Pawan Kalyan : ఏపీ గవర్నమెంట్ టికెట్ రేట్స్ దెబ్బకు పవన్ కళ్యాణ్‌కు 30 కోట్లు లాస్
ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు తగ్గించడంతో తనకు 30 కోట్లు నష్టం వచ్చినట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైసీపీ ప్రభుత్వానికి, తెలుగు చిత్రసీమలో అగ్ర కథానాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కి మధ్య పరిస్థితి ఉప్పూ నిప్పు అన్నట్లు ఉంది. రెండు రాష్ట్రాల ప్రజలకు ఆ సంగతి తెలుసు. రాజకీయంగా మాత్రమే కాదు... సినిమాల పరంగానూ పవన్ కళ్యాణ్ మీద వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
టికెట్ రేట్లు తగ్గించడమే కాదు...
రాజకీయాల్లోకి వెళ్ళిన కొత్తల్లో పవన్ కళ్యాణ్ సినిమాలు అసలు చేయలేదు. 'వకీల్ సాబ్'తో ఆయన మళ్ళీ సినిమాలు స్టార్ట్ చేశారు. ఆ సినిమా విడుదల సమయంలో ఏపీ ప్రభుతం నుంచి కఠిన పరిస్థితులు ఎదురు అయ్యాయి. వంద రూపాయలకు పైగా ఉన్న టికెట్ రేటును తగ్గించారు. నేల టికెట్ రేటు అయితే ఐదు, పది మంది రూపాయలకు తీసుకు వచ్చారు.
టికెట్ రేట్లు తగ్గించడమే కాదు... ప్రతి థియేటర్ దగ్గర ప్రభుత్వ నిబంధలనకు లోబడి టికెట్స్ రేట్స్ అమ్ముతున్నారో? లేదో? అని చెక్ చేయడానికి ప్రభుత్వ అధికారులను సైతం నియమించారు. టికెట్ రేట్స్ తగ్గించడం వల్ల తనకు 30 కోట్ల రూపాయలు లాస్ వచ్చినట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఆ రూ. 30 కోట్లు నేనే భరించా!
''ఏపీలో అధికార పార్టీకి వ్యతిరేకమైన వారు ఎవరూ వ్యాపారం చేయకూడదనే పరిస్థితి ఉంది. పారిశ్రామిక వేత్తలకు వెయ్యి కోట్లు పోతే... నాకు రూ. 30 కోట్లు లేదంటే రూ. 40 కోట్లు పోతున్నాయి. 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' సినిమాల సమయంలో టికెట్స్ రేట్స్ తగ్గించారు. ఆ రెండు సినిమాలు పెద్ద హిట్. పది రూపాయలు టికెట్ పెడితే ఎప్పటికి పెట్టుబడి వస్తుంది? ఆ రెండు సినిమాలకు ఏపీ వరకు నష్టం వచ్చింది. ఆ భారం రూ. 30 కోట్లు నేనే భరించాను'' అని ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ 'బ్రో'కు ఇబ్బందులు వస్తాయా?
ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అయితే... వాటిలో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, ఆయన కలిసి నటించిన 'బ్రో' సినిమా ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా విషయంలో ఇబ్బందులు ఏమైనా తలెత్తుతాయా? అనే సందేహం నెలకొంది. జూలై 28న ఈ సినిమా విడుదల కానుంది.
Also Read : పాపం వరుణ్ సందేశ్ - చివరకు డ్యాన్స్ టీమ్ లీడర్ రేంజ్‌కు...
పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వ టికెట్ విధానంపై కామెంట్స్ చేయడంతో 'బ్రో' విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ చిత్రానికి నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. ఇందులో కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా ప్రత్యేక గీతం చేశారు.
'బ్రో' కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజీత్ దర్శకత్వంలో 'ఓజీ', క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' సినిమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆ సినిమా షూటింగులు శరవేగంగా జరుగుతున్నాయి.
Also Read : మహేష్ సినిమాను లైట్ తీసుకున్న పూజా హెగ్డే?