అన్వేషించండి

Prasanth Varma: భార్యను పరిచయం చేసిన ప్రశాంత్‌ వర్మ - ఎంత అందంగా ఉందో చూశారా?

Prashanth Varma Wife : యంగ్‌ లుక్‌లో కనిపిస్తున్న ప్రశాంత్‌ వర్మ ఇంకా సింగిలనే అనుకుంటున్నారంతా. కానీ తాజాగా జరిగిన హనుమాన్‌ సక్సెస్‌ మీట్‌ ప్రశాంత్‌ అందరికి షాకిచ్చాడు.

Director Prashanth Varma Wife Details: హనుమాన్‌ సినిమాతో ఒక్కసారిగా హాట్‌టాపిక్‌ అయ్యాడు యంగ్‌ అండ్‌ టాలంటెడ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ. ఇండస్ట్రీ అంతా ఇప్పుడు ప్రశాంత్‌ వర్మ గురించే మాట్లాడుకుంటుంది. ఇక సోషల్‌ మీడియాలో అయతే ఆయనను పొగుడుతూ వీడియోలు, రీల్స్‌ దర్శనం ఇస్తున్నాయి. తన సినిమాటిక్‌ యూనివర్స్‌తో సినీ ప్రియులను అంతగా ఆకట్టుకున్న ప్రశాంత్‌ వర్మ ఇప్పుడు అమ్మాయిల క్రష్‌గా కూడా మారిపోయాడు. సోషల్‌ మీడియాలో పేజీలో ఎక్కడ చూసి ప్రశాంత్‌ వర్మ ఫ్యాన్‌ గర్ల్‌ అంటూ అమ్మాయిల పేజీలు పుట్టుకొస్తున్నాయి. తమ కలల రాకుమారుడు ఇలానే ఉండాలంటూ ప్రశాంత్‌ వర్మ వీడియోలు షేర్‌ చేస్తున్నారు. 

యంగ్‌ లుక్‌లో కనిపిస్తున్న ప్రశాంత్‌ వర్మ ఇంకా సింగిల్‌ అనే అనుకుంటున్నారంతా. కానీ తాజాగా జరిగిన హనుమాన్‌ సక్సెస్‌ మీట్‌ ప్రశాంత్‌ అందరిని సర్‌ప్రైజ్‌ చేశాడు. మూవీ ఈవెంట్‌లో తన భార్యను పరిచయం చేసి షాకిచ్చాడు. అదీ చూసి అమ్మాయిలంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో బాక్సాఫీసు వద్ద హనుమాన్‌ దుమ్మురేపుతుంది. విడుదలై మూడు వారాలు దాటినా ఇంకా థియేటర్లో హనుమాన్‌ జోరు కొనసాగుతుంది. ఇప్పిటికీ వీకెండ్స్‌ హనుమాన్‌ థియేటర్లు హౌజ్‌ఫుల్‌ చూపిస్తున్నాయి. అంతగా ప్రేక్షకులను హనుమాన్‌తో ఆకట్టుకున్నాడు ప్రశాంత్‌ వర్మ. పాన్‌ ఇండియా వైడ్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న హనుమాన్‌ మూవీ ఇప్పటికే మేకర్స్‌ను భారీ లాభాల్లో పడేసింది. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్‌లో హనుమాన సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది చిత్ర యూనిట్‌.
Prasanth Varma: భార్యను పరిచయం చేసిన ప్రశాంత్‌ వర్మ - ఎంత అందంగా ఉందో చూశారా?

