అన్వేషించండి

Allu Arjun : వైజాగ్ లో అడుగుపెట్టిన 'పుష్ప' - బన్నీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన ఫ్యాన్స్, వైరల్ అవుతున్న వీడియో!

Allu Arjun : 'పుష్ప 2' షూటింగ్ కోసం నేడు వైజాగ్ కి చేరుకున్న అల్లు అర్జున్ పై అభిమానులు వర్షం కురిపిస్తూ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.

Allu Arjun receives a massive welcome in Vizag : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'పుష్ప: ది రూల్' కోసం సినీ ఆడియన్స్ ఎంత ఆసక్తితో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'పుష్ప: ది రైజ్' భారీ విజయం అందుకోవడంతో 'పుష్ప2' ని మరింత గ్రాండ్ స్కేల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రీసెంట్ గా రామోజీ ఫిలిం సిటీ లో ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న మూవీ టీం నెక్స్ట్ షెడ్యూల్ ని వైజాగ్ లో ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే షూటింగ్ కోసం అల్లు అర్జున్ నేడు వైజాగ్ కు వెళ్లారు. బన్నీ వైజాగ్ వస్తున్నాడనే విషయం తెలియడంతో అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు.

వైజాగ్ లో అడుగుపెట్టిన అల్లు అర్జున్

'పుష్ప 2' షూటింగ్ లేటెస్ట్ షెడ్యూల్ ని వైజాగ్ లో ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే షూటింగ్ కోసం బన్నీ నేడు వైజాగ్ కి చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం అల్లు అర్జున్ వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో దిగారు. ఇక అల్లు అర్జున్ వైజాగ్ వస్తున్నాడనే విషయం తెలియడంతో ఆయన అభిమానులు భారీ ఎత్తున ఎయిర్ పోర్ట్ కి తరలివచ్చారు. వీరిలో లేడీ ఫ్యాన్స్ కూడా ఉండడం విశేషం. 

బన్నీపై పూల వర్షం కురిపిస్తూ ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్

వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో దిగిన బన్నీకి ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ చెబుతూ అక్కడి నుంచి బన్నీ బస చేసే హోటల్ వరకు బైక్ ర్యాలీతో తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పై పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. మరి కొంతమంది అభిమానులు బన్నీతో ఫోటోల కోసం ఎగబడ్డారు. ఫ్యాన్స్ అంతా భారీ ర్యాలీగా రావడంతో వైజాగ్ రోడ్లన్నీ ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ తో నిండిపోయాయి. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. కాగా రేపటి నుంచి వైజాగ్ పోర్ట్ ఏరియాలో 'పుష్ప 2' షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. ఇక్కడ అల్లు అర్జున్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

పాన్ వరల్డ్ లెవెల్ లో రిలీజ్ కి సన్నాహాలు

'పుష్ప 2' సినిమాని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం సుమారు రూ.300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ ని కేటాయిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాని పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు రష్యా, జపాన్, చైనా వంటి పలు దేశాల్లో 'పుష్ప2' రిలీజ్ ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా జపాన్ టోక్యోలో జరిగిన ఓ అవార్డ్స్ ఫంక్షన్ కి వెళ్లిన 'పుష్ప' హీరోయిన్ రష్మిక మందన్న 'పుష్ప2' ఒరిజినల్ వెర్షన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అదే రోజు జపాన్లో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు స్వయంగా వెల్లడించింది. అంతేకాదు ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, 'పుష్ప2' రిలీజ్ వరల్డ్ వైడ్ ఎంతో భారీగా ఉండబోతుందని చెప్పడంతో సినిమాని పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నట్లు స్పష్టమవుతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aaya Sher Song: ఆయా షేర్ కోసం రెండున్నర ఎకరాల్లో సెట్స్... సాంగ్ సెట్ స్టోరీ తెలుసా?
ఆయా షేర్ కోసం రెండున్నర ఎకరాల్లో సెట్స్... సాంగ్ సెట్ స్టోరీ తెలుసా?
Padhe Padhe Song: నయన్ సారికతో సంగీత్ శోభన్ లవ్ సాంగ్... 'రాకాస'లో మెలోడీ రిలీజ్ - లిరికల్ వీడియో చూశారా?
నయన్ సారికతో సంగీత్ శోభన్ లవ్ సాంగ్... 'రాకాస'లో మెలోడీ రిలీజ్ - లిరికల్ వీడియో చూశారా?
Ustaad Bhagat Singh Ticket Rates : ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
Rakasa OTT : రాకాస ఓటీటీ డీల్ ఫిక్స్ - హారర్ ఫాంటసీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
రాకాస ఓటీటీ డీల్ ఫిక్స్ - హారర్ ఫాంటసీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

వీడియోలు

Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
Josh Hazlewood to Miss IPL 2026 | ఐపీఎల్ 2026కు స్టార్ పేసర్ దూరం? | ABP Desam
Surya Kumar Yadav Apologizes to Axar Patel | అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య | ABP Desam
Did Dhoni Ruin Yuvraj Singh’s Career? | యువరాజ్ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడా? | ABP Desam
IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Formation Day: గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవం - పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యక్రమం
గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవం - పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యక్రమం
Telangana Tenth Class Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
Womens History Month.. తీర్మానంపై ట్రంప్ సంతకాలు
Womens History Month.. తీర్మానంపై ట్రంప్ సంతకాలు
Ustaad Bhagat Singh Ticket Rates : ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
Farmer admired by CM Chandrababu: ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
Aaya Sher Song: ఆయా షేర్ కోసం రెండున్నర ఎకరాల్లో సెట్స్... సాంగ్ సెట్ స్టోరీ తెలుసా?
ఆయా షేర్ కోసం రెండున్నర ఎకరాల్లో సెట్స్... సాంగ్ సెట్ స్టోరీ తెలుసా?
KTR Letter to Amit Shah: రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
AP Cabinet decisions: పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
Embed widget