అన్వేషించండి

‘రాజాసాబ్’ రిలీజ్ డేట్‌పై మారుతి కామెంట్, ‘పుష్ప 2’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

మన చేతుల్లో ఏం లేదు - ‘రాజా సాబ్’ విడుదల తేదీపై మారుతీ కామెంట్స్
పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత ప్రభాస్ లాంటి హీరో.. మారుతీ లాంటి మీడియం బడ్జెట్ సినిమాలను తెరకెక్కించే దర్శకుడితో సినిమాను ఒప్పుకోవడంతో ఒక్కసారిగా ప్రేక్షకులంతా షాక్ అయ్యారు. పైగా ఈ వార్త నిజమా, కాదా అని చెప్పడానికి మారుతీ కూడా ముందుకు రాలేదు. సైలెంట్‌గానే సినిమా షూటింగ్‌ను కూడా ప్రారంభించారు. ఇక ఈ మధ్య కొంచెం కొంచెంగా మూవీ గురించి అప్డేట్స్ బయటికొస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా మారుతీ, ప్రభాస్ కాంబినేషన్ మూవీ టైటిల్ ‘రాజా సాబ్’ అంటూ.. దాని ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. తాజాగా ‘రాజా సాబ్’ రిలీజ్ డేట్ గురించి మారుతీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

భార్యను పరిచయం చేసిన ప్రశాంత్‌ వర్మ - ఎంత అందంగా ఉందో చూశారా?
హనుమాన్‌ సక్సెస్‌ మీట్‌ ప్రశాంత్‌ అందరిని సర్‌ప్రైజ్‌ చేశాడు. మూవీ ఈవెంట్‌లో తన భార్యను పరిచయం చేసి షాకిచ్చాడు. అదీ చూసి అమ్మాయిలంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో బాక్సాఫీసు వద్ద హనుమాన్‌ దుమ్మురేపుతుంది. విడుదలై మూడు వారాలు దాటినా ఇంకా థియేటర్లో హనుమాన్‌ జోరు కొనసాగుతుంది. ఇప్పిటికీ వీకెండ్స్‌ హనుమాన్‌ థియేటర్లు హౌజ్‌ఫుల్‌ చూపిస్తున్నాయి. అంతగా ప్రేక్షకులను హనుమాన్‌తో ఆకట్టుకున్నాడు ప్రశాంత్‌ వర్మ. పాన్‌ ఇండియా వైడ్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న హనుమాన్‌ మూవీ ఇప్పటికే మేకర్స్‌ను భారీ లాభాల్లో పడేసింది. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్‌లో హనుమాన సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది చిత్ర యూనిట్‌. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘పుష్ప ది రూల్’ నుంచి ఆసక్తికర అప్డేట్ - ఆ విషయంలో తగ్గేదేలే అంటూ ప్రకటన
ప్రస్తుతం ఎన్నో పాన్ ఇండియా సీక్వెల్స్ కోసం దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అంతా ఎదురుచూస్తున్నారు. అందులో ‘పుష్ప ది రూల్’ కూడా ఒకటి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప ది రైజ్’.. 2021 డిసెంబర్‌లో విడుదలయ్యింది. ఇక ఈ మూవీ విడుదలయ్యి రెండున్నర సంవత్సరాలు దాటిపోయినా.. ఇంకా సెకండ్ పార్ట్‌ షూటింగ్ దశలోనే ఉండడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. అందుకే కొన్నిరోజుల క్రితం ‘పుష్ప ది రూల్’ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. తాజాగా విడుదల తేదీ కోసం ప్రేక్షకులను ఎదురుచూడమంటూ ఒక పోస్ట్‌ను షేర్ చేసింది మూవీ టీమ్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘హనుమాన్’ ఖాతాలో మరో అరుదైన రికార్డ్ - ఈ ఏడాదిలో ఇదే ఫస్ట్ టైమ్
ఈరోజుల్లో సినిమాలు చాలా అరుదుగా ఎక్కువరోజులు హౌజ్‌ఫుల్ షోలతో రన్ అవుతున్నాయి. ఇక 2024 సంక్రాంతికి విడుదలయిన అన్ని సినిమాల్లో ‘హనుమాన్’ మాత్రమే ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా హౌజ్‌ఫుల్ షోలతో రన్ అవుతోంది. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీ.. విజువల్ వండర్‌గా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. అంతే కాకుండా పాజిటివ్ మౌత్ టాక్‌తో ఇప్పటికీ రన్ అవ్వడంతో కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి. 2024లో ఎన్నో బాక్సాఫీస్ రికార్డ్‌ను సృష్టించిన మొదటి సినిమాగా ‘హనుమాన్’ నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ రికార్డుల ఖాతాలో మరొకటి వచ్చి చేరింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మళ్లీ సంక్రాంతే టార్గెట్, పోటీని లెక్కచేయని నాగార్జున - తర్వాతి మూవీపై కీలక అప్‌డేట్ ఇచ్చిన నాగ్
కొంతమంది హీరోలకు కొన్ని విడుదల తేదీలు సెంటిమెంట్‌గా ఉంటాయి. ఆ సమయంలో విడుదల చేస్తే.. తమ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని నమ్ముతారు. అలాంటి హీరోల్లో నాగార్జున కూడా ఒకరు. తన సినిమాలు సంక్రాంతికి విడులదయితే కచ్చితంగా హిట్ అవుతాయని ఈ సీనియర్ హీరో బలంగా నమ్మెతారు. అందుకే చాలావరకు సంక్రాంతికి ఎంత పోటీ ఉన్నా.. తన సినిమా కచ్చితంగా ఆడుతుందని నమ్మి బరిలోకి దించుతారు. ఈసారి అలా ‘నా సామిరంగ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన అనుకున్నట్టుగానే మూవీ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్‌లో తన తరువాతి మూవీపై కీలక అప్డేట్ అందించారు నాగ్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget