అన్వేషించండి
Advertisement
Tollywood: ఈ శుక్రవారం థియేటర్లలో సందడే సందడి.. విడుదలవుతున్నవన్నీ క్రేజీ సినిమాలే
శుక్రవారం రోజు బాక్సాఫీస్ వద్ద సందడి జోరందుకుంటోంది. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత వారం వారం థియేటర్లో విడుదలవుతున్న సినిమాల సంఖ్య పెరుగుతోంది. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో సందడి చేసే సినిమాలేంటంటే...
'కొండపొలం'..
వైష్ణవ్ తేజ్ హీరోగా.. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'కొండపొలం'. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం ( అక్టోబరు 8న) థియేటర్లలో సందడి చేయనుంది. నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ , ఇప్పటికే విడుదలైన పాటలు సినీ ప్రియులను అలరించాయి. 'ఉప్పెన' సినిమాతో అదిరిపోయే హిట్టందుకున్న వైష్ణవ్ ఈ సినిమాతో సక్సెస్ కంటిన్యూ చేస్తాడంటున్నారు అభిమానులు.
కొద్దిసేపటి క్రితం రొమాంటిక్ సాంగ్ ‘చెట్టెక్కి పుట్ట తేనే పట్టి తెచ్చా మామ’పాట విడుదలైంది. ఇందులో వైష్టవ్ తేజ్, రకుల్ పోటీపడి డ్యాన్స్ చేశారు. ఈ పాటను కాల భైరవ, శ్రేయా ఘోషల్ పాడారు.
'ఆరడుగుల బుల్లెట్'..
గోపీచంద్, నయనతార జంటగా తెరకెక్కిన ఈ సినిమాకు బి.గోపాల్ దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయి ఐదారేళ్లు అవుతున్నా.. కొన్ని కారణాల వలన విడుదలకు నోచుకోలేదు. ఎట్టకేలకు సినిమా అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రకాష్ రాజ్ కీలకపాత్ర పోషిస్తోన్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు.
'నేను లేని నా ప్రేమకథ'..
నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'నేను లేని నా ప్రేమకథ'. సురేష్ ఉత్తరాది డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో గాయత్రి, అదితి మైకేల్ హీరోయిన్లు. ఈ సినిమా కూడా రేపే థియేటర్లోకి రానుంది.
ఓటీటీ రిలీజ్ లు..
'రాజ రాజ చోర': శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ సినిమా థియేటర్లో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయబోతున్నారు. అక్టోబర్ 8 నుంచి అంటే రేపటి నుంచి 'జీ5'లో స్ట్రీమింగ్ కానుంది. హసిత్ గోలి తెరకెక్కించిన ఈ సినిమాలో మేఘా ఆకాష్, సునయన హీరోయిన్లుగా నటించారు.
'కోల్డ్ కేస్'..
పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాను జూన్ 30న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. ఈ మలయాళ సినిమాను తెలుగు ప్రేక్షకుల కోసం డబ్ చేసి 'ఆహా' వేదికగా అక్టోబర్ 8న విడుదల చేయబోతున్నారు.
Also Read: చై-సామ్ పెళ్లి రోజు.. మూడేళ్లుగా సమంత పెట్టిన పోస్ట్ లు వైరల్..
Also Read: పింకీకి మరిచిపోలేని బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన బిగ్ బాస్, భావోద్వేగంలో బిగ్ బాస్ హౌస్
Also Read: ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’కు గెస్ట్‌గా సమంత!
Also Read: గతేడాది చైతూతో ఈ ఏడాది ఒంటరిగా..పెళ్లి రోజు సందర్భంగా సమంత భావోద్వేగమైన పోస్ట్
Also Read:ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also Read: పింకీకి మరిచిపోలేని బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన బిగ్ బాస్, భావోద్వేగంలో బిగ్ బాస్ హౌస్
Also Read: ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’కు గెస్ట్‌గా సమంత!
Also Read: గతేడాది చైతూతో ఈ ఏడాది ఒంటరిగా..పెళ్లి రోజు సందర్భంగా సమంత భావోద్వేగమైన పోస్ట్
Also Read:ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ట్రెండింగ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion