టాప్-5 ఎంటర్‌టైన్మెంట్ న్యూస్ - ఈ రోజు సినీ విశేషాలివే!
ఈ రోజు (ఏప్రిల్ 24, 2023) టాప్-5 ఎంటర్‌టైన్మెంట్ న్యూస్.
అఖిల్ ‘ఏజెంట్’ సెన్సార్ టాక్ - అయ్యగారి అభిమానులకు పండుగేనా?
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన మూవీ ‘ఏజెంట్’. స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ 28 న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పిటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, రీసెంట్ గా విడుదల అయిన ట్రైలర్ సైతం ఆకట్టుకునేలా ఉండటంతో మూవీ పై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో ఫుల్ బీజీగా ఉంది మూవీ టీమ్. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గానే ప్లాన్ చేశారు. ప్రస్తుతం మూవీకు సంబంధించిన సెన్సార్ పూర్తయింది. ఈ మూవీకు U/A సర్టిఫికేట్ వచ్చింది. సినిమా రన్ టైమ్ కూడా 2:36 నిమిషాల నిడివితో థియేటర్లలో రిలీజ్ కానుంది. సినిమా రన్ టైమ్ పట్ల అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీగా అవుతున్నారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఉపాసన సీమంతానికి అల్లు అర్జున్, ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లేనా?
మెగాస్టార్ చిరంజీవి కుమారుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో తండ్రి కాబోతున్నారు. ఈ ఏడాది జూలైలో ఉపాసన బేబీకి జన్మనివ్వబోతోంది. పెళ్లైన సుమారు పుష్కర కాలానికి చిరంజీవి ఫ్యామిలీలోకి మరో మెంబర్ రాబోతున్నారు. ఈ చిన్నారి కోసం చిరు కుటుంబం ఎంతగానో ఎదురు చూస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతోంది ఉపాసన. ఆమెకు తోడుగా ఉంటున్నారు భర్త రామ్ చరణ్. తన కోసం సమయం కేటాయిస్తున్నారు. అంతేకాదు, కొంత కాలం పాటు సినిమాకు దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
సంయుక్త వచ్చాకే సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అయ్యింది: దర్శకుడు కార్తీక్ దండు
సినిమా ఇండస్ట్రీలో హీరోల కంటే హీరోయిన్లకు సినిమా అవకాశాలు రావడానికి ఎన్నో లెక్కలు ఉంటాయి. ముందు ఒకటి రెండు సినిమాల్లో వరుసగా అవకాశాలు వచ్చినా తర్వాత కొత్త అవకాశాలు రావాలి అంటే గత సినిమాలు పాజిటివ్ టాక్ ను తెచ్చుకుని ఉండాలి. లేదంటే కొత్త ఛాన్స్ లు రావడం కాస్త కష్టమైన పనే. అయితే కొంత మంది హీరోయిన్లకు వరుసగా హిట్ వస్తే ఆమెది గోల్డెన్ లెగ్ అనే టాక్ వస్తుంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో అలాంటి పేరుతో దూసుకెళ్తుంది నటి సంయుక్త మీనన్. ఆమె టాలీవుడ్ లో నటించింది కొన్ని సినిమాలే అయినా అవన్నీ మంచి హిట్ ను అందుకోవడంతో ఆమెను అంతా గోల్డెన్ లెగ్ అని పిలుస్తున్నారట. ఈ నేపథ్యంలో ఆమె రీసెంట్ గా నటించిన సినిమా ‘విరూపాక్ష’. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ కార్యక్రమంలో సినిమా దర్శకుడు కార్తీక్ దండు ఆమెను గోల్డెన్ లెగ్ అని పిలవడం పట్ల స్పందిస్తూ హీరోయిన్ సంయుక్త మీనన్ పై నోరు జారారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి:
డాక్టర్ అఖిల్‌ను గంటసేపు మట్టిలో కూర్చోబెట్టమన్నారు: నాగార్జున
దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వహించిన ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కాబోతుంది. హీరో అఖిల్ అక్కినేని, హీరోయిన్ సాక్షి వైద్య జంటగా నటించిన ఈ సినిమా ఇటీవలే వరంగల్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఈ కార్యక్రమానికి హీరో అక్కినేని నాగార్జునతో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పాల్గొన్నారు. కాగా ఈ వేడుకలో నాగ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వరంగల్ గొప్పతనాన్ని చెబుతూ స్పీ్చ్ స్టా్ర్ట్ చేసిన ఆయన.. వరంగల్ పోరాటాలకు అడ్డా.. వీరత్వానికి ఇంటి పేరు అంటూ ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.
పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
టార్గెట్ రూ.100 కోట్లు? థియేటర్లలో అదరగొడుతోన్న ‘విరూపాక్ష’ - సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లోనే ది బెస్ట్!
సాయి ధరమ్ తేజ్, సంయుక్త ప్రధాన పాత్రల్లో నటించిన ‘విరూపాక్ష’.. ఎక్కడాలేని క్రేజ్ లభిస్తోంది. పబ్లిసిటీతో పనిలేకుండానే.. మౌత్ పబ్లిసిటీతో మూవీకి బోలెడంత బజ్ లభిస్తోంది. దీంతో ‘విరూపాక్ష’ చిత్రయూనిట్ సంబరాల్లో మునిగితేలుతోంది. పాజిటివ్ టాక్ వల్ల సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. మూడు రోజుల్లోనే ఈ మూవీ భారీ వసూళ్లు సాధించింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో ఇప్పటి వరకు (రిలీజైన్ మూడు రోజుల్లో) రూ.44 కోట్లు వసూలు చేసింది. వీకెండ్ కావడంతో రికార్డు స్థాయిలో ఈ మూవీకి కలెక్షన్స్ లభించాయి.