అన్వేషించండి

Salaar teaser: సంచలనాలు సృష్టిస్తోన్న ‘సలార్’ - ఆ విషయంలో ఇండియాలోనే టాప్ మూవీగా రికార్డు!

ఇప్పుడు ఈ ‘సలార్’ టీజర్ లెక్కలు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. తాజాగా ఈ టీజర్ సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటి వరకూ ఇండియాలో ఉన్న టాప్ నాలుగు సినిమాల్లో మూడు ప్రభాస్ సినిమాలేనట.

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ‘సలార్’ సినిమా టీజర్ జూన్ 6 తెల్లవారుజామున 5:12 గంటలకు విడుదల అయింది. ఈ టీజర్ విడుదల అయినప్పటి నుంచీ సంచలనాలు సృష్టిస్తోంది. ‘సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్’ అనే టైటిల్ తో టీజర్ ను విడుదల చేశారు. ఊహకందని రేంజ్ లో ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించారని టీజర్ చూస్తే తెలుస్తోంది. మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఈ ‘సలార్’ టీజర్ లెక్కలు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. తాజాగా ఈ టీజర్ సరికొత్త రికార్డును సృష్టించింది. 

రికార్డులు సృష్టిస్తోన్న ‘సలార్’ టీజర్..

‘సలార్’ సినిమా టీజర్ కోసం ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ టీజర్ యూట్యూబ్ లో విడుదల అయినప్పటి నుంచీ రికార్డుల స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. తాజా అప్డేట్ ల ప్రకారం ‘సలార్’ టీజర్ గడచిన 24 గంటల్లో దాదాపు 83 మిలియన్లకు పైగా నే వ్యూస్ 1.6 మిలియన్ల లైక్ లు సాధించి సంచలనం సృష్టించి భారతదేశంలో అత్యధికంగా వీక్షించబడిన టీజర్‌ గా నిలిచింది. ఆదిపురుష్, KGF చాప్టర్-2, రాధే శ్యామ్ సినిమాల టీజర్ లు ఇప్పటి వరకూ రికార్డు స్థాయిలో వ్యూస్ ను సంపాదించాయి. అయితే ఇప్పుడు ఆ కోవలోకి ‘సలార్’ టీజర్ కూడా వచ్చి చేరింది. టాప్ లో ఉన్న నాలుగు మూవీ టీజర్ ల వ్యూస్ లలో మూడు సినిమాలు ప్రభాస్‌వే ఉండటం విశేషం. దీంతో ప్రభాస్ అభిమానుల సంతోషానికి అవధులే లేవు.

ఇది ‘సలార్’ మాస్ ఎలివేషన్ టీజర్..

‘ఆదిపురుష్’ సినిమాతో నిరాశలో ఉన్న ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అందరూ ఊహించినదానికంటే కాస్త ఎక్కవే ఇచ్చాడు. ‘సలార్’ టీజర్‏లో ఎలివేషన్స్, బ్యాగ్రౌండ్, డైలాగ్స్ అదిరిపోయాయి. హీరో పాత్రను ఎలివేషన్ చేయడంలో ప్రశాంత్ నీల్ ది ఒక ప్రత్యేక శైలి. అది ఈ సినిమాలో కూడా చాలా స్ఫష్టంగా కనబడుతోంది. హీరో గురించి టీనూ ఆనంద్ చెప్పిన డైలాగ్స్ అదే సమయంలో ప్రభాస్‏ను ఎలివేషన్ చేసిన తీరు అదిరిపోయిందని. దీంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్‏ లో సంచలనాలు సృష్టిస్తోంది. 

టీజర్ కాదు ట్రైలర్ కావాలి..

సాధారణంగా సినిమా టీజర్ అంటే హీరో ఇంట్రడక్షన్, డైలాగ్స్, కొన్ని ఫైట్స్ అలా చూపిస్తూ హీరో పాత్రను పరిచయం చేస్తారు. అయితే ‘సలార్’ టీజర్ లో ప్రభాను ఫేస్ కూడా చూపించలేదు. కనీసం ఓ డైలాగ్ కూడా లేదు. ఇదే ప్రభాస్ అభిమానుల్ని కాస్త నిరాశపరిచింది. ఫేస్ కూడా చూపించకుండా టీజర్ ఏంటని పెదవి విరిచారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. అందుకే ఇప్పుడు ట్రైలర్ ను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రైలర్ లో అయినా తన అభిమాన నటుడి లుక్స్, డైలాగ్స్ చూడాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. మరి ట్రైలర్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. ఇక ఈ సినిమాలో ఈశ్వరి రావు, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, టిీనూ ఆనంద్, శ్రీయా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీను హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 28, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: ఈ సీరియల్స్ లో సన్నివేశాలు చూస్తే రెండు చేతులు జేబులో పెట్టుకొని వెళ్లిపోవడం ఖాయం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
World's Worst Tsunami: ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు -  మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు - మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
Airtel Not Working: డౌన్ అయిన ఎయిర్‌టెల్ - యూజర్లకు చుక్కలు!
డౌన్ అయిన ఎయిర్‌టెల్ - యూజర్లకు చుక్కలు!
Boxing Day Test Live Updates: వివాదంలో చిక్కుకున్న కోహ్లీ.. నిషేధమా..? లేక జరిమానా..? ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోందంటే..?
వివాదంలో చిక్కుకున్న కోహ్లీ.. నిషేధమా..? లేక జరిమానా..? ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోందంటే..?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
World's Worst Tsunami: ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు -  మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు - మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
Airtel Not Working: డౌన్ అయిన ఎయిర్‌టెల్ - యూజర్లకు చుక్కలు!
డౌన్ అయిన ఎయిర్‌టెల్ - యూజర్లకు చుక్కలు!
Boxing Day Test Live Updates: వివాదంలో చిక్కుకున్న కోహ్లీ.. నిషేధమా..? లేక జరిమానా..? ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోందంటే..?
వివాదంలో చిక్కుకున్న కోహ్లీ.. నిషేధమా..? లేక జరిమానా..? ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోందంటే..?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Shruthi Haasan : పెళ్లి కంటే రిలేషన్​షిప్​లో ఉండడమే ఇష్టం... పెళ్లిపై మరోసారి శృతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పెళ్లి కంటే రిలేషన్​షిప్​లో ఉండడమే ఇష్టం... పెళ్లిపై మరోసారి శృతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Ind Vs Aus Test Series: హోరాహోరీగా బాక్సింగ్ డే టెస్టు - చివరి సెషన్లో సత్తా చాటిన భారత బౌలర్లు
హోరాహోరీగా బాక్సింగ్ డే టెస్టు - చివరి సెషన్లో సత్తా చాటిన భారత బౌలర్లు
SBI Special FD: ఎఫ్‌డీపై ఎక్కువ రాబడి కావాలంటే ఎస్‌బీఐ వైపు చూడండి - స్పెషల్‌ స్కీమ్‌ స్టార్టెడ్‌
ఎఫ్‌డీపై ఎక్కువ రాబడి కావాలంటే ఎస్‌బీఐ వైపు చూడండి - స్పెషల్‌ స్కీమ్‌ స్టార్టెడ్‌
Embed widget