అన్వేషించండి

డ్రాప్ అయిన ఆదిపురుష్, మహేష్ మూవీని లైట్ తీసుకున్న పూజా హెగ్డే - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

'ఆదిపురుష్' కలెక్షన్స్ - హిందీలో అలా, తెలుగులో ఇలా!
‘ఆదిపురుష్‌’కి ఇప్పటివరకూ వచ్చిన హైప్‌ ద్వారా, బుకింగ్‌ల ద్వారా తొలి వారాంతంలో మంచి వసూళ్లు వచ్చాయి. కానీ ప్రస్తుతం పలు కారణాలతో సినిమా కలెక్షన్లు సగానికి పడిపోయాయి. ఈ మూవీ రిలీజైన మొదటి మూడు రోజులు మంచి కలెక్షన్సే వచ్చాయి. అయితే, సోమవారం (జూన్ 19) నుంచి కష్టాలు మొదలయ్యాయి. కలెక్షన్స్ ఒక్కసారిగా కుప్పకూలాయి. బాక్సాఫీస్ వద్ద 'ఆదిపురుష్' చిత్రం సాధించిన కలెక్షన్ల విషయానికొస్తే.. ఈ సినిమా ఐదవ రోజున రూ.10+ కోట్లకు వసూళ్లు రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.395 కోట్లు వసూలు చేసిందని చిత్రయూనిట్ వెల్లడించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మీకు తెలుసా? చెర్రీ కంటే ఉపాసనే ధనవంతురాలు - ఆమె ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వడం ఖాయం!
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోకి మహాలక్ష్మి అడుగు పెట్టింది. నిన్న(మంగళవారం) తెల్లవారుజామున ఉపాసన పండంటి పాపకు జన్మినిచ్చింది. అమ్మాయి రాకతో మెగా స్టార్ ఇంట ఆనందాలు వెల్లువెత్తాయి. పలువురు సినీ ప్రముఖులు, మెగా అభిమానులు రామ్ చరణ్, ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. మనవరాలి రాకతో తాత మెగాస్టార్ చిరంజీవి ఆనందంలో తేలియాడారు.  హాస్పిటల్ కు వెళ్లి ముద్దుల మనువరాలిని చూసి మురిసిపోయారు.  చెర్రీ దంపతులకు పాప పుట్టడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. తమ ఫ్యామిలీకి ఎంతో ఇష్టమైన రోజే మనవరాలు జన్మించడం చాలా ఆనందంగా ఉందన్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మహేష్ సినిమాను లైట్ తీసుకున్న పూజా హెగ్డే?
'గుంటూరు కారం'లో పూజా హెగ్డే (Pooja Hegde) లేరని ఓ స్పష్టత వచ్చింది. ఆ సినిమా నుంచి ఆమె ఎందుకు తప్పుకొన్నారు? అనే అంశంలో ఇంకా సస్పెన్స్ మైంటైన్ అవుతోంది. తప్పించారా? లేదంటే డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమని ఆమె చెప్పేశారా? అనేది ఇంకా క్లారిటీ లేదు. రెండు మూడు రోజులుగా ఇటు తెలుగు, అటు హిందీ చిత్ర పరిశ్రమల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే... ఈ విషయం మీద పూజా హెగ్డే మౌనం వహిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

కిచెన్‌లో తమన్నా రొమాన్స్, పెళ్లికి ముందు రొమాన్స్ టెస్ట్ డ్రైవ్ లాంటిదట - ‘లస్ట్ స్టోరీస్ 2’ ట్రైలర్
బాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్ 2’ నుంచి లేటెస్ట్ అప్డేట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 2018లో వచ్చిన ‘లస్ట్ స్టోరీస్’కు ఇది సీక్వెల్. ఇందులో తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్, నీనా గుప్తా, అమృత సుభాష్, అంగద్ బేడీ, విజయ్ వర్మ లు కనిపించనున్నారు. ఇక ఈ సిరీస్ కు అమిత్ రవీంద్రనాథ్ శర్మ, కొంకణా సేన్ శర్మ, ఆర్ బాల్కి, సుజోయ్ ఘోష్ లు దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదల చేసిని ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన ట్రెలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ ట్రెలర్ నెట్టింట వైరల్ అవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఏపీ గవర్నమెంట్ టికెట్ రేట్స్ దెబ్బకు పవన్ కళ్యాణ్‌కు 30 కోట్లు లాస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైసీపీ ప్రభుత్వానికి, తెలుగు చిత్రసీమలో అగ్ర కథానాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కి మధ్య పరిస్థితి ఉప్పూ నిప్పు అన్నట్లు ఉంది. రెండు రాష్ట్రాల ప్రజలకు ఆ సంగతి తెలుసు. రాజకీయంగా మాత్రమే కాదు... సినిమాల పరంగానూ పవన్ కళ్యాణ్ మీద వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ''ఏపీలో అధికార పార్టీకి వ్యతిరేకమైన వారు ఎవరూ వ్యాపారం చేయకూడదనే పరిస్థితి ఉంది. పారిశ్రామిక వేత్తలకు వెయ్యి కోట్లు పోతే... నాకు రూ. 30 కోట్లు లేదంటే రూ. 40 కోట్లు పోతున్నాయి. 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' సినిమాల సమయంలో టికెట్స్ రేట్స్ తగ్గించారు. ఆ రెండు సినిమాలు పెద్ద హిట్. పది రూపాయలు టికెట్ పెడితే ఎప్పటికి పెట్టుబడి వస్తుంది? ఆ రెండు సినిమాలకు ఏపీ వరకు నష్టం వచ్చింది. ఆ భారం రూ. 30 కోట్లు నేనే భరించాను'' అని ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అయ్యప్ప దీక్ష తప్పా? స్కూల్ ప్రిన్సిపల్ ఘోర అవమానం!మోదీ పాటలు వింటారా? ప్రధాని నుంచి ఊహించని రిప్లైసీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
WhatsApp Stop Working: 2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
CM Chandrababu: తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Crime News:  టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Embed widget