News
News
X

Whats On OTT This Week : తెలుగు 'హైవే', 'తమిళ్ రాకర్స్', హాలీవుడ్ 'షి హల్క్' - ఈ వారం ఓటీటీలో సందడి వీటిదే

Watch To Watch On OTT This Weekend : ఓటీటీ వేదికల్లో ఈ వారం విడుదల కానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏమిటి? ఏం ఉన్నాయి? ఒకసారి చూడండి.

FOLLOW US: 

థియేటర్లలో ఈ వారం ఏడు సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో రెండు మూడు మినహా మిగతా వాటిలో పెద్దగా చెప్పుకోదగ్గవి ఏమీ లేవు. మరి, ఓటీటీలో అయినా బజ్ ఉన్న సినిమాలు ఏమైనా ఉన్నాయా? అంటే... ఒకట్రెండు మినహా అక్కడా పెద్దగా క్రేజ్ సినిమాలు గానీ, వెబ్ సిరీస్‌లు గానీ ఏమీ లేవు. తెలుగులో వస్తున్న 'హైవే', తమిళ వెబ్ సిరీస్ 'తమిళ్ రాకర్స్' స్ట్రెయిట్ ఒరిజినల్ ప్రాజెక్ట్స్. మిగతావన్నీ ఇతర భాషలకు సంబంధించినవే. హాలీవుడ్ నుంచి మంచి స్టఫ్ ఉంది. మొత్తం మీద ఈ వారం ఏయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తున్నాయో ఓ లుక్కేయండి.

ఆనంద్ దేవరకొండ 'హైవే'
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా  నటించిన లేటెస్ట్ సినిమా 'హైవే' (Highway Telugu Movie). సినిమాటోగ్రాఫర్ కె.వి. గుహన్ దర్శకత్వం వహించారు. ఆహా ఓటీటీలో ఈ శుక్రవారం విడుదల అవుతోందీ సినిమా. నగరంలో వరుస హత్యలకు పాల్పడుతున్న ఒక సైకో కిల్లర్ నుంచి తన ప్రేయసిని హీరో ఎలా కాపాడుకున్నాడనేది సినిమా స్టోరీ. పోలీస్ ఆఫీసర్ పాత్రలో సయామీ ఖేర్ (Saiyami Kher) నటించారు. సైకో కిల్లర్ పాత్రలో అభిషేక్ బెనర్జీ నటించారు.

పైరసీకి అడ్డా... తమిళ్ రాకర్స్
'తమిళ్ రాకర్స్'...  ఈ వెబ్ సైట్ పేరు తెలియని సినిమా అభిమాని ఉండరని చెబితే అతిశయోక్తి కాదేమో! చిత్ర పరిశ్రమ ప్రముఖులకు కంటి మీద కునుకు లేకుండా చేసిందీ సైట్. థియేటర్లలో విడుదలైన కొన్ని గంటల్లో ఆన్‌లైన్‌లో పైరసీ ప్రింట్ పోస్ట్ చేసి... థియేటర్లలో విడుదల కాక ముందే కొన్ని సినిమాలను విడుదల చేసి... పరిశ్రమకు వందల కోట్ల నష్టం కలిగించింది. ఇప్పుడీ సైట్ నేపథ్యంలో రూపొందిన వెబ్ సిరీస్ 'తమిళ్ రాకర్స్' (Tamilrockerz Web Series). ఇందులో అరుణ్ విజయ్ (Arun Vijay) ప్రధాన పాత్ర పోషించారు. వాణీ భోజన్, ఐశ్వర్యా మీనన్, అళగమ్ పెరుమాళ్ తదితరులూ నటించారు. సోనీ లివ్ ఓటీటీలో ఆగస్టు 19 (శుక్రవారం) విడుదల అవుతోంది. దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

అరుణ్ విజయ్ నటించిన 'ఏనుగు' (తమిళంలో 'యానై') సినిమా కూడా ఆగస్టు 19న 'జీ 5' ఓటీటీలో తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవుతోంది. దీనికి 'సింగం' సిరీస్ ఫేమ్ హరి దర్శకత్వం వహించారు. థియేటర్లలో 'పక్కా కమర్షియల్ ఫామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా' ఈ సినిమా పేరు తెచ్చుకుంది.

లేడీ హల్క్ గురూ!
మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చే సినిమాలకు ఇండియాలోనూ ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. వారిలో 'హల్క్'ను అభిమానించే వాళ్ళూ ఉన్నారు. ఇన్నాళ్ళూ మేల్ 'హల్క్'ను చూశారు. ఇప్పుడు లేడీ హ‌ల్క్‌ను చూడటానికి రెడీగా ఉన్నారా? డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో గురువారం 'షి - హల్క్ : అటార్నీ ఎట్ లా' వెబ్ సిరీస్ విడుదల అవుతోంది. యాక్షన్ అండ్ అడ్వెంచర్, కామెడీ జానర్‌లో ఇది రూపొందింది. ఇంగ్లీష్‌లో మాత్రమే కాదు... తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది. సో... తెలుగు వాళ్ళు తెలుగు డబ్బింగ్ చూడొచ్చు.

