అన్వేషించండి

Hindi Serials Funny Scenes: ఈ సీరియల్స్ లో సన్నివేశాలు చూస్తే రెండు చేతులు జేబులో పెట్టుకొని వెళ్లిపోవడం ఖాయం!

సాధారణంగా మనిషి ఊహకందని విషయాలను సైన్స్ కనుగొంటూ ఉంటుంది. మనం కూడా వాటిని నమ్ముతాం. కానీ సైన్స్ కూడా అందని చాలా లాజిక్స్ ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. వాటిల్లో టీవీ సీరియల్స్ కూడా ఒకటి.

Hindi Serials: సాధారణంగా మనిషి ఊహకందని విషయాలను సైన్స్ కనుగొంటూ ఉంటుంది. మనం కూడా వాటిని నమ్ముతాం. కానీ సైన్స్ కూడా అందని చాలా లాజిక్స్ ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. వాటిల్లో టీవీ సీరియల్స్ కూడా ఒకటి. మీరు విన్నది నిజమే. పెరుగుతున్న కంప్యూటర్ టెక్నాలజీను ఉపయోగించుకొని ఇప్పుడు వచ్చే సీరియల్స్ దర్శకులు చేసే ప్రయోగాలు చూస్తే మీక్కూడా క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా హిందీ సీరియల్స్ లలో వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు నవ్వాలో.. ఏడవాలో తెలియని సందిగ్దంలోకి నెట్టుతున్నాయి. ఓ స్కూటర్ పై చంద్రుడు మీదకు వెళ్లడం.. టేబుల్ ఫ్యాన్ లో మహిళలు ధరించే దుపట్టా ఇరుక్కొని ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ఆమెకు ఎవరూ కాపాడలేకపోవడం ఇలాంటి ఘోరమైన సన్నివేశాలు చూసి కొంతమంది ఆడియన్స్ నవ్వుతుంటే.. కొంతమంది మాత్రం ఈ క్రియేటివిటీ చూసి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని వెళ్లిపోతున్నారు. అలాంటి కొన్ని విచిత్రమైన సీరియల్ సన్నివేశాలు వెతికి ఇక్కడ పొందుపరిచాము. మీరు ఓ లుక్కేసేయండి మరి..

1. చంద్రుడిపైకి స్కూటర్ లో..

ఈ ఆశ్యర్యపరిచే సీరియల్స్ దర్శకుల క్రియేటివిటీలో ముందుగా చెప్పుకోవాల్సింది హిందీ సీరియల్ ‘‘ఇష్క్ కి దాస్తాన్ నాగమణి’’ గురించి. ఈ సీరియల్‌ లో కథానాయికగా నటించిన మహిళ తన భర్త, బిడ్డను రక్షించుకోవడానికి ఏకంగా చంద్రుడి పైకి వెళ్తుంది. అది కూడా ఓ స్కూటర్ పైనే. సన్నివేశంలో ఆమె మేడపై ఉన్న స్కూటర్ ఎక్కి ఆకాశంలోకి ఎగురుతుంది. అటునుంచి అటే రయ్యిన దూసుకెళ్లి.. నేరుగా చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది. ఈ సన్నివేశం చూసిన కొంత మంది సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇదంతా చూస్తే.. ఒకవేళ సీరియల్స్ కు ఆస్కార్ ఇస్తే ఈ సీరియల్ కే ఇవ్వాలని మీరు కూడా డిమాండ్ చేస్తారు. అంతలా మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది ఈ స్కూటర్ సీన్.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by A Clear Record (@aclearrecord)

2. సంగీతా ఘోష్ ఫ్యాన్ సీన్.

హిందీ సీరియల్ ‘స్వరణ్ ఘర్’ సీరియల్ లో ఓ సన్నివేశంలో నటి సంగీతా ఘోష్ దుపట్టా స్టాండింగ్ ఫ్యాన్ లో ఇరుక్కుంటుంది. అది క్రమేపీ ఆమె గొంతును నొక్కేస్తుంది. ఇదంతా పక్కన ఉన్న హీరోతో సహా అందరూ చూస్తారు. కానీ ఆమెను కాపాడలేకపోతారు. హీరో వచ్చి ఆ దుపట్టాను తప్పించాలని చూస్తాడు కానీ అది రాదు. మరోవైపు ఓ మహిళ ఆ ఫ్యాన్ స్విఛ్ ఆఫ్ చేయాలని చూస్తుంది కానీ అదీ అవ్వదు. ఇక చేసేదేమీ లేక హీరో ఆ దుపట్టాను తన నోటితో కొరికి చించేయాలని చూస్తాడు. ఈ సన్నివేశం చూశాక మీకు ఓ నాలుగు రోజులు ఏమీ అర్థం కాదు. మీ మైండ్ లో నుంచి ఆ సన్నివేశాన్ని ఏం చేసినా తొలగించలేరు. అది ఆ సన్నివేశం మహత్యం. 

