google ceo: ఇదేనా మీరు చెప్పిన స్వేచ్ఛ?.. గూగుల్ సీఈవోకు బన్నీ వాసు లెటర్
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు లేఖ రాశారు. ఓ వ్యక్తి చేస్తున్న దుష్ప్రచారంతో తన ఫ్యామిలీ మానసిక వేదన అనుభవిస్తోందన్నారు.
బాధ్యత లేని భావ ప్రకనట స్వేచ్ఛ... తన కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెడుతోందన్నారు బన్నీ వాసు. సుందర్ పిచాయ్‌కి రాసిన లేఖ చాలా అంశాలు ప్రస్తావించారు. సోషల్ మీడియాల్లో తప్పుడు ప్రచారంతో తన కుమార్తె, తాను ఎంతో మానసికక్షోభ అనుభవించినట్లు వెల్లడించారు. తన కూతురిని చంపుతానని ఓ వ్యక్తి సామాజిక మాద్యమాల్లో వీడియో పెడితే.. దాన్ని తీయించడానికి ఎంతో యాతన పడ్డానని చెప్పుకొచ్చారు. చిత్ర పరిశ్రమలో ఎంతో కొంత పలుకుబడి ఉన్న తనకే ఇంత కష్టమైతే.. సామాన్యుల పరిస్థితి ఏంటని నేరుగా సుందర్ పిచాయ్‌ని ప్రశ్నించారు బన్నీవాసు.
బన్నీ వాసు ఇంకా ఏమన్నారంటే...
" సోషల్ మీడియా వచ్చిన మొదట్లో తనలాంటి వారెందరో చాలా సంతోషించాం... అభిప్రాయాలను స్వేచ్చగా పంచుకునే వేదిక వచ్చిందని నమ్మాం. భావ కటనా స్వేచ్ఛకి, ఇంటర్నెట్ స్వేచ్ఛకు హద్దులు ఉండకూడదని అనుకున్నాం. ఈ నమ్మకంతోనే సోషల్ మీడియాను యూజ్ చేస్తున్నాం. కానీ గత రెండేళ్లుగా బాధ్యతలేని భావ ప్రకటనా చ్ఛ, ఇంటర్నెట్ స్వేచ్ఛ నా ఫ్యామిలీని కుంగదీసింది. ఆ బాధను మీలాంటి వారికి చెప్పటం వల్ల మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. ఇది ప్రభుత్వాలకో లేదా రాజ్యాలకో లేదా సమాజానికో చెందిన విషయం వేరు ఒక వ్యక్తి జీవితానికి, పరువుకు సంబంధించిన విషయం వేరు. సోషల్ మీడియాలో ఉంటున్న వాళ్ళందరూ విచక్షణతో ఉంటున్నారా? విచక్షణ ఉన్న వాళ్ళనే సోషల్ మీడియాలోకి అనుమతిస్తున్నారా? ఈ ప్రశ్నని ఒకసారి మీరు మిమ్మల్ని అడిగి చూడండి ? సామాజిక మాధ్యమాలు అందరికి అందుబాటులో ఉంచాలి అని అన్నా, కనీసం విచక్షణ లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న వాళ్ళని కట్టడి చేయటానికి సమర్థవంతమైన విధానాలు ఉన్నాయా అంటే ఆన్సర్ లేదు.
ఇలాంటి సమస్యతోనే ఇబ్బంది పడుతున్నాను నేను, నా కూతురు. దాని వల్ల నా కుటుంబానికి కలిగిన బాధ చూసిన వాడిగా ఈ లెటర్ రాస్తున్నాను. అబద్ధాలనూ అసత్యాలనూ పోస్టులు, వీడియోల రూపంలో పెట్టి ప్రజలను ఇబ్బంది పెడ్తున్న వాళ్ళది తప్పా ? అలాంటి వాళ్ళు చేస్తున్న పనులను పట్టించుకోని సోషల్ మీడియాలది తప్పా? అని అడిగితే...కేవలం ఒక వేదిక అందించటమే మేం చేస్తున్నదని సోషల్ మీడియా తప్పించుకోవచ్చు. కానీ ఈ విచ్చలవిడి స్వేచ్చకి బలైపోతున్న వాళ్లకు సమాధానం చెప్పేదెవరు?
సరైన విచారణ లేని వార్తలు, పోస్టులు, కామెంట్లను అనుమతిస్తున్న ఇప్పటి సామజిక మాధ్యమాల వలన బలైన నేను, నా ఆరేళ్ల కూతురి ఆవేదనే ఈ లెటర్. నా కూతురిని చంపుతానని ఒక మానసిక స్థిమితం లేని సైకో వీడియో పెడితే, అది తీయించటానికి చాలా కష్టపడ్డాను. నాకే ఇంత కష్టమైతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో ఊహించవచ్చు. నేను సోషల్ మీడియా కంప్లైంట్ సెల్లో ఇచ్చినన్ని ఫిర్యాదులు పోలీసులకు కూడా ఇవ్వలేదు. ఒకరు పెట్టిన పోస్ట్ లేదా న్యూస్ అబద్ధం అని నిరూపించటం సోషల్ మీడియాలో కంటే ఇండియన్ కోర్ట్లలోనే చాలా సులువు. అందుకే కోర్టును ఆశ్రయించి న్యాయం కోసం పోరాడుతున్నాను.
భావప్రకటనా స్వేచ్ఛ అనే పదును వైపు పెడుతున్న మీ శ్రద్ద అవతలి పదును వైపు కూడా పెడితే బాగుంటుంది. మేము పెడుతున్నాము అని అనుకోవచ్చు కానీ దాని సమర్థత వల్ల ఎంతమందికి న్యాయం జరుగుతుంది ? ఈ ఉత్తరం చాలా మందికి వెటకారం కావచ్చు, కానీ తమ కుటుంబంలో స్త్రీలకో, పిల్లలకో ఇలాంటి పరిస్థితి వస్తే కానీ నా ఈ బాధ అర్థం కాదు. అలాంటి బాధను చూసిన వాళ్లకు ఈ లెటర్ అర్థం అవుతుంది, కానీ సోషల్ ప్లాట్ ఫారం అనే నడి వీధిలో నిలబడి వేదిక చూసిన వాళ్ళకి ఇది వినోదంలా కనిపిస్తుంది.