Bigg Boss Telugu 5: పింకీకి మరిచిపోలేని బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన బిగ్ బాస్, భావోద్వేగంలో బిగ్ బాస్ హౌస్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో ఐదోవారం కొనసాగుతోంది. షో లో భాగంగా ఈ రోజు ఎపిసోడ్ కి సంబంధించి విడుదల చేసిన ప్రోమోలో ప్రియాంక సింగ్ కి ఎప్పటికీ మరిచిపోలేని బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు బిగ్ బాస్.
బిగ్ బాస్ హౌస్ లో సందడి చేస్తున్న ప్రియాంక సింగ్ హౌస్ లోకి అడుగుపెట్టేముందు హోస్ట్ నాగార్జునతో వేదికపై ఓ మాట చెప్పింది. ఇప్పటివరకూ తన తండ్రికి తెలియని విషయం ఈ వేదికపై చెబుతున్నానని..తాను ట్రాన్స్ జెండర్ గా మారిన విషయం తండ్రికి తెలియదని ఆయనకు తెలిస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే తట్టుకోలేకపోతున్నానని అంది. ఇంట్లో అన్నల పెళ్లిళ్లు అయిపోయాయని వాళ్లంతా వారి వారి కుటుంబాలతో సంతోషంగా ఉన్నారన్న ప్రియాంక సింగ్.. తనకు కూడా తండ్రి పెళ్లిచేసేందుకు సిద్ధమయ్యాడని తెలిపింది. దీంతో అప్పటివరకూ అబ్బాయిగా నాన్నకు తెలిసిన నేను లింగ మార్పిడి చేయించుకున్నానని చెప్పింది. ఈ విషయం తండ్రికి తెలియదని చెప్పింది. గురువారం ప్రియాంక సింగ్ పుట్టినరోజు కావడంతో ఈ రోజు ఎపిసోడ్ కి సంబంధించి విడుదల చేసిన ప్రోమోలో బిగ్ బాస్ ప్రియాంక సింగ్ కి మరిచిపోలేని బహుమతి ఇచ్చారు.
It's a delightful day for #Priyanka .. Happy Birthday!#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/q5pdgYERnP
— starmaa (@StarMaa) October 7, 2021
ప్రోమోలో ఏముందంటే... నాన్న సాయితేజా... అమ్మాయి అయినా అబ్బాయి అయినా సర్వం నువ్వే మాకు అంటూ తనని అంగీకరిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. తండ్రి మాటలు విని ప్రియాంక సింగ్ భావోద్వేగానికి లోనైంది. తన ఇంటికి తాను దొంగలా వెళతానని..బయటకు కూడా రానని..కనీసం పక్కింటి వాళ్లకి కూడా తెలియదని కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు నన్ను అంగీకరించడంతో ఎప్పటిలానే ఇంటికి రావొచ్చంది. డాడీ ఐ లవ్ యూ అంటూ ఏడ్చేసింది. ఇంటి సభ్యులంతా కూడా ఎమోషనల్ అయ్యారు. పూలు, బొట్టు తీసుకొచ్చి ప్రియాంక సింగ్ ను అందంగా అలంకరించారు. మొత్తానికి ప్రోమో చూస్తుంటే ఈ రోజు హౌస్ మొత్తం కన్నీటిపర్యంతం అయినట్టే ఉంది.
Also Read: విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి...
Also Read: దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు జరుపుకుంటారు…ఈ సందర్భంగా లంకేశుడి గురించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం
Also Read:ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకూ తొమ్మిది రోజులు రోజుకో నైవేద్యం...ఏ రోజు ఏం పెట్టాలంటే...
Also Read: నవరాత్రుల్లో అమ్మవారికి ఏ రోజు ఏ రంగు వస్త్రం సమర్పించాలి...ఏ ప్రసాదం నివేదించాలి
Also Read:ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి