Pushpa 2: పులితో 'పుష్ప'రాజ్ ఫైట్ - థాయిలాండ్ లో షూటింగ్!
'పుష్ప2' సినిమాలో పులితో ఒక పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నారని సమాచారం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన 'పుష్ప ది రైజ్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇంటర్నేషనల్ రేంజ్ లో ఈ సినిమాకి రీచ్ దక్కింది. సినిమాలో బన్నీ మేనరిజమ్స్ ని ఇమిటేట్ చేస్తూ కొన్ని లక్షల రీల్స్ వచ్చాయి. క్రికెట్ మ్యాచ్ లలో, కిక్ బాక్సింగ్ లో 'తగ్గేదేలే' అంటూ రచ్చ చేశారు సెలబ్రిటీలు. 'పుష్ప' ఇంత పెద్ద హిట్ అవుతుందని మేకర్స్ కూడా ఊహించి ఉండరు. ఆ రేంజ్ లో సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా 'పుష్ప ది రూల్' రాబోతుంది.
అల్లు స్టూడియోస్ లో తొలి సినిమా షూటింగ్ గా 'పుష్ప2' మొదలుకాబోతుంది. ఆ తరువాత సినిమాలో ఎక్కువ భాగం అడవుల్లో చిత్రీకరించాల్సి ఉంటుంది. చిత్రయూనిట్ లో ఒక గ్రూప్ థాయిలాండ్ వెళ్లి అక్కడ ఫారెస్ట్ లో పులితో ఒక పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నారని సమాచారం. మరి ఈ టీమ్ లో అల్లు అర్జున్ ఉన్నాడా..? లేదా..? అనేది ఇంకా తెలియరాలేదు. 'పుష్ప' రెండో పార్ట్ లో ఈ పులి సీక్వెన్స్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.
పులి సీన్ అనగానే 'ఆర్ఆర్ఆర్' సినిమాలో సన్నివేశం గుర్తుకురాకమానదు. ఎన్టీఆర్ పులితో ఫైట్ చేసే సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు 'పుష్ప2'లో కూడా బన్నీతో ఈ పులి ఫైట్ పెడుతున్నట్లు టాక్. చిత్రబృందం కొన్ని రోజులు థాయిలాండ్ లో షూటింగ్ చేసి మళ్లీ ఇండియాకు వచ్చి.. దానికి గ్రాఫిక్స్ జోడించి.. బెస్ట్ అవుట్ పుట్ తీసుకురావాలనుకుంటున్నారు.
బన్నీకి విలన్ గా పవర్‌ఫుల్ పొలిటీషియన్:
మొదటి పార్ట్ లో బన్నీకి సపోర్ట్ గా ఉండే ఎంపీ రోల్ లో రావు రమేష్ కనిపించారు. ఎర్రచందనం సిండికేట్ మొత్తాన్ని పుష్ప చేతిలో పెట్టి వెనుక ఉంటూ కథ నడిపిస్తారు. ఇప్పుడు పార్ట్ 2లో పుష్పను ఇబ్బంది పెట్టే ఓ పొలిటీషియన్ రోల్ ఉంటుందట. ఫహద్ ఫాజిల్ తో కలిసి సదరు పొలిటీషియన్ బన్నీతో ఫైట్ కి దిగుతాడట. ఆ పాత్రలో పేరున్న నటుడిని తీసుకోవాలనుకుంటున్నారు. దీనికోసం ఆదిపినిశెట్టి లాంటి స్టార్స్ ను పరిశీలిస్తున్నారు. గతంలో బన్నీ నటించిన 'సరైనోడు' సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా కనిపించారు. ఇప్పుడు మరోసారి ఆయనకు ఛాన్స్ వస్తుందేమో చూడాలి.
2023లో 'పుష్ప' రిలీజ్:
2023లో 'పుష్ప' పార్ట్ 2ని విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టాలని చూస్తున్నారు. నిజానికి పార్ట్ 1 సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం దొరకలేదు. దీంతో ఆ ఎఫెక్ట్ సీజీ వర్క్ పై పడింది. సినిమాలో గ్రాఫిక్స్ సరిగ్గా లేదనే విమర్శలు వచ్చాయి. ఈసారి అలాంటి కామెంట్స్ కి తావివ్వకుండా త్వరగా షూటింగ్ పూర్తి చేసి.. గ్రాఫిక్స్ అండ్ మిగిలిన వర్క్ పై ఎక్కువ ఫోకస్ చేయాలని చూస్తున్నారు.
Also Read : మళ్ళీ ట్రోల్స్ మొదలు - విష్ణు మంచుపై 'జిన్నా' విడుదలకు ముందు ఎందుకిలా?