Chinmayi Sripaada: స్టూడెంట్‌ను చెప్పుతో చితకబాదిన సీనియర్ సింగర్ - స్పందించిన చిన్మయి
Rahat Fateh Ali Khan: తాజాగా సీనియర్ సింగర్ రాహత్ ఫతే అలీ ఖాన్.. తన స్టూడెంట్‌ను చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో చిన్మయి శ్రీపాద ఈ విషయంపై రియాక్ట్ అయ్యింది.
Rahat Fateh Ali Khan Viral Video: సినీ సెలబ్రిటీల్లో చాలామంది తాము చేసే వ్యాఖ్యల వల్ల కాంట్రవర్సీలు క్రియేట్ అవుతాయని తెలిసినా.. నచ్చని విషయాన్ని ఖండించడానికి ఎప్పుడూ వెనకాడరు. అలాంటి వారిలో సింగర్ చిన్మయి శ్రీపాద కూడా ఒకరు. సింగర్‌గా తన రోజూవారీ బిజీ జీవితంలో సమాజంలో జరిగే అన్యాయాలను ఎదిరించడానికి కూడా సమయాన్ని కేటాయిస్తారు చిన్మయి. తన సోషల్ మీడియాలో ఎక్కువగా సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు సంబంధించిన పోస్టులే ఎక్కువగా ఉంటాయి. తాజాగా తను మరొక సింగర్‌ను తిడుతూ చేసిన పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
సోషల్ మీడియాలో వైరల్..
తాజాగా పాకిస్థానీ సింగర్ రాహత్ ఫతే అలీ ఖాన్.. తన స్టూడెంట్‌ను కొడుతున్న వీడియో ఒకటి బయటికొచ్చింది. అందులో తన స్టూడెంట్‌ను ఘోరంగా చితకబాదాడు. దాదాపు ఒక నిమిషం నిడివి ఉన్న ఈ వీడియో.. ప్రస్తుతం అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఉన్నది రాహత్.. స్టూడెంటా లేదా తన దగ్గర పనిచేసే ఉద్యోగా? అన్న విషయంపై క్లారిటీ లేదు. కానీ తను మాత్రం ఆ వ్యక్తిని చెప్పు తీసుకొని మరీ చావు దెబ్బలు కొట్టాడు. ఒక సింగర్ అయ్యిండి.. మరొక వ్యక్తితో ఇలా అమానుషంగా ప్రవర్తించడం చిన్మయికి నచ్చలేదు. దీంతో సోషల్ మీడియా ద్వారా తన ఆగ్రహాన్ని బయటపెట్టింది.
What's happening here. A leak video showing Rahat Fateh Ali Khan torturing employee. Is it real????@RFAKWorld clarify it. #RahatFatehAliKhan pic.twitter.com/ebNuJrKI7g
— Ahmad Sultan (@ahmadsultan67) January 27, 2024
భయంకరమైన పని..
‘‘విద్యార్థులు కరెక్ట్ పని చేసినప్పుడు ఎలాగైతే టీచర్స్ వారి మీద ప్రేమ కురిపిస్తారో.. అలాగే తప్పు చేసినప్పుడు అంతే దారుణంగా దండిస్తారు అని తన ప్రవర్తనను తానే సమర్థించుకుంటాడు. గురువులు ఏం చేసినా, వారి కులం, మతం ఏదైనా వారి స్థాయిని, స్థానాన్ని గౌరవించి దైవంగా భావిస్తారు. వారు పెట్టి శారీరిక, మానసిక హింసను, టాలెంట్ కోసం ఆర్ట్ కోసం అంటూ సమర్థించుకుంటారు’’ అంటూ రాహత్ ఫతే అలీ ఖాన్ వీడియోను షేర్ చేస్తూ తన అభిప్రాయాన్ని బయటపెట్టింది చిన్మయి శ్రీపాద. రాహత్ ప్రవర్తన భయంకరం అంటూ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది. ఒక్కసారిగా ఇంటర్నెట్‌ను షేక్ చేసిన ఈ వీడియోపై అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు స్పందించారు.
టీచర్ చేసింది కరెక్టే..
రాహత్ ఫతే అలీ ఖాన్.. తన స్టూడెంట్‌ను అంతలా కొట్టినందుకు క్షమాపణలు చెప్పాడు. అది ఒక టీచర్, స్టూడెంట్ మధ్య జరిగిన పర్సనల్ మ్యాటర్ అన్నాడు. ఇక ఈ వీడియోలో రాహత్ చేతిలో దెబ్బలు తిన్న వ్యక్తి పేరు నవీద్ హస్నెయిన్ అని తెలుస్తోంది. ఇందులో ఒక బాటిల్ కోసం రాహత్ రచ్చ చేశాడు. అయితే ఆ బాటిల్‌లో పవిత్రమైన నీళ్లు ఉన్నాయని, దానిని తాను ఎక్కడో పెట్టి మర్చిపోవడం వల్ల గొడవ మొదలయ్యిందని చాలా మామూలుగా చెప్పుకొచ్చాడు నవీద్. రాహత్.. తనకు టీచర్ అని, ఎవరో కావాలనే ఆ వీడియోను లీక్ చేసి, తన టీచర్ పరువు తీయాలని చూస్తున్నారని రాహత్‌కు సపోర్ట్ చేశాడు. అలా ప్రవర్తించినందుకు రాహేత్.. తర్వాత తనను క్షమాపణలు కొరాడని బయటపెట్టాడు నవీద్.
Also Read: హీరోయిన్‌ని పెళ్లాడిన టాలీవుడ్ విలన్ - ఫొటోలు వైరల్