అన్వేషించండి

నాగచైతన్య, సాయిపల్లవి వాలంటైన్స్ డే విషెస్, ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 2’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

రూ. 170 కోట్లకు మించి ఇచ్చినా రాజీపడను, ‘శ్రీమంతుడు’ కేసుపై శరత్ చంద్ర హాట్ కామెంట్స్
‘శ్రీమంతుడు’ కాపీ రైట్ కేసు వ్యవహారంపై రచయిత శరత్ చంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2012 నుంచి తాను చేస్తున్న పోరాటం డబ్బు కోసం కాదని, కేవలం న్యాయం కోసమేనని తేల్చి చెప్పారు. రైటర్స్ అసోసియేషన్ లో ఏం తేలకపోవడంతో కోర్టుకు వెళ్లినట్లు శరత్ చంద్ర తెలిపారు. ‘నేను రూ. 100 కోట్లు ఇచ్చినా కాంప్రమైజ్ కాను. సినిమాకు వచ్చిన రూ.170 కోట్లకు అదనంగా రూ. 100 కోట్లు ఇచ్చినా కాంప్రమైజ్ కాను. ఈ కేసుకు సంబంధించి సీబీఐ విచారణ జరపాలని కోరుతున్నాను. హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఫిర్యాదు చేస్తా. అట్రాసిటీ కేసు కూడా పెడతాను. నా కేసు తేలేవరకు ఈ కేసులోని వాళ్ల పాస్ పోర్టులను సీజ్ చేయాలని కోరుతున్నాను. వాళ్లను షూటింగ్ లలో పాల్గొనకుండా ఆపాలని కోరుతున్నాను. రైటర్స్ అసోసియేషన్ ఏనాడు నా విషయంలో జోక్యం చేసుకోలేదు. కనీసం వివాదాన్ని తేల్చే ప్రయత్నం చేయలేదు’ అన్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

బుజ్జిత‌ల్లి కాస్తా న‌వ్వ‌వే - సాయి ప‌ల్ల‌వి, నాగ చైత‌న్యల ‘వాలంటైన్స్ డే’ రీల్‌కు నెటిజన్స్ ఫిదా
నేచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి, నాగ చైత‌న్య ఇద్ద‌రు క‌లిసి వాలంటైన్స్ డే విషెస్ చెప్పారు. జపాన్‌లో ఓ బాలీవుడ్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్న సాయి పల్లవి.. హైదరాబాద్‌లో ఉన్నా చైతూతో కలిసి.. తమ అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. ట్విట్ట‌ర్ ద్వారా ఒక క్యూట్ రీల్ ని షేర్ చేశారు. ఇటీవల రిలీజైన ‘తండేల్’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ లో ఉన్న డైలాగ్ తో ఈ రీల్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మళ్లీ నవ్వించేందుకు వస్తున్న 'సేవ్ ది టైగర్స్’ - సీజన్ 2 స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
భార్యభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలను తెరపై చూపిస్తూ నవ్వులు పండించిన వెబ్ సిరీస్ ‘సేవ్‌ ది టైగర్స్’. ప్రియదర్శ్‌, అభినవ్, గోమఠం, చైతన్య కృష్ణ నటించిన ఈ కామెడీ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ని ఓ ఊపు ఊపేసింది. తాజాగా ఈ సిరీస్ సీజన్‌ 2కు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్‌ను పంచుకున్నారు డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్ టీమ్. ఆడియన్స్‌ను మరో సారి తమ కామెడీ టైమింగ్‌తో నవ్వించేందుకు ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 2’ సిద్ధమవుతుంది. కిడ్నాప్ మిస్టరీతో మంచి ట్విస్ట్ ఇచ్చి.. మొదటి సీజన్‌ను ముగించిన మూవీ మేకర్స్ ఇప్పుడు.. పార్ట్ 2కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ రెండో సీజన్లో మర్డర్ మిస్టరీ చూట్టూ కథ ఉండనుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఉపేంద్ర ‘UI’ నుంచి ‘చీప్ సాంగ్‘ - ఇంత చవకబారు డబుల్ మీనింగ్ పాటను ఎప్పుడూ విని ఉండరు!
ఉపేంద్ర హీరోగా నటిస్తున్న ‘యుఐ’ సినిమాపై ప్రేక్షకులలో మరింత క్యూరియాసిటీ పెంచేలా చిత్రబృందం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే మ్యూజికల్ ప్రమోషన్ మొదలు పెట్టింది. ఈ నెల 26న ఈ సినిమా నుంచి ‘చీప్ సాంగ్’ లిరికల్ వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఇవాళ ఈ పాటకు సంబంధించిన చిన్న శాంపిల్ వదిలింది. ఈ పాట వింటుంటే నిజంగానే పరమ చీప్ సాంగ్ లా అనిపిస్తోంది. ‘నీకంటే నాది పెద్దది, వాడికంటే నీది చిన్నది’ అంటూ బూతు పాట మాదిరిగా కనిపిస్తోంది. ఈ పాటను రాంబాబు గోసాల రాశారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. మొత్తంగా ఈ పాట ఏదో డబుల్ మీనింగ్ తరహాలో వినిపిస్తోంది. ఈ పాట శాంపిల్ విని చాలా మంది ఉపేంద్ర ఏం మారలేదు. మరోసారి తన మార్క్ బూతులను వెండితెర మీద పారించబోతున్నాడంటున్నారు. ఈ పాటలతో మళ్లీ పాత ఉపేంద్ర గుర్తుకు వస్తున్నాడని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

