Bandla Ganesh: మూడోస్సారి.. మళ్లీ కరోనా బారిన పడ్డ బండ్ల గణేష్!
బండ్ల గణేష్‌కు మూడోసారి కరోనా వైరస్ సోకింది. గతంలో ఫస్ట్ వేవ్‌లో ఒకసారి, సెకండ్ వేవ్‌లో ఒకసారి గణేష్‌కు కరోనా సోకింది.
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే ఆయన కరోనాకు గురవడం ఇదే మొదటిసారి కాదు. ఫస్ట్ వేవ్‌లో ఒకసారి, సెకండ్ వేవ్‌లో ఒకసారి కూడా గణేష్‌కు కరోనా సోకింది. సెకండ్ వేవ్ సమయంలో ఆయనకు కొంచెం సీరియస్ కూడా అయింది.
ఈ మధ్య టాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు, థమన్‌లకు కూడా కరోనావైరస్ సోకింది. కరోనా కారణంగా అన్నయ్య రమేష్ బాబు అంత్యక్రియలకు కూడా మహేష్ బాబు హాజరు కాలేకపోయాడు.
బండ్ల గణేష్ తన ట్వీట్లో ‘గత మూడు రోజులుగా నేను ఢిల్లీలో ఉన్నాను. ఈరోజు సాయంత్రం నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. నాకు తక్కువ లక్షణాలు ఉన్నాయి. కానీ నా కుటుంబానికి మాత్రం కోవిడ్ నెగిటివ్ వచ్చింది. జాగ్రత్తగా ఉండండి. ప్రయాణం చేసేటప్పుడు మరోసారి ఆలోచించుకోండి. నేను ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాను.’ అని పేర్కొన్నారు.
Last three days I was at delhi and I tested positive today evening .
— BANDLA GANESH. (@ganeshbandla) January 9, 2022
I have mild symptoms, and my family is tested negative . Please be careful and think before you travel I’m in isolation .
Thank you #Besafe pic.twitter.com/9i4CIRI5XC
Also Read: 'మీరెప్పటికీ మాతోనే ఉంటారు..' నమ్రత ఎమోషనల్ పోస్ట్..
Also Read: వందల కోట్ల ఆఫర్.. రిజెక్ట్ చేసిన ప్రభాస్..Also Read: రమేష్ బాబు Vs బాలకృష్ణ.. ఆ టైటిల్ కోసం వివాదం..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.