By: ABP Desam | Updated at : 01 Feb 2022 09:57 AM (IST)
మోసెస్ జె. మోస్లే (Image courtesy - @WalkingDead_AMC Twitter & Moses J Moseley Instagram)
'ది వాకింగ్ డెడ్'లో టీవీ సిరీస్‌లో జాంబీలలో ఒకరిగా నటించిన మోసెస్ జె. మోస్లే తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 31 సంవత్సరాలు. అయితే... ఆయనది హత్యా? ఆత్మహత్యా? అనేది మిస్టరీగా మారింది.
మోసెస్ కుటుంబ సభ్యులు జనవరి 21 నుంచి అతడి ఆచూకీ తెలియలేదని తెలిపారట. ఎక్కడ ఉన్నాడనే సమాచారం లేకపోవడం, ఫోన్ ద్వారా అందుబాటులోకి రాకపోవడంతో జనవరి 23న (బుధవారం) మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కార్ సెక్యూరిటీ కంపెనీని కాంటాక్ట్ చేయగా... జీపీఎస్ ఆధారంగా కార్ ట్రాక్ చేశారు. కార్ దగ్గరే మోసెస్ మృతదేహం లభించింది.
మోసెస్ ఒంటి మీద గన్ షాట్ ఉంది. ఎవరైనా తుపాకీతో అతడిని కాల్చి చంపారా? లేదంటే అతడే షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నారా? అనేది ఇంకా తెలియలేదు. ఆత్మహత్య అనే కోణంలో అమెరికన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట. అమెరికాలోని అట్లాంటా శివార్లలో గల హడ్సన్ బ్రిడ్జ్ ఏరియాలో మోసెస్ మృతదేహం లభించింది. అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 'వాచ్ మెన్', 'క్వీన్ ఆఫ్ సౌత్' షోలలో కూడా మోసెస్ జె. మోస్లే నటించారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
Our thoughts and prayers are with our #TWDFamily member Moses J. Moseley. pic.twitter.com/ahCrRNA652
— The Walking Dead on AMC (@WalkingDead_AMC) February 1, 2022
Dhanush Speech: తెలుగు, తమిళ ప్రజలు ఎంత దగ్గరివారో తెలిసింది - ‘సార్’ ట్రైలర్ లాంచ్లో ధనుష్ ఏమన్నారంటే?
Siri Hanmanth Emotional: షర్ట్పై కిస్ చేసేదాన్ని - తప్పు చేశానంటూ ఏడ్చేసిన సిరి, ఓదార్చిన శ్రీహాన్
Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?
సిద్దార్థ్- కియారా జంటకు క్షమాపణలు చెప్పిన ఉపాసన, ఎందుకంటే..
Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?
Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి