Evaru Meelo Koteeswarulu: ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’కు గెస్ట్‌గా సమంత!
గతంలో నాగార్జున హోస్ట్ గా వ్యవహించిన' బిగ్ బాస్' షోకి గెస్ట్ హోస్ట్ గా వ్యవహరించి మెప్పించిన సమంత...ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరుడు'లో సందడి చేయనుందట. ఆ విశేషాలేంటో చూద్దాం...
![Evaru Meelo Koteeswarulu: ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’కు గెస్ట్‌గా సమంత! Evaru Meelo Koteeswarulu: Is Samantha Going To Participate As A Guest In Jr NTR's Evaru Meelo Koteeswarulu Evaru Meelo Koteeswarulu: ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’కు గెస్ట్‌గా సమంత!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/07/d7be1a634f3c4f767632df12d34e907c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నాగచైతన్యతో నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికిన సమంత మళ్లీ తన పనిలో తాను బిజీబిజీగా ఉంది. విడాకుల ప్రకటన తర్వాత దుమ్ము దులపాలని,మధ్యాహ్నం వరకూ బెడ్ పైనే ఉంటే కుదరదంటూ పోస్ట్ పెట్టింది. చైతూతో విడిపోయిన తర్వాత తొలిసారిగా ఓ యాడ్ షూట్‌లో పాల్గోంది. హైదరాబాద్‌లోని ముకరంజా జానియర్ కాలేజీలో దీనికి సంబంధించిన షూట్ జరిగింది. వాస్తవానికి విడాకుల ప్రకటన తర్వాత సమంత షూట్ కి రాదేమో అని కొందరు సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ కెరీర్ విషయంలో తగ్గేదేలే అంటూ ముఖానికి రంగేసుకుంది. శుక్రవారం జరగనున్న లాక్మే ఫ్యాషన్ వీక్ లోనూ సమంత పాల్గొననుంది. అయితే సామ్ కి సంబంధించి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షోలో సమంత అతిథిగా పాల్గొనబోతోందనే వార్త చక్కర్లు కొడుతోంది. సమంత స్టైలిస్ట్ , స్నేహితురాలు సాధన తన ఇన్ స్టాగ్రామ్ లో ఎవరు మీలో కోటీశ్వరుడు స్పాట్ లో ఉన్న ఓ పిక్ పొస్ట్ చేసింది. దీంతో సామ్ స్పెషల్ గెస్ట్ గా వస్తోందంటూ హడావుడి మొదలైంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ సమయంలో సమంత ఆ షోలో పార్టిసిపేట్ చేస్తే కథ వేరేలా ఉంటదంటున్నారు అభిమానులు.
ఇక సమంత నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన 'శాకుంతలం' ఇటీవల షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. పౌరాణిక నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను చూపించనున్నారు గుణ శేఖర్. దీన్ని మహాభారతంలోని ఆదిపర్వం నుంచి తీసుకున్నామన్నారు. ఈ రమణీయ ప్రేమకావ్యంలో సమంతకు జోడీ ‘దుష్యంతుడి’గా మలయాళీ నటుడు దేవ్ మోహన్ నటించాడు. ఈ సినిమాతో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ బాలనటిగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు. మరోవైపు తమిళంలో నయనతారతో కలసి నటిస్తోన్న సినిమాకి విఘ్నేశ్ శివన్ దర్శకుడు. ఈ సినిమాకు కాతు వాకుల రెండు కాదల్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో విజయ్ సేతుపతి హీరో.
Also Read: చై-సామ్ పెళ్లి రోజు.. మూడేళ్లుగా సమంత పెట్టిన పోస్ట్ లు వైరల్..
Also Read: పింకీకి మరిచిపోలేని బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన బిగ్ బాస్, భావోద్వేగంలో బిగ్ బాస్ హౌస్
Also Read:ప్రభాస్ 25 వ చిత్రం ఆ హిట్ దర్శకుడితోనే, సినిమా పేరేంటంటే..
Also Read: గతేడాది చైతూతో ఈ ఏడాది ఒంటరిగా..పెళ్లి రోజు సందర్భంగా సమంత భావోద్వేగమైన పోస్ట్
Also Read:ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)