ స్టార్ - 4 కోట్ల ఆస్తి రాశారు అని ఫోన్ వస్తే సైబర్ స్కామ్ అనుకుంది - కానీ నిజమే !
ఈమె లక్కీ స్టార్ - 4 కోట్ల ఆస్తి రాశారు అని ఫోన్ వస్తే సైబర్ స్కామ్ అనుకుంది - కానీ నిజమే !
Embed widget