Bigg Boss 5 Promo: బిగ్ బాస్ 5 ప్రోమో: నాకు పెళ్లయ్యిందా.. విడిపోయానా.. నాకే తెలీదు.. ప్రియా షాకింగ్ వ్యాఖ్యలు, ఫస్ట్ లవ్ ఎవరంటే..

బిగ్ బాస్ 5 సీజన్ తాజా ప్రోమో విడుదలైంది. దాని ప్రకారం ఈ ఎసిపోడ్ మొత్తం ఎమోషనల్ గా సాగేట్టు కనిపిస్తోంది

FOLLOW US: 

పాత సీజన్లతో పోలిస్తే బిగ్ బాస్ 5 సీజన్ మొదటి ఎసిపోడ్ నుంచే సందడి మొదలైంది. మొదటి వారమే గొడవలు, అరుపులు ప్రారంభమైపోయాయి. తాజాగా నేటి ఎపిసోడ్ కు సంబంధించి రెండో ప్రోమో విడుదలైంది. అందులో హౌస్ మేట్లు తమ తొలి ప్రేమను గుర్తు తెచ్చుకుని, వారి గురుతుగా ఒక ఎర్రటి బెలూన్ పైకొదలాలి. ఆ బెలూన్ పై వారి పేర్లు కూడా రాయాలి. ప్రోమోను బట్టి చూస్తే తొలి ప్రేమ అందరిచేత కన్నీళ్లు పెట్టించింది. 

జీవితమనే ప్రయాణంలో ఎందరిని కలిసినా తొలి ప్రేమ ఇచ్చే మధుర అనుభవాలు, నేర్పే గుణపాఠాలు మళ్లీ మళ్లీ దక్కవు అంటూ ప్రోమోను ప్రారంభించి అందరినీ తొలిప్రేమ జ్ఞాపకాల్లో తడిసి ముద్దయ్యేలా చేశాడు బిగ్ బాస్. శ్రీరామ చంద్ర తన తొలిప్రేమ గురించి చెబుతూ ఆ అమ్మాయికి పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారని కాసేపు నవ్వించాడు. సన్నీ కూడా తన పదోతరగతి ప్రేమను గుర్తు చేసుకున్నాడు. షన్ను తన ఫస్ట్ దీపూనేనని, ఆ విషయం ఆమెకు కూడా తెలిసని అన్నాడు. షన్ను ప్రేయసి దీప్తి సునయన గతంలో బిగ్ బాస్ లో పాల్గొంది. జెస్సీ బెలూన్ పై ఒక అమ్మాయి పేరు రాసి ‘నువ్వు సింగిల్ అయితే, నేను రెడీ టు మింగిల్’ అని సిగ్నల్ ఇచ్చాడు. 

ప్రోమో హైలైట్ ఇదే..: అన్నింటి కన్నా ప్రియా చెప్పిన మాటలే ప్రోమోకి హైలైట్ గా నిలిచాయి. నిజానికి ప్రియకు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందులో పాప గతేడాదే మరణించింది. టీనేజీ వయసున్న కొడుకు ఉన్నాడు. కాగా ప్రోమోలో మాత్రం ప్రియ ‘నేను మ్యారీడా, సెపరేటెడా, డివోర్స్ డా నాకే  తెలియదు’ అని కామెంట్ చేసింది. దీంతో ఆమె వైవాహిక జీవితం ఒడిదొడుకుల్లో ఉన్నట్టు అర్థమవుతోంది. ఆమె బెలూన్ పై ‘కేక్’అని ఇంగ్లిషులో రాసింది. అతనే తన ఫస్ట్ లవ్ అని చెప్పింది. బిగ్ బాస్ 5 సీజన్ ఆరంభ ఎపిసోడ్ లో కూడా నాగార్జునతో ప్రియ తను ఒంటరిగా బతకాల్సి వస్తే ఉండగలనా లేదా టెస్ట్ చేసుకునేందుకు బిగ్ బాస్ కు వచ్చానని చెప్పింది. దానికి నాగార్జున అలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటున్నట్టు అన్నారు.  ఇప్పుడు తాజా ప్రోమోలో ప్రియ మాటలు వింటే ఆమె కాపురంలో కలహాలు ఉన్నట్టు అర్థమవుతోంది. 

బండి వెనుక పరిగెత్తా..: ట్రాన్స్ విమెన్ ప్రియాంక కూడా తన మొదటి లవ్ తలచుకుని కన్నీటి పర్యంతమైంది. ‘తన బండి వెళ్లిపోతుంటే... ఆ బండి వెనుక పరిగెత్తాను అయినా తను వినలేదు, తన పని తనే చూసుకున్నాడు’ అంటూ ఏడ్చింది. హమీద కూడా ప్రేమలో ఉన్నట్టు ఒప్పుకుంది. తమ మధ్య బ్రేకప్ అవ్వలేదని, కానీ కలిసి ఉండలేకపోతున్నామంటూ ఎమోషనల్ అయింది. మొత్తమ్మీద ఈ ప్రోమో చూస్తుంటే ఎపిసోడ్ ఎమోషనల్ గా ఉండడం ఖాయమనిపిస్తోంది.  

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Also read: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే విటమిన్ డి లోపం కావచ్చు

Also read: గుడ్డులోని పచ్చసొన తింటే బరువు పెరుగుతారని తినకుండా పడేస్తున్నారా? ఆరోగ్యనిపుణులు ఏమంటున్నారు?

Also read: నెలసరి నొప్పి భరించలేకపోతున్నారా... ఆయుర్వేదం ఏం చెబుతోంది?

Published at : 23 Sep 2021 04:56 PM (IST) Tags: Biggboss season 5 Telugu Bigg Boss Biggboss 5 Promo Biggboss Telugu

సంబంధిత కథనాలు

Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే

Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే

Mission Impossible 7 Trailer - ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!

Mission Impossible 7 Trailer - ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!

Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!

Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!

Naga Chaitanya: చైతు కోసం 'నాగేశ్వరరావు' టైటిల్?

Naga Chaitanya: చైతు కోసం 'నాగేశ్వరరావు' టైటిల్?

Chiru Vs Vikram: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ - ఎవరైనా తగ్గుతారా?

Chiru Vs Vikram: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ - ఎవరైనా తగ్గుతారా?

టాప్ స్టోరీస్

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ?  ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న  చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్

KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్