అన్వేషించండి

సూర్య ‘కంగువా’ గ్లింప్స్, నితిన్ ‘ఎక్స్‌ట్రా’ ఫస్ట్‌లుక్ రిలీజ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

‘ఒక్కడే ఒక్క వీరుడురా, యుద్ధమై ఉరుకు సూర్యుడురా’ - సూర్య ‘కంగువా’ గ్లింప్స్ వచ్చేసింది!
తమిళ సూపర్ స్టార్ సూర్య నటిస్తున్న పీరియాడిక్ సినిమా ‘కంగువా’. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. ‘కంగువా’ గ్లింప్స్‌ను సూర్య పుట్టినరోజు సందర్భంగా జులై 23వ తేదీన అర్థ రాత్రి 12:01 గంటలకు విడుదల చేశారు. సూర్య ఈ సినిమాలో యోధుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇక గ్లింప్స్ విషయానికి వస్తే... గుట్టలు గుట్టలుగా ఉన్న శవాలపై నుంచి సూర్య ఎంట్రీ ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో తనకు ఎలివేషన్ ఇస్తూ ‘అఖిలాండం ఏలిన మారాక్రుని వంశకుడు...’ అంటూ సాగే సాంగ్, చివర్లో రోలెక్స్ ఎక్స్‌ప్రెషన్‌ను గుర్తు చేస్తూ ‘కుశలమా’ అనే సూర్య డైలాగ్‌తో తన ఫేస్‌ను రివీల్ చేయడం, వేలాది మంది సైన్యం బాణాలు వేయడం... ఒక విజువల్ ఫీస్ట్‌గా కట్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'ఎక్స్ట్రా - ఆర్డినరీ మ్యాన్'గా నితిన్ - హీరో వేరియేషన్ చూశారా?
నితిన్ కథానాయకుడిగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి ప్రేక్షకులకు తెలుసు. హీరోగా నితిన్ 32వ చిత్రమిది. ఈ సినిమాకు 'ఎక్స్ట్రా' టైటిల్ ఖరారు చేశారు. ఆర్డినరీ మ్యాన్ అనేది ఉపశీర్షిక. ఈ రోజు టైటిల్ వెల్లడించడంతో పాటు సినిమాలో హీరో ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అందులో రెండు గెటప్పుల్లో నితిన్ కనిపించారు. కింద కూర్చున్న లుక్కులో మాంచి స్టైలిష్ గా కనపడితే... పైన లుక్కులో గుబురు గడ్డంతో కనిపించారు. ఆ రెండు లుక్కులో ఏది ఎక్స్ట్రా, ఏది ఆర్డినరీ అనేది చూడాలి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘ఓపెన్‌హైమర్’ మూవీ‌లో ‘భగవద్గీత’కు అవమానం, ఆ శృంగార సన్నివేశాన్ని తొలగించాలని డిమాండ్!
హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ కు సినిమాలు ప్రత్యేకశైలిని కలిగి ఉంటాయి. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో 'బ్యాట్ మ్యాన్ బిగిన్స్', 'ది డార్క్ నైట్', 'ది డార్క్ నైట్ రైజెస్', 'డంకర్క్' వంటి సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతేకాదు ఇండియాలోనూ నోలన్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం హాలీవుడ్ లో ఉన్న టాప్ దర్శకుల్లో నోలన్ ఒకరు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తారు. ఆ దర్శకుడి నుంచి వచ్చిన తాజా సినిమా ‘ఓపెన్ హైమర్’. అమెరికా శాస్త్రవేత్త, అణుబాంబు పితామహుడు అయిను ఓపెన్ హైమర్ పేరుతోనే ఈ సినిమా తెరకెక్కించాడు దర్శకుడు నోలన్. ప్రస్తుతం ఈ సినిమా మిశ్రమ స్పందనతో థియేటర్లలో దూసుకుపోతోంది. అయితే ఇప్పుడీ సినిమా కొత్త చిక్కుల్లో పడింది. మూవీలో భగవద్గీతను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని,  సినిమాను వెంటనే బ్యాన్ చేయాలని కొంతమంది హిందూవర్గానికి చెందినవారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

అసలు సిసలైన పాన్ ఇండియా కాస్ట్ - మోహన్ లాల్ 'వృషభ' షూటింగ్ మొదలు
ఇప్పుడు సినిమాకు హద్దులు, సరిహద్దులు తొలగిపోయాయి. సినిమాను ఏ భాషలో తీశారు? అనేది ముఖ్యం కాదు... అన్ని భాషల ప్రేక్షకుల ఆదరణ లభించిందా? లేదా? అనేది ముఖ్యం. అందుకని, పాన్ ఇండియా విడుదలపై అందరూ దృష్టి పెడుతున్నారు. 'వృషభ' సినిమాకు వస్తే... అసలు సిసలైన పాన్ ఇండియా కాస్ట్ ఉన్న సినిమా అని చెప్పాలి. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'వృషభ'. ఇందులో శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ మేకా కుమారుడు రోషన్, హిందీ హీరో సంజయ్ కపూర్ కుమార్తె షనాయా కపూర్ జంటగా నటిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘భోళా శంకర్’ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది - మెగా ఫ్యాన్స్‌కు పండగే!
మెగా స్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఓ వైపు షూటింగ్ పనులు పూర్తి చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ ను కూడా షురూ చేస్తున్నారు మేకర్స్. ఇక చిరంజీవి కూడా చిరు లీక్స్ అంటూ మూవీ నుంచి అప్డేట్ లు ఇస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీకు సంబంధించిన మరో అప్డేట్ వచ్చేసింది. త్వరలో మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీంతో మెగా ఫ్యాన్స్ మూవీ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు.  (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget