Tollywood Updates : చరణ్ సినిమా కోసం ఇంట్రెస్టింగ్ టైటిల్.. దసరా బరిలో అఖిల్..
ఈరోజు టాలీవుడ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం..
![Tollywood Updates : చరణ్ సినిమా కోసం ఇంట్రెస్టింగ్ టైటిల్.. దసరా బరిలో అఖిల్.. Today's Tollywood Latest Updates Tollywood Updates : చరణ్ సినిమా కోసం ఇంట్రెస్టింగ్ టైటిల్.. దసరా బరిలో అఖిల్..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/07/fcca98bd8e1ba7ad7d9e4a327162dad1_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
చరణ్-శంకర్ టైటిల్..
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' తరువాత శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. సెప్టెంబర్ 8న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి టైటిల్ గా 'విశ్వంభర' అనే పేరుని అనుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. విశ్వంభర అంటే భూమి అని అర్ధం. పొలిటికల్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి ఈ టైటిల్ బాగుంటుందని భావిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించనున్నారు.
దసరా బరిలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'..
అక్కినేని అఖిల్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని చాలా కాలమవుతుంది. కానీ కరోనా కారణంగా సినిమా వాయిదా పడుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలనుకున్న ఈ సినిమాను ఎట్టకేలకి విజయదశమి పండుగ సందర్భంగా అక్టోబర్ 8న రిలీజ్ చేస్తున్నట్టు ఓ కొత్త పోస్టర్ విడుదల చేసి అధికారకంగా ప్రకటించారు.
#MostEligibleBachelor is 𝐌𝐚𝐫𝐜𝐡𝐢𝐧𝐠 𝐓𝐨𝐰𝐚𝐫𝐝𝐬 𝐎𝐜𝐭 𝟖𝐭𝐡. 😎💫
— GA2 Pictures (@GA2Official) September 7, 2021
Exciting updates, promotions to start rolling soon. #MEBOnOct8th 🧡#AlluAravind @AkhilAkkineni8 @hegdepooja @baskifilmz @GopiSundarOffl #PradeeshMVarma #BunnyVas #VasuVarma @adityamusic pic.twitter.com/doJ9KKn03o
'ఆహా'లో సుశాంత్ సినిమా..
యంగ్ హీరో సుశాంత్ నటించిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమా ఆగస్టు 27నే థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. యాక్షన్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ఓటిటి లో విడుదల కానుంది. ఇప్పటికే ఆహా (Aha) ఓటిటి ప్లాట్‌ఫామ్ తో డీల్ కుదుర్చుకున్న మేకర్స్.. సెప్టెంబర్ 17న సినిమాను ఆహాలో విడుదల చేయాలని నిర్ణయంచుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన వచ్చేసింది.
No parking place lo vehicles park cheste fine padtundani telsu kani marii ila avtundani evaraina anukuntara! 👀
— ahavideoIN (@ahavideoIN) September 7, 2021
Drama unfolds on September 17🔥#IVNRonaha #ichatavahanamuluniluparadu @AIStudiosOffl @ravishastrioffl @ShaastraMovies @iamSushanthA @Meenakshiioffl @darshn2012 pic.twitter.com/R9BbbZifNR
Also Read : Bigg Boss 5 Telugu : ముఖం పగిలిపోద్ది.. లోబోకి సిరి వార్నింగ్.. ఏడ్చేసిన ఆర్జే కాజల్..
Also Read : Bigg Boss Telugu 5 : బట్టలు లాకెళ్లిన బిగ్ బాస్.. అమ్మాయి డ్రెస్ లో రవి అరాచకం..
Also Read : Pan India Movies : దిల్ రాజు ప్లానింగ్.. నెక్స్ట్ రెండు నెలల్లో రచ్చ రచ్చే..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)