Crime News: టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
Andhra Pradesh: టీడీపీ కండువాలు వేసుకుని అనధికారిక టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే నిరసనలో భాగంగా చేశామని వారు పోలీసులకు చెబుతున్నారు.
YSRCP: ఓ రోడ్‌పై అనధికారిక టోల్ గేట్ పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారన్న కారణంగా వైసీపీకి చెందిన ప్రేమే కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మెడలో పసుపు కండువాలు వేసుకుని ఓ రోడ్డు మీద టోల్ అనే బోర్డులు ఇద్దరు మనుషులతో ఏర్పాటు చేయించి .. ఓ సెక్యూరిటీ గార్డును కూడా పెట్టుకుని వచ్చి పోయే వాహనాలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు ప్రేమ్ కుమార్ ను అరెస్టు చేశారు.
ప్రభుత్వానికి, టీడీపీకి చెడ్డపేరు తెచ్చేందుకు ఇలా చేశాడన్న ఆరోపణలు టీడీపీ కార్యకర్తలు చేస్తున్నారు.
తెలుగుదేశం కండువా కప్పుకుని, ప్రైవేటు టోల్ గెట్ లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న, జగన్ రెడ్డి ముఖ్య అనుచరుడు, తాడేపల్లి ప్యాలెస్ లో తోట పని చేసే కోరిటిపాటి ప్రేమ్ కుమార్ ని అరెస్ట్ చేసిన గుంటూరు పోలీసులు.. pic.twitter.com/sBiHLopobl
— Guru Dharanidhar Medasani (B -ve Blood Group) (@GuruDharanidhar) December 12, 2024
Also Read: రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
టీడీపీ కండువాలతో టోల్ గేట్లు డబ్బులు వసూలు చేయడం వెనుక కుట్ర ఉందన్న ఉద్దేశంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే తాము నిరసన వ్యక్తం చేస్తున్నామని ఆ వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రేమ్ కుమార్ వీడియో మాత్రమే తీసుకున్నాడని ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. వీడియోలో డబ్బులు ఇస్తున్న వారు కూడా ప్రేమ్ కుమార్ ఏర్పాటు చేసిన వ్యక్తులేనని అంటున్నారు.
తెలుగుదేశం కండువా కప్పుకుని, ప్రైవేటు టోల్ గెట్ లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న, జగన్ రెడ్డి ముఖ్య అనుచరుడు, తాడేపల్లి ప్యాలెస్ లో తోట పని చేసే కోరిటిపాటి ప్రేమ్ కుమార్ ని అరెస్ట్ చేసిన గుంటూరు పోలీసులు. pic.twitter.com/kC1tmeYK0r
— CBN Era (@CBN_Era) December 12, 2024
Also Read: మమతా బెనర్జీ నేతృత్వంలోకి ఇండియా కూటమి - చేరేందుకు వైఎస్ఆర్‌సీపీ సిద్దమని సంకేతాలు ?
కూటమి ప్రభుత్వం స్థానిక రహదారులపైనా టోల్స్ వసూలు చేయాలనుకుంటోంది కాబట్టి దానికి నిరసన వ్యక్తం చేశారని అంతే తప్ప డబ్బులు వసూలు చేయాలని కాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసుల్ని కలిసి వివరించారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని అరెస్టు చేస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
గుంటూరు:
— YSRCP Legal Cell (@YSRCPLegalCell) December 12, 2024
సోషల్ మీడియా యాక్టివిస్టు ప్రేమ్ కుమార్ అక్రమ అరెస్ట్ పై ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అడిషనల్ ఎస్పీని కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మరియు లీగల్ సెల్ సభ్యులు.#WeAreWithYSRCPSM #YSRCP #AndhraPradesh https://t.co/UMc2TS2EGt pic.twitter.com/0ATmp8VNAA
అయితే సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఇలా డబ్బులు వసూలు చేసుకునే పద్దతి ఎంచుకోవడం మాత్రం.. ఆ ప్రేమ్ కుమార్ ను జైలుకు పంపేలా చేసింది.