వాలెంటైన్స్‌ డే స్పెషల్‌ - ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్స్‌ వీరే!
ప్రేమికుల దినోత్సవం.. ప్రేమను సెలబ్రేట్‌ చేసుకునే ఒక ప్రత్యేక సందర్భం. ఫబ్రవరి 14  ప్రేమ పక్షులకు చాలా ప్రత్యేకమైన రోజు. గుండెల్లో దాచుకున్న ప్రేమను, మాటల్లో చెప్పలేని భావాలను వెల్లడించే రోజు. అయితే చాలా మంది ప్రేమికులు ఎక్కువ స్ఫూర్తి పొందింది మాత్రం వెండితెరపై కనిపించే ప్రేమ జంటలను చూసే. రీల్‌ కోసం ప్రేమలో పడ్డ చాలామంది రియల్‌ లైఫ్‌లోనూ ప్రేమను పంచుకున్నారు. అలా ప్రేమలో పడి.. పెళ్లి పీటలెక్కిన టాలీవుడ్‌ జంటలు చాలానే ఉన్నాయి. అందులో స్టార్‌ హీరోలు కూడా ఉన్నారు. వారిలో కొందరు ఇండస్ట్రీలోనే తమ సోల్‌మేట్‌ను వెతుక్కుంటే మరికొందరేమో తమ స్నేహితుల్లోనే సోల్‌మేట్‌ను చూసుకున్నారు. మరి టాలీవుడ్‌లో సక్సెస్‌ అయిన 'లవ్‌స్టోరీ'ల గురించి తెలుసుకుందాం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Nara Lokesh: డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
Donald Trump : అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
Donald Trump Inauguration: డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం - సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ప్రముఖులు
డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం - సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ప్రముఖులు
Joe Biden: కుర్చీ దిగిన బైడెన్ - అధ్యక్షుడిగా చివరి గంటల్లో వారికి క్షమాభిక్ష
కుర్చీ దిగిన బైడెన్ - అధ్యక్షుడిగా చివరి గంటల్లో వారికి క్షమాభిక్ష
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mahakumbh Monalisa | కాటుక కళ్ల చిన్నది.. కుంభమేళాను కట్టిపడేసింది | ABP DesamKolkata Doctor Murder Case | కోల్ కతా ట్రైనీ డాక్టర్ కేసులో నిందితుడికి జీవిత ఖైదు | ABP DesamCM Chandrababu CM Revanth Met in Davos | దావోస్ లో కలిసిన చంద్రబాబు, రేవంత్ | ABP DesamAkash Puri Helps Pavala Shyamala | సీనియర్ నటి పావలా శ్యామలకు ఆకాశ్ పూరీ ఆర్థిక సాయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Nara Lokesh: డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
Donald Trump : అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
Donald Trump Inauguration: డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం - సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ప్రముఖులు
డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం - సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ప్రముఖులు
Joe Biden: కుర్చీ దిగిన బైడెన్ - అధ్యక్షుడిగా చివరి గంటల్లో వారికి క్షమాభిక్ష
కుర్చీ దిగిన బైడెన్ - అధ్యక్షుడిగా చివరి గంటల్లో వారికి క్షమాభిక్ష
Bhatti Vikramarka: 'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క
'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క
Himani Mor: నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది.
నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది.
RG Kar Murder Case: ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
Telangana Beer News: తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ - ఆ  బ్రాండ్ బీర్లకు కొరత లేదు.. రాదు !
తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ - ఆ బ్రాండ్ బీర్లకు కొరత లేదు.. రాదు !
Embed widget