అన్వేషించండి

Valentine's Day: వాలెంటైన్స్‌ డే స్పెషల్‌ - ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్స్‌ వీరే!

Valentine's Day 2024: రీల్‌ కోసం ప్రేమలో పడ్డ చాలామంది రియల్‌ లైఫ్‌లోనూ ప్రేమను పంచుకున్నారు. అలా ప్రేమలో పడి.. పెళ్లి పీటలెక్కిన టాలీవుడ్‌ జంటలు చాలానే ఉన్నాయి. ఆ ప్రేమకథల గురించి తెలుసుకుందాం.

ప్రేమికుల దినోత్సవం.. ప్రేమను సెలబ్రేట్‌ చేసుకునే ఒక ప్రత్యేక సందర్భం. ఫబ్రవరి 14  ప్రేమ పక్షులకు చాలా ప్రత్యేకమైన రోజు. గుండెల్లో దాచుకున్న ప్రేమను, మాటల్లో చెప్పలేని భావాలను వెల్లడించే రోజు. అయితే చాలా మంది ప్రేమికులు ఎక్కువ స్ఫూర్తి పొందింది మాత్రం వెండితెరపై కనిపించే ప్రేమ జంటలను చూసే. రీల్‌ కోసం ప్రేమలో పడ్డ చాలామంది రియల్‌ లైఫ్‌లోనూ ప్రేమను పంచుకున్నారు. అలా ప్రేమలో పడి.. పెళ్లి పీటలెక్కిన టాలీవుడ్‌ జంటలు చాలానే ఉన్నాయి. అందులో స్టార్‌ హీరోలు కూడా ఉన్నారు. వారిలో కొందరు ఇండస్ట్రీలోనే తమ సోల్‌మేట్‌ను వెతుక్కుంటే మరికొందరేమో తమ స్నేహితుల్లోనే సోల్‌మేట్‌ను చూసుకున్నారు. మరి టాలీవుడ్‌లో సక్సెస్‌ అయిన 'లవ్‌స్టోరీ'ల గురించి తెలుసుకుందాం


నాగార్జున-అమల:

టాలీవుడ్‌ మోస్ట్‌ బ్యూటీఫుల్‌ కపుల్స్‌లో నాగార్జున-అమల ఒకటి. ఇండస్ట్రీలో ఈ జంటకు ప్రత్యేక స్థానం ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వీరిద్దరు జంటగా నటించిన సినిమాలన్నీ దాదాపు బ్లాక్‌బస్టర్‌గానే నిలిచాయి. కిరాయి దాదా నుంచి శివ, నిర్ణయం హిట్స్‌ కొట్టారు. అయితే కిరాయి దాదా మూవీ సెట్‌లో కలుకున్న ఈ జంట ఆ తర్వాత ప్రేమలో పడింది. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమ్మతంతో 1992 జూన్‌ 1lన ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు. పెళ్లికి ముందు ప్రేమ యుద్దం, చినబాబు, శివ,నిర్ణయం వంటి చిత్రాల్లో జంటగా నటించారు. 

మహేష్‌ బాబు-నమ్రతా శిరోద్కర్‌:

టాలీవుడ్‌ ప్రేమజంట అంటే ఫస్ట్‌ గుర్తొచ్చే కపుల్‌ మహేష్‌-నమ్రతలు. 'వంశీ' సినిమాలో జంటగా నటించి ఆడియన్స్‌ని ఆకట్టుకన్న ఈ జంట రియల్‌ లైఫ్‌లోనూ దంపతులుగా ఎందరికో స్పూర్తిగా నిలుస్తుంది. వంశీ సినిమాతోనే వారి ప్రేమకు తొలి అడుగు పడింది. ఆ తర్వాత ఐదేళ్లపాటు ప్రేమించుకున్న మహేష్‌-నమ్రతలు 2005లో మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పుడు వారికి గౌతమ్-సితారలు ఇద్దరు పిల్లలు. ఇటీవల ఈ స్టార్‌ కపుల్‌ తమ 17వ వెడ్డింగ్‌ యానివర్సరీని కూడా జరుపుకుంది. 


శ్రీకాంత్‌-ఊహా:

ఆమె(1994)సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఆ తర్వాత ఆయనగారు సినిమాలో మళ్లీ జతకట్టారు. ఆ తర్వాత మరో నాలుగు సినిమాల్లో జంటగా నటించారు. అలా వెండితెరపై ప్రేమ పండించిన ఈ జంట ఈ క్రమంలో నిజ జీవితంలోనూ ప్రేమలో పడింది. ఇదే విషయాన్ని ఇద్దరిలో ఇంట్లో చెప్పి తమ పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ అందుకున్నారు. అలా 1997 జనవరి 20న పెళ్లి చేసుకుని రియల్‌ కపుల్‌ అయిపోయారు. ఇక పెళ్లి తర్వాత ఊహా పూర్తి సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది.

