Maa AP Govt : "మా" ఎన్నికల్లో ఎవరికీ మద్దతివ్వడం లేదు.. ఏపీ మంత్రి పేర్ని నాని కీలక ప్రకటన !
"మా"ఎన్నికల్లో ఏ వర్గానికీ మద్దతివ్వడం లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. ఓ ప్యానల్‌కు ఏపీ సీఎం జగన్ మద్దతు ఉందని జరుగుతున్న ప్రచారం నేపధ్యంలో పేర్ని నాని ఈ ప్రకటన చేశారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. "మా" ఎన్నికల విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి కానీ ప్రభుత్వానికి కానీఎలాంటి ప్రత్యేకమైన ఆసక్తి, ఉత్సాహం లేవని ఆయన తెలిపారు. ఏ వర్గాన్ని కానీ వ్యక్తిని కాని తాము సమర్థించడం లేదని స్పష్టం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలోని వారందరికీ ఈ విషయాన్ని తెలియచేస్తున్నామని పేర్ని నాని స్పష్టం చేశారు.
Manchu Vishnu: కృష్ణం రాజుతో విష్ణు భేటీ.. మంచు ట్వీట్‌పై ప్రభాస్ అభిమానులు ఆగ్రహం
ప్రత్యేకంగా ఏపీ ప్రభుత్వం "మా" ఎన్నికల విషయంలో ఎన్నికల విషయంలో ఎలాంటి సంబంధం లేదన్న ప్రకటన చేయడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు ప్యానెళ్ల మధ్య హోరాహోరీగా సాగుతున్న ఎన్నికలలో తరచూ ముఖ్యమంత్రి జగన్, కేటీఆర్, కేసీఆర్ ప్రస్తావన వస్తోంది. మంచు విష్ణు తాను మీడియాతో మాట్లాడిన ప్రతీ సారి తనకు సీఎం జగన్‌కు ఉన్న బంధుత్వం గురించి చెబుతూ ఉంటారు. అయితే ఆయన కూడా తనకు ఎక్కడా జగన్ మద్దతిస్తున్నట్లుగా చెప్పలేదు. మా ఎన్నికలలో రాజకీయ జోక్యం వద్దనే ఆయన కూడా చెబతూంటారు. కానీ ప్రతీ సారి ముఖ్య నేతల ప్రస్తావన తెస్తూండటంతో ప్రకాష్ రాజ్ కూడా కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ బంధువు అయితే మా ఎన్నికలలో పాల్గొనేందుకు వస్తారా అని ప్రకాష్ రాజ్ సోమవారం ఉదయమే మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
MAA Elections: టాలీవుడ్‌లో ప్రాంతీయవాదం రెచ్చగొడతారా?.. హీరో శ్రీకాంత్ ఆగ్రహం
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంతో వివాదం నడుస్తోంది. పవన్ కల్యాణ్ సినీ పరిశ్రమ విషయంలో ఏపీ ప్రభుత్వంపై విమర్సలు చేసిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అదే సమయంలో మంచు విష్ణు ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలను తాను సమర్థించడం లేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత నిర్మాతలు, ప్రభుత్వం మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మెగా క్యాంప్ మద్దతు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న ప్రకాష్‌రాజ్‌కు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వ పెద్దలు ఉన్నారన్న ప్రచారాన్ని సోషల్ మీడియాలో కొన్ని గ్రూపులు ప్రారంభించాయి. మంచు విష్ణుకు సీఎం జగన్ మద్దతిస్తున్నారన్న రూమర్స్‌ను కూడా ప్రారంభించారు.
Also Read: సినీ పెద్దల ఆశీర్వాదం నాకొద్దు.. నరేష్ నీ చక్రం దొబ్బేశాం.. సిగ్గుపడేలా మాట్లాడకు: ప్రకాష్ రాజ్
ఈ అంశాలన్నీ ప్రభుత్వం దృష్టికి రావడంతోనే తమకేమీ సంబంధం లేదని ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని ప్రకటించారని అంటున్నారు. నిజానికి మా ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ పార్టీల జోక్యాన్ని కానీ.. ప్రభుత్వాల జోక్యాన్ని కానీ ఆర్టిస్టులు కూడా కోరుకోవడం లేదు. కొంత మంది అత్యుత్సాహంతో చేసే ప్రకటనల వల్ల ఇలాంటి పరిస్థితి వస్తోంది. అందుకే ఓ ప్రభుత్వమే స్పందించి.. తమకేమీ సంబంధం లేదన్న ప్రకటన చేయాల్సి వచ్చిందంటున్నారు.
Also Read: సినీ పెద్దల ఆశీర్వాదం నాకొద్దు.. నరేష్ నీ చక్రం దొబ్బేశాం.. సిగ్గుపడేలా మాట్లాడకు: ప్రకాష్ రాజ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి