Cheap Song Promo: ఉపేంద్ర ‘UI’ నుంచి ‘చీప్ సాంగ్‘ - ఇంత చవకబారు డబుల్ మీనింగ్ పాటను ఎప్పుడూ విని ఉండరు!
కన్నడ స్టార్ ఉపేంద్ర ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'యుఐ'. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ కీలక అప్ డేట్ ఇచ్చారు.
Upendra’s UI Movie Cheap Song Promo Out: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎవరు ఏం అనుకున్నా ఫర్వాలేదు. నా రూటే సఫరేటు అన్నట్లుగా వ్యవహరిస్తారు. సరికొత్త కథాంశాలతో సినిమాలు చేస్తుంటారు. ఇప్పుడు ఫేమస్ అయిన ‘అర్జున్ రెడ్డి‘, ‘యానిమల్‘ లాంటి క్యారెక్టర్లను ఎప్పుడో చేసి చూపించారు ఉపేంద్ర. హీరో అంటే ఇలాగే ఉండాలి అనే ఫార్ములా నుంచి హీరో ఎలాగైనా ఉండొచ్చు అనేలా డిఫరెంట్ క్యారెక్టర్లు చేశారు. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఉపేంద్ర మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘యుఐ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే గ్లింప్స్ విడుదల అయ్యింది. ఇందులో మేకర్స్ ఏం చెప్పాలి అనుకున్నారో? ఎవరికీ పెద్దగా అర్థం కాలేదు. అయినప్పటికీ డిఫరెంట్ టైటిల్ ప్రేక్షకులలో ఆసక్తి కలిగించింది.
ఉపేంద్ర మూవీ నుంచి ‘చీప్ సాంగ్’ ప్రోమో
‘యుఐ’ సినిమాపై ప్రేక్షకులలో మరింత క్యూరియాసిటీ పెంచేలా చిత్రబృందం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే మ్యూజికల్ ప్రమోషన్ మొదలు పెట్టింది. ఈ నెల 26న ఈ సినిమా నుంచి ‘చీప్ సాంగ్’ లిరికల్ వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఇవాళ ఈ పాటకు సంబంధించిన చిన్న శాంపిల్ వదిలింది. ఈ పాట వింటుంటే నిజంగానే పరమ చీప్ సాంగ్ లా అనిపిస్తోంది. ‘నీకంటే నాది పెద్దది, వాడికంటే నీది చిన్నది’ అంటూ బూతు పాట మాదిరిగా కనిపిస్తోంది. ఈ పాటను రాంబాబు గోసాల రాశారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. మొత్తంగా ఈ పాట ఏదో డబుల్ మీనింగ్ తరహాలో వినిపిస్తోంది. ఈ పాట శాంపిల్ విని చాలా మంది ఉపేంద్ర ఏం మారలేదు. మరోసారి తన మార్క్ బూతులను వెండితెర మీద పారించబోతున్నాడంటున్నారు. ఈ పాటలతో మళ్లీ పాత ఉపేంద్ర గుర్తుకు వస్తున్నాడని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
రూ. 100 కోట్లతో తెరకెక్కుతున్న ‘యుఐ’ మూవీ
మొత్తంగా చీప్ సాంగ్ లో చిన్నది, పెద్దది అనే లిరిక్స్ మాత్రం తేడాగా ఉన్నాయంటున్నారు అభిమానులు. అయితే, పూర్తి పాట వినకముందే ఓ అభిప్రాయానికి రావడం మంచిది కాదంటున్నారు. ఈ సినిమా మామూలుగా ఉండదంటున్నారు ఆయన అభిమానులు. ఇప్పటికే ఉపేంద్ర కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమా చూశాక, ప్రేక్షకులు షాక్ కు గురయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇంకా ఫిక్స్ చేయలేదు. పాన్ ఇండియా రేంజిలో ఒకేసారి పలు భాషల్లో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 'యూఐ' చిత్రాన్ని దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. లహరీ ఫిల్మ్స్ ఎల్‌ఎల్‌పీతో పాటు వీనస్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వర్చువల్ రియాలిటీ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుందని గ్లింప్స్ లో రివీల్ చేశారు. ఇందులో ఉపేంద్రతో పాటు సన్నీ లియోన్, మురళీ శర్మ, నిధి సుబ్బయ్య, ఇంద్రజీత్ లంకేశ్, మురళీ కృష్ణలాంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Read Also: పేరు మార్చండి, లేదంటే సర్టిఫికేషన్ క్యాన్సిల్ చేయండి - చిక్కుల్లో మమ్ముట్టి సినిమా ‘భ్రమయుగం’