Hanuman Review: ఒక్కటే మాట, ఫెంటాస్టిక్ - తరుణ్ ఆదర్శ్ 'హనుమాన్' రివ్యూ
Hanuman Movie Twitter Review: 'హనుమాన్' సినిమా ఫెంటాస్టిక్ అని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్, క్రిటిక్ తరణ్ ఆదర్శ్ చెప్పారు. ఆయన 'హనుమాన్' హిందీ వెర్షన్ చూశారు.
Hanuman Movie Review By Taran Adarsh: 'హనుమాన్' సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి వస్తుంది. గురువారం రాత్రి నుంచి పెయిడ్ ప్రీమియర్ షోలు తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లతో పాటు బెంగళూరులోని కొన్ని స్క్రీన్లు, అమెరికాలో కూడా ప్రదర్శిస్తున్నారు. అయితే... అందరి కంటే ముందుగా ముంబైలో స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్, క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సినిమా చూశారు. 'హనుమాన్' గురించి ఒక్క మాటలో ఫెంటాస్టిక్ అని చెప్పారు. ఇంకా సినిమా గురించి ఆయన ఏమన్నారంటే?
సాలిడ్ ఎంటర్టైనర్ 'హనుమాన్'
'హనుమాన్'కు తరణ్ ఆదర్శ్ 3.5/5 రేటింగ్ ఇచ్చారు. ''దర్శకుడు ప్రశాంత్ వర్మ సాలిడ్ ఎంటర్టైనర్ తీశారు. డ్రామా, ఎమోషన్స్, వీఎఫ్ఎక్స్, మైథాలజీని ఆయన సమపాళ్లలో మేళవించారు. సినిమా చాలా బావుంది. ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఎండింగ్ ఇంకా బావుంది'' అని తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. అంతే కాదు... సినిమా చూడాలని రికమండ్ కూడా చేశారు.
Also Read: మహేష్ బాబు థియేటర్‌లో 'హనుమాన్' ప్రీమియర్స్ క్యాన్సిల్ - కారణం అదేనా?
తేజ సజ్జ నటన గురించి ఏమన్నారంటే?
నటీనటుల గురించి కూడా తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ''తేజ సజ్జ తన పాత్రలో బాగా నటించారు. అతని నటన ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ మరోసారి తన మార్క్ చూపించారు. విలన్ పాత్రలో వినయ్ రాయ్ బాగా చేశారు. సముద్రఖని సూపర్ ఫామ్ లో ఉన్నారు. వెన్నెల కిశోర్ ఇంకాసేపు ఉంటే బావుంటుందని అనిపిస్తుంది'' అని తరణ్ ఆదర్శ్ చెప్పారు. కథలో వీఎఫ్ఎక్స్ కీలక పాత్ర పోషించిందని, కథకు మరింత బలాన్ని ఇచ్చిందని ఆయన వివరించారు. హిందీ వెర్షన్ చూసిన తరణ్ ఆదర్శ్... డబ్బింగ్ కూడా బావుందన్నారు. ఫస్టాఫ్ రన్ టైం కాస్త తగ్గిస్తే బావుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read: తేజ సజ్జ చిన్నోడు కాదు, చిచ్చరపిడుగు - హనుమాన్ పెయిడ్ ప్రీమియర్స్‌కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్
#OneWordReview...#HanuMan: FASCINATING.
— taran adarsh (@taran_adarsh) January 11, 2024
Rating: ⭐️⭐️⭐️½
Director #PrasanthVarma crafts a solid entertainer… #HanuMan is ambitious and exciting - packs drama, emotions, VFX and mythology skilfully… Loaded with goosebump moments + extraordinary finale… Recommended!… pic.twitter.com/7M2RKk2zkd
తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన 'హనుమాన్' జనవరి 12న థియేటర్లలోకి వస్తోంది. ఇవాళ రాత్రి నుంచి పలు థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తున్నారు.
'హనుమాన్'లో విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ హీరో సిస్టర్ రోల్ చేశారు. తేజా సజ్జా సరసన అమృతా అయ్యర్ కథానాయికగా నటించారు. వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ సహా పలు భారతీయ, అంతర్జాతీయ భాషల్లో సినిమా విడుదల కానుంది.