By: ABP Desam | Updated at : 21 Jun 2023 02:26 PM (IST)
పూజా హెగ్డే... 'గుంటూరు కారం'లో మహేష్ బాబు
'గుంటూరు కారం'లో పూజా హెగ్డే (Pooja Hegde) లేరని ఓ స్పష్టత వచ్చింది. ఆ సినిమా నుంచి ఆమె ఎందుకు తప్పుకొన్నారు? అనే అంశంలో ఇంకా సస్పెన్స్ మైంటైన్ అవుతోంది. తప్పించారా? లేదంటే డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమని ఆమె చెప్పేశారా? అనేది ఇంకా క్లారిటీ లేదు. రెండు మూడు రోజులుగా ఇటు తెలుగు, అటు హిందీ చిత్ర పరిశ్రమల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే... ఈ విషయం మీద పూజా హెగ్డే మౌనం వహిస్తున్నారు.
మహేష్ సినిమాను లైట్ తీసుకున్న పూజ!?
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో ఇంతకు ముందు 'మహర్షి'లో పూజా హెగ్డే నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో', 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రాలు చేశారు. అటు హీరో, ఇటు దర్శకుడు... ఇద్దరితో సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్! గతంలో పని చేసిన వ్యక్తులు కలిసి చేస్తున్న సినిమా నుంచి ఆమె ఎందుకు తప్పుకోవలసి వచ్చింది? అనేది సామాన్య ప్రేక్షకులకు అంతుచిక్కని ప్రశ్న.
'గుంటూరు కారం'తో ముడిపడి తన గురించి విపరీతంగా కథనాలు వస్తున్నప్పటికీ... పూజా హెగ్డే లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. లేటెస్టుగా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేశారు. అందులో జిమ్ చేస్తున్న వీడియో అప్లోడ్ చేశారు. దానికి ''It’s not over… until I WIN'' అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. ''నేను విజయం సాధించే వరకు నా పని అయిపోయినట్టు కాదు'' అని పూజా హెగ్డే చెప్పారనుకోవచ్చు. వీడియోకి ఆ క్యాప్షన్ పర్ఫెక్ట్. పూజా హెగ్డే పని అయిపోయిందని కొందరు చేస్తున్న కామెంట్లకు కౌంటర్ కూడా అనుకోవచ్చేమో!?
డేట్స్ అడ్జస్ట్ కాకపోవడమే అసలు సమస్యా?
ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో సినిమాలు ఏవీ లేవని ప్రేక్షకులకు అనిపించవచ్చు. 'గుంటూరు కారం' మినహా మరో సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఆమె చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయట. అందులో రెండు బాలీవుడ్ సినిమాలు అని తెలిసింది.
పూజా హెగ్డే కథానాయికగా నటించనున్న ఓ బాలీవుడ్ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుందని సమాచారం. 'గుంటూరు కారం' షెడ్యూల్స్, ఆ సినిమా షెడ్యూల్స్ క్లాష్ అవుతున్నాయట! నిజానికి, 'గుంటూరు కారం' కోసం కొన్ని నెలలుగా పూజా హెగ్డే ఖాళీగా ఉన్నారు. చాలా రోజులు సినిమా కోసం వెయిట్ చేశారు. అనివార్య కారణాల వల్ల షెడ్యూల్స్ వాయిదా పడటంతో డేట్స్ అడ్జస్ట్ చేయడం పూజా హెగ్డేకు కుదరలేదని టాక్. ఆమె బదులు మరొక కథానాయికను త్రివిక్రమ్ ఎంపిక చేశారని ఫిల్మ్ నగర్ టాక్.
Also Read : పూజా హెగ్డేను తీసేసి మహేష్ సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్?
తమిళ, కన్నడ సినిమాల్లో అవకాశాలు!
రెండు హిందీ సినిమాలతో పాటు పూజా హెగ్డే ఓ తమిళ సినిమా, మరో కన్నడ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే... ఆ సినిమాలు ఏవీ ఇంకా అనౌన్స్ కాలేదు. అనౌన్స్ చేసే వరకు వెయిట్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి సైలెంట్‌గా ఉండాలని ఫిక్స్ అయ్యారట.
Also Read : పాపం వరుణ్ సందేశ్ - చివరకు డ్యాన్స్ టీమ్ లీడర్ రేంజ్‌కు...
Nayanthara: నయనతార చిత్రానికి చిక్కులు - బ్యాన్ చేయాలంటూ డిమాండ్
Suresh Kondeti: కావాలనే బురద జల్లుతున్నారు - కన్నడ స్టార్లకు జరిగిన అవమానంపై సురేష్ కొండేటి వివరణ
Hi Nanna: షారుఖ్ ఖాన్ క్లాసిక్ చిత్రంతో ‘హాయ్ నాన్న’కు పోలికలు! - క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
Naa Saami Ranga: ‘నా సామిరంగ’ హీరోయిన్ రివీల్ - నాగార్జునతో నటించే ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ
Allu Aravind: అది ఆయన ఫెయిల్యూర్, మా కుటుంబంలో ఎవరికీ పీఆర్వో కాదు: ‘సంతోషం’ వివాదంపై అల్లు అరవింద్ కామెంట్స్
Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం
BRS Party News: ఇక తెలంగాణ భవన్ కేంద్రంగా బీఆర్ఎస్ పాలిటిక్స్: ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచనలు
తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!
Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్
/body>