Pooja Hegde - Trivikram : పూజా హెగ్డేను తీసేసి మహేష్ సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్?
మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమాలో పూజా హెగ్డేను తీసేశారని రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించలేదు. లేటెస్ట్ టాక్ అంటే ఆమె బదులు మరొకరిని సెలెక్ట్ చేశారట.
'అతడు', 'ఖలేజా' వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కలయికలో రూపొందుతోన్న సినిమా 'గుంటూరు కారం'. ఇందులో పూజా హెగ్డే ఓ కథానాయిక. అది గతంలో! ఇప్పుడు అయితే సినిమాలో ఆమె లేరు. అందులో మరో మాటకు తావు లేదు!
నిజమే... 'గుంటూరు కారం'లో పూజా హెగ్డే నటించడం లేదు. ఎందుకు? ఏమిటి? అనేది ప్రస్తుతానికి బయటకు రాలేదు. చిత్ర బృందం సైతం అధికారికంగా దీని గురించి ఏమీ స్పందించలేదు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఆల్రెడీ పూజా హెగ్డే బదులు మరొక కథానాయికను ఎంపిక చేశారట!
పూజా పోయే... సంయుక్త వచ్చే!
'గుంటూరు కారం'లో పూజా హెగ్డే బదులు మలయాళ భామ సంయుక్తా మీనన్ (Samyuktha Menon)ను ఎంపిక చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల కథనం. గురూజీ స్క్రిప్ట్, పర్యవేక్షణలో రూపొందిన 'భీమ్లా నాయక్'తో తెలుగు తెరకు సంయుక్తా మీనన్ పరిచయం అయ్యారు. ఆ తర్వాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మించిన 'సార్'లో కూడా నటించారు. ఆ సినిమా వేడుకలో ఆమెకు త్రివిక్రమ్ సరదాగా ఐ లవ్యూ చెప్పడం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించే అవకాశాన్ని సంయుక్త అందుకున్నారట!
'గుంటూరు కారం'లో పూజా హెగ్డే బదులు సంయుక్తను సెలెక్ట్ చేశారని సమాచారం. ఇది నిజమైతే... తెలుగులో ఆమెకు పెద్ద అవకాశం వచ్చినట్లే. ఆల్రెడీ 'గుంటూరు కారం'లో శ్రీ లీల నటిస్తున్న సంగతి తెలిసిందే.
శనివారం నుంచి లేటెస్ట్ షెడ్యూల్!
'గుంటూరు కారం' లేటెస్ట్ షెడ్యూల్ శనివారం నుంచి స్టార్ట్ కానుంది. అందులో మహేష్ బాబు సహా ఇతర ప్రధాన తారాగణం అందరూ జాయిన్ కానున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం మీద సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆయన కూడా సినిమా నుంచి తప్పుకొన్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని ఆయన ఖండించారు.
— Samyuktha (@iamsamyuktha_) May 21, 2023
ఇంకా 80 రోజులు బ్యాలన్స్!
జనవరి నుంచి 'గుంటూరు కారం' సినిమా చిత్రీకరణ శరవేగంగా చేస్తున్నారు. హీరో మహేష్, ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా... కీలక సన్నివేశాలు, యాక్షన్ సీన్లు కొన్ని తెరకెక్కించారు. అయితే... ఇంకా 80 రోజుల వర్క్ బ్యాలెన్స్ ఉందట. ఎలా లేదన్నా మినిమమ్ మూడు నెలలు షూటింగ్ చేయాలట.
Also Read : పూర్ణ మళ్ళీ వచ్చిందోయ్ - అవును, 'ఢీ 16'తో రెడీ!
కర్రసాముతో రౌడీలను చితక్కొడుతూ 'మాస్ స్ట్రైక్'లో మహేష్ బాబు అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. గళ్ళ చొక్కా, తలకి ఎర్ర కండువా... ఆయన సరికొత్త మాస్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నోటిలో నుంచి బీడీ తీసి, స్టైలుగా వెలిగించి 'ఏంది అట్టా చూస్తున్నావు... బీడీ త్రీడీలో కనపడుతుందా" అంటూ తనదైన శైలిలో డైలాగ్ చెప్పి ఎప్పటిలా ఫిదా చేశారు మహేష్.
Also Read : రామ్ చరణ్ ఇంట మాత్రమే కాదు, ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే