News
News
X

Tollywood Gossips: చరణ్ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్.. మహేష్ రిజెక్ట్ చేసిన కథతో విజయ్.. 

ఈరోజు టాలీవుడ్ కి సంబంధించిన లేటెస్ట్ గాసిప్స్ మీకోసం..

FOLLOW US: 

చరణ్ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్..

'ఆర్ఆర్ఆర్' తరువాత రామ్ చరణ్ ఎవరితో సినిమా చేయబోతున్నారనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమాలో రామ్ చరణ్ నటించబోతున్నారు. అయితే ఈ సినిమాలో కీలకమైన ఘట్టంలో ట్రైన్ ఎపిసోడ్ వస్తుందని సమాచారం. ఈ సన్నివేశాల్లో రామ్ చరణ్ హీరోయిజాన్ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేయబోతున్నారట. ఈ సీన్ కోసం దాదాపు పది కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నారని టాక్. ఇదొక భారీ యాక్షన్ సన్నివేశమని తెలుస్తోంది. వందలాది మంది ఫైటర్స్ తో ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందట. ఈ ట్రైన్ ఎపిసోడ్ సినిమా మొత్తానికి మెయిన్ హైలైట్ కాబోతుందని తెలుస్తోంది. దానికోసం స్పెషల్ గా ఓ సెట్ కూడా వేయబోతున్నారట. దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్ తో నిర్మించనున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించబోతుంది. 

Also Read: బాయ్ ఫ్రెండ్ తో ట్రిప్ కి వెళ్లి.. కారు ప్రమాదంలో మరణించిన నటి..

మహేష్ రిజెక్ట్ చేసిన కథతో విజయ్.. 

ఇండస్ట్రీలో ఒక హీరోతో అనుకున్న కథలు మరో హీరోకి వెళ్తుండడం కామన్. అయితే ఇప్పుడొక స్టార్ హీరో రిజెక్ట్ చేసిన కథతో మరో స్టార్ హీరో సినిమా చేస్తున్నాడట. వంశీ పైడిపల్లి-మహేష్ బాబు కాంబినేషన్ లో 'మహర్షి' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత మరోసారి ఇద్దరూ కలిసి సినిమా చేయాలనుకున్నారు. ఈ మేరకు వంశీ ఓ కథ కూడా సిద్ధం చేశాడు. కానీ అది కాస్త 'శ్రీమంతుడు', 'మహర్షి' సినిమాలకు దగ్గరగా ఉండడంతో మహేష్ నో చెప్పేశాడు. అదే కథను కోలీవుడ్ హీరో విజయ్ కి వినిపించి ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నాడు వంశీ పైడిపల్లి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 

Also Read: ఎన్టీఆర్ హీరోయిన్ పై యాసిడ్ ఎటాక్.. అంతా ప్లాన్ ప్రకారమే..

వడివేలుతో కీర్తి సురేష్.. 

సూపర్ స్టార్స్ తో కలిసి నటిస్తోన్న కీర్తి సురేష్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉంది. అలాంటిది ఇప్పుడు ఆమె కమెడియన్ వడివేలు సరసన 'నాయ్ శేఖర్ రిటర్న్స్' అనే సినిమాలో నటించనున్నారని కోలీవుడ్ టాక్. సురాజ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా శునకాల నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో వడివేలు సరసన కీర్తి నటించనుందని అంటున్నారు. అయితే ఇందులో వడివేలుకి జోడీ లేదని.. సినిమాలో మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ నటించనుందని అంటున్నారు. మరి ఈ సినిమాపై కీర్తి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి!

Also Read: 'బేబమ్మ' బర్త్ డే స్పెషల్.. వరుస సినిమా అప్డేట్స్..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.

Published at : 21 Sep 2021 09:53 PM (IST) Tags: ram charan Mahesh Babu keerthi suresh Shankar Vijay Tollywood Latest Updates

సంబంధిత కథనాలు

Project K: రెండు భాగాలుగా ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' - ఫ్యాన్స్‌కి పండగే!

Project K: రెండు భాగాలుగా ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' - ఫ్యాన్స్‌కి పండగే!

Bipasha Basu: ఆ ఫోటోలను షేర్ చేస్తూ గుడ్ న్యూస్ చెప్పిన బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ బిపాసా బసు

Bipasha Basu: ఆ ఫోటోలను షేర్ చేస్తూ గుడ్ న్యూస్ చెప్పిన బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ బిపాసా బసు

Prashanth Neel: ఏపీలో హాస్పిటల్ నిర్మాణానికి ప్రశాంత్ నీల్ భారీ సాయం, రఘువీరా ప్రశంసలు

Prashanth Neel: ఏపీలో హాస్పిటల్ నిర్మాణానికి ప్రశాంత్ నీల్ భారీ సాయం, రఘువీరా ప్రశంసలు

Mahesh Babu: మహేష్ కోసం రూటు మార్చిన త్రివిక్రమ్ - నో సెంటిమెంట్, ఓన్లీ యాక్షన్!

Mahesh Babu: మహేష్ కోసం రూటు మార్చిన త్రివిక్రమ్ - నో సెంటిమెంట్, ఓన్లీ యాక్షన్!

Bimbisara Making Video: ‘బింబిసార’లోని ఆ సీన్స్ కోసం ఇంత కష్టపడ్డారా?

Bimbisara Making Video: ‘బింబిసార’లోని ఆ సీన్స్ కోసం ఇంత కష్టపడ్డారా?

టాప్ స్టోరీస్

CM KCR Sings National Anthem: అబిడ్స్ లో సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్న సీఎం కేసీఆర్ | ABP Desam

CM KCR Sings National Anthem: అబిడ్స్ లో సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్న సీఎం కేసీఆర్ | ABP Desam

BJP Office: బీజేపీ ఆఫీసు ముందు కారు కలకలం, లోపల సూట్‌కేసు - బాంబ్‌ స్క్వాడ్‌కు కాల్, ఫైనల్‌గా ట్విస్ట్!

BJP Office: బీజేపీ ఆఫీసు ముందు కారు కలకలం, లోపల సూట్‌కేసు - బాంబ్‌ స్క్వాడ్‌కు కాల్, ఫైనల్‌గా ట్విస్ట్!

AP Dharmika Parishat : ఏపీలో ఆలయాల, మఠాల వ్యవహారాలన్నీ ఇక ధార్మిక పరిషత్ చేతుల మీదుగానే - ప్రభుత్వ జీవో రిలీజ్ !

AP Dharmika Parishat : ఏపీలో ఆలయాల, మఠాల వ్యవహారాలన్నీ ఇక ధార్మిక పరిషత్ చేతుల మీదుగానే -  ప్రభుత్వ జీవో రిలీజ్ !

Face Rollers: ఈ ఫేస్ రోలర్ టూల్ వల్ల ఉపయోగమేంటి? అందం పెరుగుతుందా?

Face Rollers: ఈ ఫేస్ రోలర్ టూల్ వల్ల ఉపయోగమేంటి? అందం పెరుగుతుందా?