Pathaan Movie: ‘పఠాన్’ మూవీ గురించి మీకు తెలియని 8 ఇంట్రెస్టింగ్ విషయాలు
బాలీవుడ్ మూవీ ‘పఠాన్’ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. ఇప్పటికే రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
నాలుగేళ్ల గ్యాప్ తర్వాత షారుఖ్ ఖాన్ హీరోగా ‘పఠాన్’ సినిమా విడుదలైంది. ఈ మూవీ విడుదలైన మొదటి రోజునే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. అంతేకాదు, ఆల్ టైమ్ హై బాలీవుడ్ ఓపెనర్‌గా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా రూ.500 కోట్ల మార్కును క్రాస్ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం..
1. తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా
‘పఠాన్’ విడుదలైన తొలి రోజునే కలెక్షన్ల సునామీ సృష్టించింది. దేశీయంగా తొలి రోజు రూ. 55 కోట్ల వసూళ్లతో బాలీవుడ్ హైహెస్ట్ ఓపెన్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లు సాధించింది అబ్బురపరిచింది. రూ.44.97 కోట్లతో షారుఖ్ –దీపిక నటించి ‘హ్యాపీ న్యూ ఇయర్’ రెండో స్థానంలో ఉంది. జాన్ అబ్రహం నటించిన ‘సత్యమేవ జయతే-2’ రూ. 19.50 కోట్లు సాధించి మూడో స్థానంలో కొనసాగుతోంది.
2. అత్యధిక స్ర్కీన్స్ లో విడుదలైన బాలీవుడ్ మూవీ
‘పఠాన్’ 100కు పైగా దేశాల్లో విడుదలైంది. దాదాపు 8,000 ప్రపంచవ్యాప్త స్క్రీన్‌లలో ప్రదర్శించబడింది. వీటిలో 5,500 దేశీయ స్క్రీన్‌లు కాగా, 2,500 అంతర్జాతీయ స్క్రీన్‌లు ఉన్నాయి. ఒక హిందీ మూవీ ఇప్పటి వరకు ఇన్ని స్ర్కీన్ లలో ఎప్పుడూ విడుదల కాలేదు. మొదటి షో తర్వాత టిక్కెట్లకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో ఎగ్జిబిటర్లు 300 షోలను పెంచారు.
3. ఉదయం 6 గంటలకు ప్రదర్శించబడిన తొలి షారుఖ్ మూవీ
షారుఖ్ కెరీర్ లోనే ‘పఠాన్’ మూవీ తొలి రోజు ఉదయం 6 గంటలకే మొదటి షో వేశారు. ఇంతక వరకు ఆయన నటించిన ఏ సినిమా కూడా రెగ్యులర్ టైమ్స్ కు ముందు ప్రదర్శింపబడలేదు.
4. SRK తల్లిగా అమీర్ ఖాన్ సోదరి
‘పఠాన్’ మూవీలో అమీర్ ఖాన్ సోదరి నిఖత్ ఖాన్, షారుఖ్ పెంపుడు తల్లి పాత్రను పోషించింది. ‘పఠాన్’తో పాటు, తాన్హాజీ (2020), సాంద్ కి ఆంఖ్ (2019), మిషన్ మంగళ్ (2019) సినిమాల్లోనూ ఆమె నటించింది.
5. 10 రోజుల్లో 100 మిలియన్ల వ్యూస్ అందుకున్న ‘బేషరమ్ రంగ్’
ఈ సినిమాలోని ‘బేషరమ్ రంగ్’ సాంగ్ కేవలం 10 రోజుల్లోనే యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ అందుకుంది. ప్రస్తుతం, ఈ వీడియోకు 260 మిలియన్లకు పైగా వీక్షణలు ఉన్నాయి.
6. బైకాల్ సరస్సులో చిత్రీకరించబడిన తొలి ఇండియన్ మూవీ
సైబీరియాలో గడ్డకట్టిన బైకాల్ సరస్సు దగ్గర చిత్రీకరించబడిన మొదటి భారతీయ చిత్రం ‘పఠాన్’. ఎత్తైన సరస్సు దగ్గర సన్నివేశాలను చిత్రీకరించడానికి మాస్కో నుండి ప్రత్యేక పరికరాలను కొనుగోలు చేసినట్లు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ వెల్లడించారు. అటు స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్, ఇటలీ, యుఎఇ, ఆఫ్ఘనిస్తాన్, ఇండియాలలో ఈ మూవీ షూటింగ్ కొనసాగింది.
7. IMAX కెమెరాలతో చిత్రీకరించిన తొలి బాలీవుడ్ మూవీ
IMAX DMR అని పిలువబడే డిజిటల్ IMAX కెమెరాలలో పూర్తిగా చిత్రీకరించబడిన మొదటి బాలీవుడ్ చిత్రంగా ‘పఠాన్’ ఘనత సాధించింది.
8. ‘పఠాన్’ యాక్షన్ డైరెక్టర్ గా కేసీ ఓనీల్
హాలీవుడ్‌లోని ఉత్తమ యాక్షన్ దర్శకుల్లో ఒకరైన కేసీ ఓనీల్ ‘పఠాన్’ యాక్షన్ సన్నివేశాలకు దర్శకత్వం వహించారు. ఓ నీల్ ‘టాప్ గన్: మావెరిక్’, ‘మిషన్ ఇంపాజిబుల్’ లాంటి ప్రతిష్టాత్మక సినిమాలకు స్టంట్ కోఆర్డినేటర్‌గా పనిచేశాడు.
Read Also: బాత్రూమ్‌లో కూర్చోని ఏడ్చిన షారుఖ్ - కింగ్ ఖాన్‌ను అంతగా బాధపెట్టిన విషయం ఏమిటీ?