అన్వేషించండి

The Nun 2 Trailer: ఒకప్పటి దేవతే ఈ దెయ్యం - వెన్నులో వణుకు పుట్టిస్తోన్న ‘ది నన్ 2’ ట్రైలర్

‘ఈవిల్ డెడ్’ సిరీస్ ల తర్వాత అంతగా భయపెట్టిన సిరీస్ లలో ‘ది కంజురింగ్’ ముందుంటుంది. ఇప్పుడు ఆ యూనివర్స్ నుంచి మరో హారర్ మూవీ వచ్చేస్తుంది. అదే ‘ది నన్ 2’.

The Nun 2 Trailer: హాలీవుడ్ సినిమాలు ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాలకు అభిమానులు ఉంటారు. ముఖ్యంగా హాలీవుడ్ హారర్ సినిమాలకు ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. హారర్ మూవీ లవర్స్ ఎక్కువగా ఈ సినిమాలు చూస్తుంటారు. అందులోనూ కొన్ని హాలీవుడ్ సినిమా ఫ్రాంచైజీలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలాంటి హారర్ సినిమా ప్రాంచైజీలో ‘ది కంజురింగ్’ ఒకటి. ‘ఈవిల్ డెడ్’ సిరీస్ ల తర్వాత అంతగా భయపెట్టిన సిరీస్ లలో ‘ది కంజురింగ్’ ముందుంటుంది. ఇప్పుడు ఆ యూనివర్స్ నుంచి మరో హారర్ మూవీ వచ్చేస్తుంది. అదే ‘ది నన్ 2’. ఈ మూవీకు మైఖేల్ చావ్స్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడీ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 

ఒకప్పటి దేవతే ఈ దెయ్యం: ‘ది నన్ 2 ట్రైలర్’

‘ది నన్ 2’ సినిమా 2018 లో వచ్చిన ‘ది నన్’ సినిమాకు సీక్వెల్ గా వస్తోంది. ఈ మూవీ ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. తాజాగా విడుదల అయిన ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచేలా ఉంది. 2.18 నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ ఇప్పుడు ప్రేక్షకులను భయపెడుతోంది. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. సినిమా 1956 ప్రాంతంలో జరిగిన కథలానే కనిపిస్తోంది. అందుకే ఓల్డ్ సెట్టింగ్ అలాగే కనబడుతోంది. ట్రైలర్ మొదట్లో ఒక స్కూల్ లో ఒక ప్రీస్ట్ చనిపోవడం, దాన్ని ఒక అమ్మాయి చూస్తున్నట్లు చూపించారు.  ఆ అమ్మాయికి ఆ స్కూల్ లో అన్నీ వింత వింతగా కనిపిస్తాయి. తర్వాత ఆమె దెయ్యం రూపంలో వచ్చిన నన్(సిస్టర్ ఐరీన్) ను చూసినట్టు చెబుతుంది. ఇక అక్కడ నుంచి వారిని ఆ నన్ భయపెడుతూ ఉంటుంది. అయితే ఆ దెయ్యం ఒకప్పటి దేవతే, దేవుడు దాన్ని తిరస్కరించాడు అని ఒక వ్యక్తి చెప్తాడు. ఆ దెయ్యాన్ని ఎలాగైనా నరకానికి పంపించేయాలని చెప్తాడు. తర్వాత ఆ నన్ వారి వెంట పడుతున్నట్టు భయానక విజువల్స్, దడ పుట్టించే బ్యాగ్రౌండ్ స్కోర్ తో వెన్నులో వణుకు పుట్టే విధంగా ట్రైలర్ ను కట్ చేశారు మేకర్స్.

‘ది కంజురింగ్’ యూనివర్స్ లో భాగంగా ‘ది నన్ 2’

హాలీవుడ్ సినిమాలు చూసే ప్రేక్షకులకు ‘ది కంజురింగ్’ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. 2013 లో వచ్చిన ‘ది కంజురింగ్’ సినిమా భారీ హిట్ అవ్వడంతో ఈ మూవీ ఒక సీక్వెల్ చిత్రాలతో ఒక యూనివర్స్ ను క్రియేట్ చేసింది. ఈ మూవీ తర్వాత  2016లో ‘ది కంజురింగ్ 2’ అలాగే ‘ది కంజురింగ్: ది డెవిల్ మేడ్ మీ డూ ఇట్’ వంటి సినిమాలు వచ్చాయి. అలాగే అన్నాబెల్లే సీక్వెల్స్ కూడా కంజురింగ్ యూనివర్స్ లో వచ్చాయి. ఇక ఇదే యూనివర్స్ లో 2018 లో వచ్చిన ‘ది నన్’ సినిమా సూపర్ హిట్ కావడంతో దీని సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు ప్రేక్షకులు. ఇప్పుడు ‘ది నన్ 2’ సినిమా రాబోతోంది. తాజాగా విడుదలైన ‘ది నన్ 2’ ట్రైలర్ కూడా అదిరిపోవడంతో మూవీ పై భారీ అంచనాలు పెరిగాయి. ఈ సీక్వెల్‌లో స్టార్మ్ రీడ్, అన్నా పాప్‌వాల్‌, కాట్లిన్ రోజ్ డౌనీతో పాటు తదితర సహాయక నటీనటులు నటించారు. వార్నర్ బ్రదర్స్ నిర్మాణంలో రూపొందిన ఈ ‘ది నన్ 2’ సెప్టెంబర్ 8, 2023న థియేటర్లలోకి రానుంది.

Also Read: సంచలనాలు సృష్టిస్తోన్న ‘సలార్’ - ఆ విషయంలో ఇండియాలోనే టాప్ మూవీగా రికార్డు!

టాప్ హెడ్ లైన్స్

Case Of Kondana OTT : చిన్న కారణానికే హత్య... ఒక్క రాత్రిలో ఊహించని ఘటనలు - ఓటీటీ ట్రెండింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్
చిన్న కారణానికే హత్య... ఒక్క రాత్రిలో ఊహించని ఘటనలు - ఓటీటీ ట్రెండింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 25th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
Akhil Akkineni : ఏజెంట్ డిజాస్టర్... అమెరికన్ సిటిజన్ షిప్... సిసింద్రీ సీక్వెల్ - అఖిల్ అక్కినేని రియాక్షన్
ఏజెంట్ డిజాస్టర్... అమెరికన్ సిటిజన్ షిప్... సిసింద్రీ సీక్వెల్ - అఖిల్ అక్కినేని రియాక్షన్
Nara Rohith : సౌండ్ ఇంజినీర్‌గా నారా రోహిత్ - కామెడీ జానర్‌లో కొత్త మూవీ
సౌండ్ ఇంజినీర్‌గా నారా రోహిత్ - కామెడీ జానర్‌లో కొత్త మూవీ...

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Chennai Love Story : హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
Income Tax Notice: చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
CJP GenZ Protest Success Story: కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
Embed widget