రాజశేఖర్‌ - జీవిత:

డాక్టర్ రాజశేఖర్, జీవిత గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. హీరో, హీరోయిన్లుగా కెరీర్ మొదలు పెట్టి, ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ మొదలై, పెళ్లి వరకు వెళ్లింది. వీరిద్దరిలో ఫస్ట్‌ ప్రపోజ్‌ చేసింది జీవితానే. ఆ తర్వాత ఇద్దరు మూడేళ్ల పాటు ప్రేమించుకుని ఇరు కటుంబసభ్యుల సమక్షంలో పెళ్లి పీటలు ఎక్కారు. వీరిద్దరు జంటగా ఆహుతి, స్టేషన్‌ మాస్టర్‌, అంకుశం, బావ మరుదుల సవాల్‌ వంటి సినిమాలో కలిసి నటించారు. 

అల్లు అర్జున్‌ - స్నేహరెడ్డి:

ప్రస్తుతం జనరేషన్‌ క్యూట్‌ కపుల్లో అల్లు అర్జున్‌-స్నేహ జంట ముందుంటుంది. స్నేహకు సినీ ఇండస్ట్రీతో ఏ విధమైన సంబంధం లేదు. కానీ ఓ కామన్‌ ఫ్రెండ్‌ పెళ్లిలో వీరిద్దరికి పరిచయం ఏర్పడిందట. అక్కడ కలుసుకున్న వీరు మధ్య మాటలు కలిశాయి. ఆ తర్వాత ఫొన్‌ నెంబర్లు మార్చుకుని .. రోజు ముచ్చట్లు చెప్పుకోవడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొంతకాలం పాటు ప్రేమించుకున్న వీరిద్దరు పెద్ద అంగీకారంతో 2011 మార్చి 6న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 

రామ్‌ చరణ్‌ - ఉపాసన:

రామ్‌ చరణ్‌- ఉపాసనలు చిన్నప్పటి స్నేహితులు అనే విషయం తెలిసిందే. ఒకే స్కూల్లో కలిసి చదువుకున్న చరణ్‌-ఉపాసనల మధ్య 2010 ఆరేంజ్‌ మూవీ టైంలో ప్రేమ చిగురించింది. దాంతో ఐదేళ్ల పాటు డేటింగ్‌ చేసిన వీరిద్దరు 2012 జూన్‌ 14న వివాహం చేసుకున్నారు. పెళ్లయిన పదేళ్ల తర్వాత వీరికి క్లింకార జన్మించింది. 

వరుణ్‌ తేజ్‌ - లావణ్య త్రిపాఠి:

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ - లావణ్య త్రిపాఠిలు గతేడాది పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరేళ్ల పాటు సీక్రెట్‌ డేటింగ్‌లో ఉన్న లవ్‌బర్డ్స్‌ నవంబర్‌ 1, 2023లో ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో ఏడడుగులు వేశారు. వీరిద్దరు కలిసి 2017లో మిస్టర్‌, అంతరిక్షం చిత్రాల్లో నటించారు. లావణ్య 2012లో అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రి ఇచ్చింది. ఈ మూవీగానూ ఆమె ఉత్తమ నటిగా అవార్డులు కూడా అందుకుంది. 

మంచు మనోజ్‌ - భూమా మౌనిక:

ఇద్దరికి వేరు వేరు పెళ్లిళ్లు అయినా మళ్లీ ఒక్కటై తమ ప్రేమను గెలిపించుకున్నారు మనోజ్‌-మౌనికలు. మౌనికది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం,  మనోజ్‌ ది సినీ రంగానికి చెందిన ఫ్యామిలీ. ఇద్దరికి ఇండస్ట్రీలో ఎలాంటి సంబంధం లేకున్న రెండు కుటుంబాలకు ఉన్న పరిచయంతో ఇద్దరు కలుకున్నారు, ప్రేమించుకున్నారు. కానీ ఇంట్లో వారి ప్రేమ గురించి చెప్పే ధైర్యం లేక వేరు వేరు పెళ్లీళ్లు చేసుకున్నారు. అయినా వారి మధ్య ప్రేమ అలాగే ఉండటంతో వారికి విడాకులు ఇచ్చి వీరిద్దరు ఒక్కటయ్యారు. త్వరలోనే ఈ జంట ప్రేమ గుర్తుగా పండంటి బిడ్డ కూడా రాబోతోంది.  

నాగచైతన్య - సమంత:

నాగచైతన్య-సమంత జంటకు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ జంటకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఎక్కువే. 'ఏం మాయ చేశావే' సినిమాతో ప్రేమలో పడ్డ వీరిద్దరు దాదాపు ఎనిమిదేళ్లు ప్రేమలో మునిగితేలారు. ఆ తర్వాత 2017లో ఇరు కుటుంబసభ్యుల అంగీకారంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే వైవాహిక జీవితంలో వచ్చిన మనస్పర్థలు, విభేదాల కారణంగా పెళ్లయిన నాలుగేళ్లకే తమ పెళ్లి బంధానికి స్వస్తి చెప్పుకున్నారు. 2021 అక్టోబర్‌లో వీరి విడాకులను అధికారంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Chetan Maddineni: తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
Embed widget