3. యాక్సిడెంటల్ హస్బెండ్..

కొన్ని సీరియల్స్ లో సీన్స్ చూస్తే ఆ దర్శకుడు సైన్స్ సబ్జెక్ట్ చదవలేదేమో అని అనిపిస్తుంటుంది. 'తాప్కీ ప్యార్ కి' లో ఈ సీన్ చూస్తే మీకు అదే అనిపిస్తుంది. ఈ సీరియల్ లో ఓ సన్నివేశంలో హీరో అనుకోకుండా పడిపోతాడు. అయితే అలా పడుతూ.. పడుతూ.. ఊహించని విధంగా అద్దం దగ్గర నిలబడ్డ తన హీరోయిన్ కు కుంకుమ బొట్టు పెడతాడు. ఈ సీన్ ను మీరు ఎన్ని సార్లు రీప్లే వేసి  చూసినా అందులో లాజిక్ అర్థం కాదు. ఇదొక హఠాత్పరిణామం అనే చెప్పాలి. 

4. సింధూర్ 2.O

ఓ హిందీ సీరియల్ లో ఒక సన్నివేశంలో సింధూరం తో కూడిన ఒక తాళి ఉంటుంది. దానికోసం ఇద్దరు హీరోయిన్స్ పోటీపడతారు. దాన్ని ఆకాశంలో పైకి విసిరుతారు. కానీ అది ఎంతసేపటికీ కిందకు రాదు. ఈలోపు ఈ ఇద్దరు హీరోయిన్స్ దాని కోసం పోటీ పడుతూ ఒకరినొకరు నెట్టుకుంటారు. ఈ సన్నివేశం చూసి భూమి గురుత్వాకర్షణ శక్తి మీద మీక్కూడా డౌట్ రావచ్చు. ఈ సన్నివేశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. 

5. ‘ససురల్ సిమర్ కా’ ఓవరాక్షన్ సీన్..

ఈ లిస్ట్ లో ‘ససురల్ సిమర్ కా’ సీరియల్ గురించి చెప్పకుండా ముగిస్తే ఎలా. ఈ సీరియల్ లో ఒక సన్నివేశంలో హీరోయిన్ ను ఓ మహిళ్ చెంపపై కొడుతుంది. దీంతో ఆమె ఓ పక్కకి పడిపోతూ డోర్ కర్టెన్ కు గొంతు బిగుసుకుంటుంది. అది ఎలా జరిగిందో ఎవరికీ తెలీదు. కానీ ఈ సీన్ చూస్తే ఇంత ఓవరాక్షన్ ఉంటుందా సీరియల్స్ లో అని అనుకుంటారు. ఇది కూడా ఒక హఠాత్పరిణామం అనే చెప్పొచ్చు. 

ఇలాంటి సన్నివేశాలు చాలా సీరియల్స్ లో ఉంటాయి. సైన్స్, ఫిజిక్స్, లాజిక్స్ ఇలాంటివి ఏమీ లేకుండా సన్నివేశాలు చిత్రీకరిస్తూ దశాబ్దాల పాటు సాగదీస్తుంటారు మేకర్స్. ఈ సీరియల్స్ ఒక్కోసారి సరదాగా అనిపించినా కొన్ని సన్నివేశాలు మాత్రం రెండు చేతులు జేబులో పెట్టుకొని వెళ్లిపోయేలా చేస్తాయి. ఏదేమైనా మన సీరియల్స్ మేకర్స్ గ్రేట్ అనే చెప్పాలి. 

Also Read: దివ్య చేతికి డబ్బులిచ్చి దెబ్బకొడుతున్న లాస్య- విక్రమ్ దృష్టిలో దోషులుగా తులసి, నందు

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Embed widget