భార్య అంటూ షాకిచ్చిన ప్రశాంత్ వర్మ

ఈ సందర్భంగా ప్రశాంత్‌ వర్మ మాట్లాడుతూ.. డైరెక్టర్‌గా ఈ జర్నీలో తనకు అండగా నిలిచి సపోర్టు ఇచ్చిన నా భార్య సుకన్యకు థ్యాంక్స్‌ అంటూ చెప్పడంతో ప్రతి ఒక్కరు అవాక్కాయ్యారు. అతడికి పెళ్లయిపోయిందని, అందమైన భార్య ఉందని అప్పుడే అందరికీ తెలిసింది. ఇప్పుడు ఇదే వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అమ్మాయిల గుండె పగిలిపోయిందంటూ మీమ్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. దీంతో ప్రశాంత్‌ వర్మ భార్య ఇప్పుడు హాట్‌టాపిక్‌ అయ్యింది. ఈ దెబ్బతో ఆమె ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ప్రశాంత్‌ వర్మ భార్య చాలా అందంగా ఉందని, ఇద్దరు ఈడుజోడు బాగుందంటూ ఇద్దరి ఫొటోలను కలిసి సోషల్‌ మీడియాల్లో వైరల్‌ చేస్తున్నారు. అయితే ప్రశాంత్‌ వర్మ పెద్దలు  కుదిర్చిన వివాహమేనట. పాలకొల్లుకు చెందిన ప్రశాంత్ నాలుగేళ్ల క్రితమే సుకన్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

అంటే లాక్‌డౌన్‌ టైంలో అతడి పెళ్లయినట్టు తెలుస్తోంది. అప్పటి అతడు చిన్న డైరెక్టర్‌ కావడంతో ఈ విషయం పెద్దగా ఎవరికి తెలియదు. దీంతో ఇప్పటి వరకు అతడు సింగిల్‌ అని అంతా అభిప్రాయపడ్డారు. కాగా ప్రశాంత్‌ వర్మ డైరెక్టర్‌గా కంటే ముందు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో షార్ట్‌ ఫిలింస్‌ చేస్తూ డైరెక్టర్‌గా మారాడు. ఈ క్రమంలో నాని నిర్మించిన 'అ!' సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. ఈ మూవీ పెద్దగా విజయం సాధించకపోయినా కథలో కొత్తదనం ఉందంటూ అందరిచేత ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత 'కల్కి', 'జాంబీరెడ్డి' చిత్రాలతో ఇండస్ట్రీకి కొత్త జానర్లను పరిచయం చేసి టాలంటెడ్‌ డైరెక్టర్‌గా ప్రూవ్‌ చేసుకున్నాడు. ఇక అదే క్రేజ్‌తో సూపర్‌ హీరో జానర్‌తో 'హనుమాన్‌' తెరకెక్కించిన ప్రశాంత్‌ వర్మ.. ఇప్పుడు ఏకంగా సినిమాటిక్‌ యూనివర్స్‌నే క్రియేట్‌ చేయబోతున్నాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bombhaat Memes (@bombhaat_memes)

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today June 29th:దివ్యాంక చెంప పగులగొట్టిన నిషిక....కోడలిలో వచ్చిన మార్పు చూసి షాక్‌ తిన్న వైజయంతి
జగద్ధాత్రి సీరియల్: దివ్యాంక చెంప పగులగొట్టిన నిషిక....కోడలిలో వచ్చిన మార్పు చూసి షాక్‌ తిన్న వైజయంతి
NTR Trivikram Movie Story : షణ్ముఖుడిగా ఎన్టీఆర్ - త్రిశూలంలో DNA... త్రివిక్రమ్ విజనరీ పోస్టర్ స్టోరీ ఏంటంటే?
షణ్ముఖుడిగా ఎన్టీఆర్ - త్రిశూలంలో DNA... త్రివిక్రమ్ విజనరీ పోస్టర్ స్టోరీ ఏంటంటే?
NTR God Of War : ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ - కుమార స్వామిగా మ్యాన్ ఆఫ్ మాసెస్... మాటల మాంత్రికుడి విజన్ వేరే లెవల్
ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ - కుమార స్వామిగా మ్యాన్ ఆఫ్ మాసెస్... మాటల మాంత్రికుడి విజన్ వేరే లెవల్
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget