అన్వేషించండి

Bramayugam: పేరు మార్చండి, లేదంటే సర్టిఫికేషన్ క్యాన్సిల్ చేయండి - చిక్కుల్లో మమ్ముట్టి సినిమా ‘భ్రమయుగం’

‘కాథల్‌ ది కోర్‌’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి.. ఇప్పుడు ‘భ్రమయుగం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Mammootty’s Bramayugam In Legal Trouble: మలయాళీ స్టార్ హీరో ముమ్మట్టి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘కాథల్‌ ది కోర్‌’ మూవీ ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అదే జోష్ లో  ‘భ్రమయుగం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. ఫిబ్రవరి 15న థియేటర్లలో ప్రేక్షకులను అలరించబోతోంది.

‘భ్రమయుగం’పై భారీ అంచనాలు   

విభిన్న కథాంశాలతో సినిమాలు చేయడంలో మమ్ముట్టి ముందుంటారు. ఆయన సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఇష్టపడతారు. ‘భ్రమయుగం’ చిత్రం సైతం సరికొత్త కథాంశంతో రూపొందింది. హారర్, థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ కథ కేరళలో మాయ, తంత్రంతో నిండిన యుగంలో నడుస్తుంది. ఒక గాయకుడి జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా ముందుకు సాగుతుంది. ‘భ్రమయుగం’ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ సరికొత్త అనుభూతిని ఇస్తోంది. పాచికల ఆట నేపథ్యంలో, తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠను రేకెత్తిస్తూ సాగిన ట్రైలర్.. సినిమాపై అంచనాలను ఓ రేంజికి తీసుకెళ్లింది. థియేటర్లలో ప్రేక్షకులను సీటు ఎడ్జ్ లో కూర్చోబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

చిక్కుల్లో మమ్ముట్టి మూవీ

ఓవైపు సినిమా విడుదలకు రెడీ అవుతుండగా, మరోవైపు ఈ సినిమాపై కేరళ హైకోర్టులో కేసు ఫైల్ అయ్యింది. ఈ సినిమాలోని మమ్ముట్టి పాత్ర 'కుంజుమోన్ పొట్టి'ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు అయ్యింది. కేరళలోని సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పుంజమోన్ ఇల్లం ఈ పిటిషన్ వేశారు. ఈ కేసును జస్టిస్ దేవన్ రామచంద్రన్ విచారించారు. ఈ సినిమా తమ వంశం, చరిత్రకు సంబంధించిన ‘ఐతిహైమల‘ పుస్తకాన్ని బేస్ చేసుకుని తీసినట్లు ఉందని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు.

మమ్ముట్టి పాత్ర తమ కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని తెలిపారు. ప్రధాన పాత్ర పేరు, ఇంటి పేరు మార్చకపోతే తమకు నష్టం కలిగించే అవకాశం ఉందని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సినిమాలో 'కుంజుమోన్ పొట్టి' అనే పాత్రను ప్రతికూల అర్థం వచ్చేలా రూపొందించారని, వెంటనే సినిమా సెన్సార్ సర్టిఫికేషన్ ను రద్దు చేయాలని కోరారు. లేదంటే,  పాత్ర పేరు మార్చాలని కోరారు. ఈ కేసు విచారణను న్యాయస్థానం ఫిబ్రవరి 14కు వాయిదా వేసింది. అన్ని పార్టీలకు నోటీసు జారీ చేయబడింది.

ఇక ‘భ్రమయుగం’ సినిమాను నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ముందుగా మలయాళం భాషలో మాత్రమే ఈ సినిమా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. మలయాళంలో విడుదలైన తర్వాత.. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో మరో తేదీన విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

Read Also: చనిపోయిన కెప్టెన్‌కు ప్రాణం పోయనున్న దళపతి విజయ్ - ఆ మూవీలో అతిథి పాత్ర

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : లెనిన్ To క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ - ఈ వారం ఓటీటీ మూవీస్ కంప్లీట్ లిస్ట్
లెనిన్ To క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ - ఈ వారం ఓటీటీ మూవీస్ కంప్లీట్ లిస్ట్
This Week Theatrical Movies : ఈ వారం థియేట్రికల్ రిలీజెస్ - మెగా ప్రిన్స్ మూవీతో పాటు రొమాంటిక్ డ్రామా... ఒక్క రోజే 8 సినిమాలు
ఈ వారం థియేట్రికల్ రిలీజెస్ - మెగా ప్రిన్స్ మూవీతో పాటు రొమాంటిక్ డ్రామా... ఒక్క రోజే 8 సినిమాలు
Kattalan OTT : ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Devi Sri Prasad: దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Monsoon Humidity : వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
Embed widget