X

CM Jagan & Chiranjeevi: ఏపీ సీయం జ‌గ‌న్‌తో చిరంజీవి భేటీ... టికెట్ రేట్స్ గురించి చ‌ర్చిస్తారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు భేటీ కానున్నారు. వీరి మధ్య టికెట్ రేట్స్ అంశం చర్చకు వస్తుందా?

FOLLOW US: 

మెగాస్టార్ చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. నేడు (గురువారం) మధ్యాహ్నం వీరిద్దరూ భేటీ కానున్నారు. కలిసి భోజనం చేయనున్నారు. ఏపీలో టికెట్ రేట్స్, థియేటర్స్ సీజ్ తదితర అంశాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏపీ సీయంతో మెగాస్టార్ భేటీ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది.

జగన్, చిరంజీవి సమావేశంలో ప్రధానంగా టికెట్ రేట్స్ అంశం చర్చకు రావచ్చని ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు నిర్మాతలు బలిసి కొట్టుకుంటున్నారని వ్యాఖ్యానించడం... అందుకు నిర్మాత ఎన్వీ ప్రసాద్ కౌంటర్ ఇవ్వడం, ఆ తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడటం తెలిసిన విషయాలే. టికెట్ రేట్స్ తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద వివాదానికి దారి తీసిందని చెప్పాలి. రోజు రోజుకూ సమస్య పరిష్కారం దిశగా వెళుతుండటం సంగతి అటు ఉంచితే... కొందరు చేసే విమర్శలు, ప్రతి విమర్శలతో వాతావరణం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో అన్ని వివాదాలకు ముగింపు పలికేలా సామరస్య పరిష్కారం కోసం వీరిద్దరూ చిరంజీవి ప్రయత్నిస్తున్నారని సమాచారం.
Also Read: జాతకాలు తేల్చుకుందాం.. దమ్ముంటే ఓపెన్‌ డిబేట్‌కు రండి.. వైఎస్అర్‌సీపీ ఎమ్మెల్యేలకు తమ్మారెడ్డి సవాల్ !
తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఒకవైపు తెలంగాణాలో టికెట్ రేట్స్ పెంచుకోవడానికి కెసిఆర్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. హైదరాబాద్ సిటీలోని కొన్ని మ‌ల్టీప్లెక్స్‌లో మూడు వందల రూపాయల టికెట్ రేట్ కూడా ఉంది. మరోవైపు ఏపీలో మ‌ల్టీప్లెక్స్‌లో నగర ప్రాంతాల్లో ఓ విధంగా, గ్రామీణ ప్రాంతాల్లో మరో విధంగా టికెట్ రేట్స్ ఉన్నాయి. అంత తక్కువ టికెట్ రేట్స్ వల్ల పరిశ్రమకు ఇబ్బంది అనేది టాలీవుడ్ నిర్మాతలు, హీరోలు, డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్న మాట. 

Also Read: ఏపీలో టికెట్ రేట్స్ పెరిగితే మాకు బోనస్! టికెట్ రేట్స్ తగ్గించిన తర్వాతే... - నాగచైతన్య ఇంటర్వ్యూ
Also Read: బలిసికొట్టుకుంటోంది మీరే.. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేపై మండిపడిన నిర్మాత !
Also Read: త్రివిక్ర‌మ్ గారూ... ఆ సీన్ యూట్యూబ్‌లో రిలీజ్ చేయండి!
Also Read: అక్కడ వినిపించుకునే నాథుడు ఉండాలి కదా..? టికెట్ రేట్ ఇష్యూపై బాలయ్య వ్యాఖ్యలు..
Also Read: థియేటర్ల కోసం సినిమాలు దాచాల్సిన అవసరం నాకు లేదు! వాళ్లు హ్యాపీగా ఉండాలనే... - నాని ఇంటర్వ్యూ
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: YS Jagan chiranjeevi ap govt YS Jagan Mohan Reddy Ticket Rates in AP Movie Ticket Rates Issue

సంబంధిత కథనాలు

10th Class Diaries: సిలకా... సిలకా... రామా సిలకా... ఏదో ఉందే మెలికా!

10th Class Diaries: సిలకా... సిలకా... రామా సిలకా... ఏదో ఉందే మెలికా!

Samantha: నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే వారిద్దరే కారణం.. సమంత పోస్ట్..

Samantha: నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే వారిద్దరే కారణం.. సమంత పోస్ట్..

Supritha: సురేఖావాణి కూతురు ఓల్డ్ ఐడియా.. వర్కవుట్ అవ్వలేదే.. 

Supritha: సురేఖావాణి కూతురు ఓల్డ్ ఐడియా.. వర్కవుట్ అవ్వలేదే.. 

Maruthi About Prabhas Movie: ప్ర‌భాస్‌తో సినిమా... కాదని చెప్పలేదు! అలాగని, కన్ఫర్మ్ చేయలేదు!

Maruthi  About Prabhas Movie: ప్ర‌భాస్‌తో సినిమా... కాదని చెప్పలేదు! అలాగని, కన్ఫర్మ్ చేయలేదు!

Akhanda on OTT: ఓటీటీలో 'అఖండ' రికార్డ్.. 24 గంటలు గడవకముందే..

Akhanda on OTT: ఓటీటీలో 'అఖండ' రికార్డ్.. 24 గంటలు గడవకముందే..
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Snakes Near Dead Body: ఇంట్లో శవం.. ఆ గది నిండా 124 పాములు.. ఏం జరిగింది?

Snakes Near Dead Body: ఇంట్లో శవం.. ఆ గది నిండా 124 పాములు.. ఏం జరిగింది?

Union Budget 2022: ఒక్కో మంత్రిది ఒక్కో స్టైల్‌! ఆర్థిక మంత్రుల బ్రీఫ్‌కేస్‌ స్టైల్‌ చూడండి!

Union Budget 2022: ఒక్కో మంత్రిది ఒక్కో స్టైల్‌! ఆర్థిక మంత్రుల బ్రీఫ్‌కేస్‌ స్టైల్‌ చూడండి!

Telangana Corona Update: తెలంగాణలో కొత్తగా 4,393 కరోనా కేసులు నమోదు.. ఇద్దరు మృతి

Telangana Corona Update: తెలంగాణలో కొత్తగా 4,393 కరోనా కేసులు నమోదు.. ఇద్దరు మృతి

KL Rahul Record: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు రేటు.. జాక్‌పాట్ కొట్టిన కేఎల్ రాహుల్.. ఒప్పందం విలువ ఎంతంటే?

KL Rahul Record: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు రేటు.. జాక్‌పాట్ కొట్టిన కేఎల్ రాహుల్.. ఒప్పందం విలువ ఎంతంటే?