Also Read : థియేటర్లలో చిన్న సినిమాల జాతర - ఈ వారం ఏడు సినిమాలు, అవేంటో తెలుసా?
  
ఓటీటీల్లో ఇంకేం ఉన్నాయి?

  • మనోరమ మ్యాక్స్ ఓటీటీలో గురువారం (ఆగస్టు 18న)  'మక్కల్' అనే మలయాళ సినిమా విడుదల అవుతోంది.
  • సైన్స్ ఫిక్షన్ అండ్ ఫాంటసీ జానర్‌లో రూపొందిన 'రైజ్డ్ బై వోల్వ్స్' వెబ్ సిరీస్ సీజన్ 2 విడుదల కూడా గురువారమే.
  • కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్‌ నటించిన 'బైరాగి' సినిమా వూట్ ఓటీటీలో ఆగస్టు 19... అనగా శుక్రవారం విడుదల అవుతోంది.
  • 'జీ 5' ఓటీటీలో శుక్రవారం 'దురంగా' హిందీ వెబ్ సిరీస్ విడుదల అవుతోంది.
  • నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో శుక్రవారం 'ది నెక్స్ట్ 365 డేస్' అనే ఫారిన్ ఫిల్మ్ విడుదలకు సిద్ధమైంది.
  • మలయాళ సినిమా 'హెవెన్' డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో శుక్రవారం (ఆగస్టు 19న) నుంచి స్ట్రీమింగ్ కానుంది.
  • నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో హిందీ సినిమా 'శేర్‌దిల్‌ : ది పిబిలిత్ సాగ' శనివారం విడుదల అవుతోంది. ఇందులో పంకజ్ కపూర్, సయానీ గుప్తా, నీరజ్ కబీ తదితరులు నటించారు.

Also Read : దేశభక్తి ఎప్పుడూ హిట్టే - నెత్తురు మరిగితే ఎత్తరా జెండా, కొట్టరా బాక్సాఫీస్ కొండ

Published at : 17 Aug 2022 03:58 PM (IST) Tags: Highway Telugu Movie Tamilrockers Web Series She Hulk Attorney At Law Web Series Enugu Movie Web Series To Watch On This Weekend OTT Movies This Week

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu September 26th: జెస్సి, అఖిల్ ని జ్ఞానంబకి దగ్గర చేసేందుకు జానకి ప్రయత్నాలు- చెడగొట్టేందుకు మల్లిక కుట్రలు

Janaki Kalaganaledu September 26th: జెస్సి, అఖిల్ ని జ్ఞానంబకి దగ్గర చేసేందుకు జానకి ప్రయత్నాలు- చెడగొట్టేందుకు మల్లిక కుట్రలు

Jacqueline Fernandez Bail: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బెయిల్!

Jacqueline Fernandez Bail: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బెయిల్!

Gruhalakshmi September 26th: సామ్రాట్ విషయంలో తగ్గేదెలే అన్న తులసి- 'నాన్న కానీ ఈ నాన్న'ని క్షమించమని హనీని అడిగిన సామ్రాట్

Gruhalakshmi September 26th: సామ్రాట్ విషయంలో తగ్గేదెలే అన్న తులసి- 'నాన్న కానీ ఈ నాన్న'ని క్షమించమని హనీని అడిగిన సామ్రాట్

Guppedanta Manasu September 26th Update: వసు కోసం మల్లెపూలు కొన్న రిషి - నాకోసం వచ్చేస్తావా వసుధార అని అడిగేసిన మిస్టర్ ఇగో

Guppedanta Manasu September 26th Update: వసు కోసం మల్లెపూలు కొన్న రిషి - నాకోసం వచ్చేస్తావా వసుధార అని అడిగేసిన మిస్టర్ ఇగో

Karthika Deepam September 26th: వంటలక్క ప్లాన్ సక్సెస్- దీపని వెళ్లొద్దని అరిచిన కార్తీక్, మోనిత కారు డిక్కిలో శౌర్య

Karthika Deepam September 26th: వంటలక్క ప్లాన్ సక్సెస్- దీపని వెళ్లొద్దని అరిచిన కార్తీక్, మోనిత కారు డిక్కిలో శౌర్య

టాప్ స్టోరీస్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Rajasthan Congress Crisis: రాజస్థాన్‌లో రాత్రికి రాత్రే హైడ్రామా- 90 మంది ఎమ్మెల్యేల రాజీనామా!

Rajasthan Congress Crisis: రాజస్థాన్‌లో రాత్రికి రాత్రే హైడ్రామా- 90 మంది ఎమ్మెల్యేల రాజీనామా!

Jupiter Closest To Earth: నేడు అంతరిక్షంలో అద్భుతం, 59 ఏళ్ల తర్వాత భూమికి అతి దగ్గరగా గురు గ్రహం

Jupiter Closest To Earth: నేడు అంతరిక్షంలో అద్భుతం, 59 ఏళ్ల తర్వాత భూమికి అతి దగ్గరగా గురు గ్రహం