అన్వేషించండి

Pushpa The Rule: ‘పుష్ప ది రూల్’ నుంచి ఆసక్తికర అప్డేట్ - ఆ విషయంలో తగ్గేదేలే అంటూ ప్రకటన

Pushpa The Rule: సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప ది రూల్’ మూవీ నుంచి మేకర్స్ ఒక అప్డేట్‌ను విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్‌లో జోష్ నింపే ప్రయత్నం చేశారు.

Pushpa The Rule Update: ప్రస్తుతం ఎన్నో పాన్ ఇండియా సీక్వెల్స్ కోసం దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అంతా ఎదురుచూస్తున్నారు. అందులో ‘పుష్ప ది రూల్’ కూడా ఒకటి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప ది రైజ్’.. 2021 డిసెంబర్‌లో విడుదలయ్యింది. ఇక ఈ మూవీ విడుదలయ్యి రెండున్నర సంవత్సరాలు దాటిపోయినా.. ఇంకా సెకండ్ పార్ట్‌ షూటింగ్ దశలోనే ఉండడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. అందుకే కొన్నిరోజుల క్రితం ‘పుష్ప ది రూల్’ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. తాజాగా విడుదల తేదీ కోసం ప్రేక్షకులను ఎదురుచూడమంటూ ఒక పోస్ట్‌ను షేర్ చేసింది మూవీ టీమ్.

ఆసక్తికర అప్డేట్..

‘‘పుష్ప రాజ్ తన రూల్‌ను మొదలుపెట్టడానికి ఇంకా 200 రోజులు ఉంది. 2024, ఆగస్ట్ 15న ‘పుష్ప: ది రూల్’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవ్వనుంది’’ అంటూ మూవీ టీమ్ సోషల్ మీడియాలో కౌంట్ డౌన్ షేర్ చేసింది. రిలీజ్ విషయంలో అస్సలు వెనక్కి తగ్గేదేలే అని స్పష్టం చేసింది. ఇటీవల ‘పుష్ప ది రూల్’ విడుదల తేదీని ప్రకటించడంతో పాటు చిన్న గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. ఆ తర్వాత ఒకట్రెండు పోస్టర్లు బయటికొచ్చాయి. అంతకు మించి ఈ మూవీ షూటింగ్ గురించి ఎలాంటి అప్డేట్ బయటికి రాలేదు. ఇప్పటికీ సుకుమార్ గానీ, అల్లు అర్జున్ గానీ ‘పుష్ప ది రూల్’ షూటింగ్ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. తాజాగా విడుదల చేసిన అప్డేట్ చూసి ఇంకా 200 రోజులు ఎదురుచూడాలి అంటూ ఫ్యాన్స్ కౌంట్‌డౌన్ మొదలుపెట్టారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

ఒక్క డైలాగ్, స్టెప్‌తో హైప్..

‘పుష్ప ది రైజ్’ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా నార్త్‌లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముందుగా ఈ మూవీ నుంచి శ్రీవల్లి అనే పాట విడుదలయ్యింది. అందులో అల్లు అర్జున్ చేసిన స్టెప్‌ను ముందుగా నెటిజన్లు ట్రోల్ చేశారు. కానీ అదే స్టెప్ సినిమా నుంచి క్రికెట్ వరకు అందరు సెలబ్రిటీలలో హైప్ క్రియేట్ చేసింది. ఆఖరికి చాలామంది క్రికెటర్లు క్రికెట్ గ్రౌండ్‌లో కూడా ఇదే స్టెప్‌ను వేసేవారు. దాంతో పాటు సినిమాల్లో అల్లు అర్జున్ మ్యానరిజంతో ‘తగ్గేదే లే’ అంటూ చెప్పే డైలాగ్ కూడా ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఫారిన్ దేశాల్లో కూడా ఈ డైలాగ్‌ను చెప్తూ.. అల్లు అర్జున్ మ్యానరిజంను ఇమిటేట్ చేశారు నెటిజన్లు. 

పోస్ట్ ప్రొడక్షన్‌పై ఫోకస్..

‘పుష్ప ది రైజ్’ ప్రపంచాన్ని షేక్ చేయడంతో ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. మొదటి భాగం సెన్సేషన్ క్రియేట్ చేసింది కాబట్టి రెండో భాగం.. దానికి మించి ఉండాలని మేకర్స్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. అందుకే షూటింగ్ విషయంలో ఎక్స్‌ట్రా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ‘పుష్ప ది రైజ్’ సమయంలో తెలుగుతో పాటు హిందీ రిలీజ్‌ను కూడా ఒకేసారి ప్లాన్ చేశారు మేకర్స్. దీంతో చివరి నిమిషంలో పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో తీవ్రంగా ప్రెజర్ పడింది. ఈసారి అలా జరగకుండా షూటింగ్‌ను త్వరగా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్‌ను మరింత జాగ్రత్తగా చేయాలి అనుకునే ఆలోచనలో టీమ్ ఉన్నట్టు సమాచారం.

Also Read: స్టూడెంట్‌ను చెప్పుతో చితకబాదిన సీనియర్ సింగర్ - స్పందించిన చిన్మయి

టాప్ హెడ్ లైన్స్

Saripoyaru Iddaroo: 'శతమానం భవతి' దర్శకుడి కొత్త సినిమా... టీజర్ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి
'శతమానం భవతి' దర్శకుడి కొత్త సినిమా... టీజర్ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి
Dada Movie Update : దాదా సెట్స్‌లో బాలయ్య - గాయం తర్వాత కీలక సీన్స్ షురూ
దాదా సెట్స్‌లో బాలయ్య - గాయం తర్వాత కీలక సీన్స్ షురూ
Maremma OTT: రెండు ఓటీటీల్లోకి 'మారెమ్మ'... రవితేజ ఫ్యామిలీ హీరో మాధవ్ భూపతిరాజు సినిమా స్ట్రీమింగ్ ఎందులోనంటే?
రెండు ఓటీటీల్లోకి 'మారెమ్మ'... రవితేజ ఫ్యామిలీ హీరో మాధవ్ భూపతిరాజు సినిమా స్ట్రీమింగ్ ఎందులోనంటే?
Romantic Movie OTT : ట్రెండింగ్ బోల్డ్ రొమాంటిక్ మూవీ - పెద్దలకు మాత్రమే... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ట్రెండింగ్ బోల్డ్ రొమాంటిక్ మూవీ - పెద్దలకు మాత్రమే... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
Dharani I Love You: రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
Singareni Workers Bonus: సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
Embed widget