Tollywood: ప్రభాస్ 'సలార్' రీషెడ్యూల్ - పవన్ సినిమా రీమేక్ లో సల్మాన్!
ఈరోజు టాలీవుడ్ కి సంబంధించిన అప్డేట్స్ మీకోసం..
ప్రభాస్ 'సలార్' రీషెడ్యూల్:
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'సలార్'(Salaar). ఈ చిత్రానికి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన.. శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. 'కేజీఎఫ్' సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టారు. ఇప్పుడు షూటింగ్ ను రీషెడ్యూల్ చేయాలని చూస్తున్నారు. రీసెంట్ గా ప్రభాస్ పెదనాన్న, నటుడు కృష్ణంరాజు మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం ప్రభాస్ ని ఎంతగానో బాధిస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ తన ఫ్యామిలీతో గడుపుతున్నారు. అందుకే కొంతకాలం షూటింగ్ కి హాజరయ్యే పరిస్థితి లేదు. దీంతో మేకర్స్ వచ్చే నెలకి షూటింగ్ వాయిదా వేశారు.
పవన్ సినిమా రీమేక్ లో సల్మాన్:
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ఇప్పటికే పలు సౌత్ ఇండియన్ సినిమాలను హిందీలో రీమేక్ చేశారు. ఈ క్రమంలో ఎన్నో హిట్స్ కూడా అందుకున్నారు. ఇప్పుడు ఆయన నటిస్తోన్న సినిమా కూడా రీమేక్ అని సమాచారం. 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' అనే సినిమాలో నటిస్తున్నారు సల్మాన్. అందుతున్న సమాచారం ప్రకారం.. ఇది 'వీరమ్' సినిమాకి రీమేక్ అట. ఇదే సినిమాను పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తెలుగులో 'కాటమరాయుడు' పేరుతో రీమేక్ చేశారు. ఇప్పుడు సల్మాన్ హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వెంకటేష్ కీలకపాత్ర పోషిస్తున్నారు.
నాగ్ సినిమా చెప్పిన టైంకే:
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్', అక్కినేని నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' సినిమాలు ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అక్టోబర్ 5న ఈ రెండు సినిమాలు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నాయి. ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి రావడం మంచిది కాదనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నాగార్జున వెనక్కి తగ్గుతారని అందరూ అనుకున్నారు. కానీ రిలీజ్ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తోంది 'ది ఘోస్ట్' టీమ్. ఈ సినిమా వాయిదా పడుతున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని నిర్మాతలు చెబుతున్నారు. మరోసారి రిలీజ్ డేట్ ప్రకటన చేయాలనుకుంటున్నారు. అంటే బాక్సాఫీస్ వద్ద పోటీ తప్పదేమో!
Interesting update ahead…#TheGhost#TheGhostOnOct5@iamnagarjuna @PraveenSattaru @sonalchauhan7 @SVCLLP @nseplofficial @bharattsaurabh @SonyMusicSouth @AsianSuniel @puskurrammohan @sharrath_marar @Dharmi_edits @mukesh_DOP @ManishC_Actor @iamdinosaar @GulPanag @brahmakadali pic.twitter.com/Gph2I0ONqP
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) August 23, 2022
Also Read : గుణశేఖర్ అవుట్ - త్రివిక్రమ్ చేతికొచ్చిన రానా డ్రీమ్ ప్రాజెక్ట్!
Also Read : మహేష్ ఫ్యాన్స్‌కు పూనకాలే - సినిమా జానర్ రివీల్ చేసిన రాజమౌళి