News
News
X

Samantha: అమెరికాకు సమంత ప్రయాణం - ట్రీట్మెంట్ కోసమేనా?

కొన్నాళ్లుగా సమంత సోషల్ మీడియాకి దూరంగా ఉంటోంది. బయట కూడా పెద్దగా కనిపించడం లేదు.

FOLLOW US: 

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత(Samantha). వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది. ఓ పక్క తెలుగులో సినిమాలు చేస్తూనే మరోపక్క ఇతర భాషల్లో ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతోంది. అలానే వెబ్ సిరీస్ లపై కూడా దృష్టి పెట్టింది. ఇప్పటికే 'శాకుంతలం' సినిమాను పూర్తి చేసింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలమవుతుంది. ప్రస్తుతం తెలుగులో 'ఖుషి', 'యశోద'.. హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది సమంత.

కొన్నాళ్లుగా సమంత సోషల్ మీడియాకి దూరంగా ఉంటోంది. బయట కూడా పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఆమె చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతుందని వార్తలొచ్చాయి. వీటిపై సమంత మేనేజర్ స్పందించారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన సమంత అనారోగ్యంతో ఉందనే మాటల్లో నిజం లేదని.. ఆమె చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. కావాలనే కొన్ని మీడియా సంస్థలు ఆమెపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. వారిపై లీగల్ యాక్షన్ తీసుకునే ఆలోచనలో సమంత ఉన్నట్లు తెలిపారు. 

ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ బ్యూటీ అమెరికాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. స్కిన్ ట్రీట్మెంట్ కోసమే ఆమె అమెరికా వెళ్తుందని సమాచారం. అక్కడున్న టాప్ స్కిన్ కేర్ హాస్పిటల్ లో సమంతకు ట్రీట్మెంట్ జరగబోతుందట. అమెరికాకు వెళ్లడం కోసమే ఆమె 'ఖుషి' సినిమా కొత్త షెడ్యూల్ లో పాల్గొనలేనని చెప్పిందట. దీంతో సినిమా అనుకున్న సమయానికి పూర్తికాకపోవచ్చు. కాబట్టి చెప్పిన సమయానికి సినిమా రాకపోవచ్చని టాక్. మరి ఈ వార్తలపై సమంత టీమ్ స్పందిస్తుందేమో  చూడాలి..!

ఇదిలా ఉండగా.. ఇప్పుడు సమంత తన రెమ్యునరేషన్ పెంచేసిందట. 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి అమ్మడు రూ.2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది. అలానే 'యశోద', 'శాకుంతలం' సినిమాలకు రూ.2.5 కోట్ల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంది. అయితే ఇప్పుడు ఏకంగా రూ.3.5 కోట్లు డిమాండ్ చేస్తుందట ఈ బ్యూటీ. అంతకంటే తక్కువ ఆఫర్ చేస్తోన్న ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడం లేదట. 

'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2 తరువాత సమంత క్రేజ్ పెరిగింది. ఓటీటీ, శాటిలైట్ ఛానెల్స్ లో తన సినిమాలకు మంచి బిజినెస్ జరుగుతోంది. అందుకే సమంత రెమ్యునరేషన్ విషయంలో అసలు వెనక్కి తగ్గడం లేదు. సౌత్ లో ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ అంటే నయనతార అనే చెప్పాలి. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి సమంత కూడా చేరబోతోంది. 

'యశోద' టీజర్ కి క్రేజీ రెస్పాన్స్:

సమంత నటించిన 'యశోద' సినిమా షూట్ ని కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని వదిలారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 'యశోద'  సినిమా పూర్తిగా సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. సమంత ఇంతకు ముందు చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఈ సినిమా పూర్తిగా భిన్నంగా ఉంటుందని టాక్

Also Read: 'దెబ్బ‌కు థింకింగ్ మారిపోవాలా' - మరోసారి హడావిడి చేయనున్న బాలయ్య!

Also Read: ప్రభాస్ అభిమానులకు నిరాశ తప్పదా?

Published at : 17 Sep 2022 07:45 PM (IST) Tags: samantha khushi movie Samantha usa trip

సంబంధిత కథనాలు

DJ Tillu 2: మొన్న డైరెక్టర్, ఇప్పుడు హీరోయిన్లు - 'డీజే టిల్లు'సీక్వెల్‌ను లైట్ తీసుకుంటున్నారా?

DJ Tillu 2: మొన్న డైరెక్టర్, ఇప్పుడు హీరోయిన్లు - 'డీజే టిల్లు'సీక్వెల్‌ను లైట్ తీసుకుంటున్నారా?

Daughters Day 2022: కూతురు సితారకు మహేష్ బాబు డాటర్స్ డే గ్రీటింగ్స్!

Daughters Day 2022: కూతురు సితారకు మహేష్ బాబు డాటర్స్ డే గ్రీటింగ్స్!

Chiranjeevi: మెగా నిర్మాతల నిర్ణయం - 'గాడ్ ఫాదర్'ని మలయాళంలో రిలీజ్ చేస్తారా?

Chiranjeevi: మెగా నిర్మాతల నిర్ణయం - 'గాడ్ ఫాదర్'ని మలయాళంలో రిలీజ్ చేస్తారా?

Nayanthara: నయనతార ప్రెగ్నెంట్? విఘ్నేష్ శివన్ పోస్ట్ వైరల్

Nayanthara: నయనతార ప్రెగ్నెంట్? విఘ్నేష్ శివన్ పోస్ట్ వైరల్

Ponniyin Selvan: ఐశ్వర్య కూతురు ఆరాధ్యకు అరుదైన గౌరవం, ‘పొన్నియన్ సెల్వన్-1’లో ఊహించని ఘటన

Ponniyin Selvan: ఐశ్వర్య కూతురు ఆరాధ్యకు అరుదైన గౌరవం, ‘పొన్నియన్ సెల్వన్-1’లో ఊహించని ఘటన

టాప్ స్టోరీస్

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

MS Dhoni: ధోనీ ఫేస్ బుక్ పోస్టుపై స్పష్టత, ఈసారి ప్రపంచకప్ మనదే అంటున్న మహీ

MS Dhoni:  ధోనీ ఫేస్ బుక్ పోస్టుపై స్పష్టత, ఈసారి ప్రపంచకప్ మనదే అంటున్న మహీ

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

Zaheerabad Rape: పెళ్లైన మహిళపై గ్యాంగ్ రేప్! జహీరాబాద్‌లో దారుణం

Zaheerabad Rape: పెళ్లైన మహిళపై గ్యాంగ్ రేప్! జహీరాబాద్‌లో దారుణం