Telisinavaallu Teaser: ‘తెలిసినవాళ్లు’ టీజర్ - కొద్ది రోజుల్లో ఫ్యామిలీతో కలిసి చచ్చిపోతున్నా, షాకింగ్ ట్విస్టులతో హెబ్బా మూవీ!
రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ కలిసి నటించిన తాజా మూవీ ‘తెలిసినవాళ్లు’. కల్ట్ సూసైడ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ విడుదల అయ్యింది. ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్ గా ఎంతో ఆకట్టుకుంటుంది.
హీరో రామ్ కార్తీక్, హీరోయిన్ హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం ‘తెలిసినవాళ్లు’. భిన్నమైన కథతో విప్లవ్ కోనేటి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నఈ చిత్రం.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సిరంజ్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల అయ్యింది. హెబ్బా పటేల్ తో ఓపెన్ అయిన టీజర్ తన మాటలు పవర్ ఫుల్ గా కనిపిస్తాయి. “కాసేపు కలిసి గడిపితే చాలు అనుకునే వారు కాస్ట్ చూస్తారు.. కలిసి ఉండాలి అనుకునేవారు క్వాలిటీ చూస్తారు. ఫస్ట్ ప్రేమ వస్తే.. ఆ తర్వాత మనీ అదే వస్తుంది” అని హీరోయిన్ చెప్పే మాటలు ఎంతో ఆలోచింపజేస్తాయి.
హీరోయిన్ మాటలకు ప్రేమలో పడిన హీరో.. తనకు ఐలవ్ యూ చెప్తాడు. తనూ ఓకే చెప్తుంది. కానీ, అక్కడే అసలు కథ మొదలవుతుంది. “నేనూ నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ, ఇప్పట్లో పెళ్లి చేసుకోలేం. ఎందుకంటే, కొద్ది రోజుల్లో నేను చచ్చిపోబోతున్నాను. సూసైడ్ చేసుకోబోతున్నాను. ఫ్యామిలీ మొత్తం చనిపోబోతున్నాం. చనిపోయిన వ్యక్తి కోసం మళ్లీ తను తిరిగి రావాలని బలంగా కోరుకుంటూ ప్రాణ త్యాగం చేస్తే మళ్లీ ఆయన తిరిగి వచ్చే అవకాశం ఉందట. అందుకే ఇలా చేస్తున్నాం” అని చెప్పడంతో హీరో షాక్ అవుతాడు. మొదట్లో మూఢ నమ్మకం అని కొట్టి పారేసినా.. ఆమెపై ప్రేమతో తనూ సూసైడ్ చేసుకోవాలని భావిస్తాడు. కానీ, చివరకు ఏమవుతుంది? అనే విషయాన్ని సస్పెన్స్ గా చూపించారు.
“కొంత మంది కలిసి బలవనర్మణానికి పాల్పడితే.. దాన్ని మాస్ సూసైడ్.. కొందరు కలిసి చావడానికి ఫిలాసఫీ ఉంటే దాన్ని కల్ట్ సూసైడ్ అంటారు” అని డాక్టర్ చెప్పిన విషయం తెలుసుకుని హీరో ఏం చేయబోతాడనేదే ఈ సినిమా కథాంశం. టీజర్ చూస్తుంటే ఏదో తెలియని జలదరింపు కలుగుతుంది. ఇంతకీ హీరోయిన్ కుటుంబం ఆత్మహత్యను ఎవరైనా అడ్డుకున్నారా? లేదా? అన్న అనుమానాలకు సమాధానం దొరకాలంటే సినిమా రిలీజయ్యేదాకా ఆగాల్సిందేనంటున్నారు మేకర్స్.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇటీవల విడుదల చేసిన ఓ పోస్టర్ లో హెబ్బా పటేల్‌కు తల లేదు. ఓ పాత తరం కుర్చీలో చుడీదార్ డ్రెస్‌లో కూర్చుంది. ఆ బాడీకి తల లేకుండా కొత్తగా పోస్టర్ డిజైన్ చేశారు చిత్రయూనిట్. అక్కడ లేని తల గోడకు ఫోటో ఫ్రేమ్ లో వేలాడుతుంది. ఈ ఫోటోతో పాటు తాజాగా విడుదలైన టీజర్ మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. సినిమాపై ఇంకా ఎక్స్ ఫెక్టేషన్స్ పెంచేశాయి.
View this post on Instagram
ఇక కుమారి 21 ఎఫ్ సినిమాతో తెలుగు సినిమాలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ హెబ్బా పటేల్.. ఆ తర్వాత చాలా వరకు రొమాంటిక్ సినిమాలే చేసింది. కొన్ని ఐటం సాంగ్స్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టాలీవుడ్ లోకి వచ్చి చాలా ఎళ్లు గడుస్తున్నా పెద్ద బ్రేక్ రాలేదనే చెప్పుకోవచ్చు. అయినా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. మంచి హిట్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. తాజాగా ఓ డిఫరెంట్ కథతో ‘తెలిసినవాళ్లు’ అనే సినిమా చేస్తుంది ఈ మధ్యే 'ఓదెల రైల్వే స్టేషన్' అనే సినిమాలోనూ నటించింది హెబ్బా. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.
Also read: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!
Also read: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి