అన్వేషించండి

Shah Rukh Khan: బాత్రూమ్‌లో కూర్చోని ఏడ్చిన షారుఖ్ - కింగ్ ఖాన్‌ను అంతగా బాధపెట్టిన విషయం ఏమిటీ?

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘పఠాన్’ సక్సెస్ మీట్ లో మాట్లాడిన ఆయన, గత ఫెయిల్యూర్స్ ను తట్టుకోలేక బాత్ రూమ్ లో కూర్చుని ఏడ్చినట్లు చెప్పారు.

నాలుగేళ్ల తర్వాత షారుఖ్ ఖాన్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ‘పఠాన్’ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్నారు. జనవరి 25న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు రూ.600 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పటికీ భారీ వసూళ్లతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘పఠాన్’ చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దీపికా పదుకొణె, జాన్ అబ్రహం, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌ పాల్గొన్నారు. ఇందులో షారుఖ్ ఖాన్ కీలక విషయాలు వెల్లడించారు. వరుస పరాజయాలతో తను ఎలాంటి బాధను అనుభవించారో వివరించారు.     

‘జీరో’తో సినిమాలకు బ్రేక్

2018లో షారుఖ్ నటించిన ‘జీరో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని పొందింది. మంచి విజయాన్ని అందుకుంటుంది అనుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ‘ఫ్యాన్’, ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ లాంటి సినిమాలు సైతం బాగా ఆడలేదు. వరుస పరాభవాలతో మానసికంగా చాలా ఇబ్బంది పడినట్లు చెప్పారు. వరుస పరాజయాలకు తట్టుకోలేక బాత్ రూమ్ లో కూర్చొని ఏడ్చినట్లు వెల్లడించారు. అదే సమయంలో కొంత కాలం పాటు సినిమాలకు విరామం తీసుకోవాలని భావించినట్లు చెప్పారు. లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన ‘పఠాన్‘ తన కెరీర్ లో బెస్ట్ విజయాన్ని అందించిందని చెప్పుకొచ్చారు.   

పరాజయాలను తట్టుకోలేక ఎన్నోసార్లు ఏడ్చాను-షారుఖ్

“ప్రతి ఒక్కరూ వైఫల్యాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని తట్టుకునే శక్తిని ఒక్కోసారి కోల్పోతాం. ఆ సమయంలో చాలా బాధపడతాం. ఒక్కోసారి ఏడ్పు వస్తుంది. నాకు కూడా అలాంటి పరిస్థితి ఎదురయ్యింది. ‘జీరో’తో పాటు వరుసగా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మా ఇంట్లో ఓ స్పెషల్ బాత్ రూమ్ ఉంది. నేను అందులోకి చాలా బాధలో ఉన్నప్పుడు మాత్రమే వెళ్తాను. ‘జీరో’ మూవీ తర్వాత అలా చాలా సార్లు వెళ్లాను. నేను అందులోకి వెళ్తే ఏడుస్తాను అనే విషయం మా ఇంట్లో వాళ్లకు తెలుసు. కానీ, అక్కడే ఉండిపోలేం కదా. రేపటి విజయం కోసం ప్రయత్నించాల్సిందే. తిరిగి మనల్ని మనం నిరూపించుకోవాల్సిందే!” అని షారుఖ్ వివరించారు.    

‘డుంకీ’, ‘జవాన్’ సినిమాలపై భారీ అంచనాలు

షారుఖ్ చెప్పినట్లుగానే వరుస పరాజయాల తర్వాత తను అద్భుత విజయాన్ని అందుకున్నారు.  ‘పఠాన్‘ మూవీతో బాలీవుడ్‌ లో అతిపెద్ద ఓపెనింగ్స్‌ ను సాధించారు. ఈ బ్లాక్ బస్టర్ హిట్ తో అతడి రాబోయే సినిమాలు ‘డుంకీ’, ‘జవాన్’పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఆయన ఈ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. శర వేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాయి. ఈ సినిమాలు సైతం ‘పఠాన్’ లాంటి హిట్ అందుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Read Also: చెన్నై ఎయిర్ పోర్టులో చేదు అనుభవం, ఎయిర్ ఇండియాపై ఖుష్బూ ఆగ్రహం

టాప్ హెడ్ లైన్స్

Varanasi Plot : వారణాసి స్టోరీ లీక్ - ఈ ప్లాట్ అస్సలు ఊహించలేదు... రాజమౌళి చెప్పిన సీక్రెట్స్ ఏంటంటే?
వారణాసి స్టోరీ లీక్ - ఈ ప్లాట్ అస్సలు ఊహించలేదు... రాజమౌళి చెప్పిన సీక్రెట్స్ ఏంటంటే?
Jyothika Munirathnam: బుల్లితెరపై విలన్ రోల్, రియల్ లైఫ్‌లో మోడ్రన్ క్వీన్.. జ్యోతిక మునిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెరపై విలన్ రోల్, రియల్ లైఫ్‌లో మోడ్రన్ క్వీన్.. జ్యోతిక మునిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Suhasini: వెండి తెర నుంచి బుల్లితెరకు.. తొలి సినిమా, సీరియల్ హిట్.. సుహాసిని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
వెండి తెర నుంచి బుల్లితెరకు.. తొలి సినిమా, సీరియల్ హిట్.. సుహాసిని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Sambarala Yeti Gattu: సాయి దుర్గా తేజ్ SYGలో బాలీవుడ్ టాప్ స్టార్... రిలీజ్ అప్డేట్ ఇచ్చిన టీమ్
సాయి దుర్గా తేజ్ SYGలో బాలీవుడ్ టాప్ స్టార్... రిలీజ్ అప్డేట్ ఇచ్చిన టీమ్

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vedma Bojju Patel: ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
YS Jagan: రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
Secrets of Tirumala: 'వేంకటేశ్వర' పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
'వేంకటేశ్వర' ఈ పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Jyothika Munirathnam: బుల్లితెరపై విలన్ రోల్, రియల్ లైఫ్‌లో మోడ్రన్ క్వీన్.. జ్యోతిక మునిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెరపై విలన్ రోల్, రియల్ లైఫ్‌లో మోడ్రన్ క్వీన్.. జ్యోతిక మునిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Sunday Puja Vidhi : ఆదివారం ఉప్పు తినొద్దు! ఈ రోజు పూజావిధానం, ఫలితాల గురించి తెలుసుకోండి!
ఆదివారం ఉప్పు తినొద్దు! ఈ రోజు పూజావిధానం, ఫలితాల గురించి తెలుసుకోండి!
Embed widget