Telugu Movies This Week : చిన్న సినిమాల జాతర - ఈ వారం ఏడు సినిమాలు, అవేంటో తెలుసా?
Upcoming Theatrical Releases In Telugu : థియేటర్ల దగ్గర ఈ వారం చిన్న సినిమాలు సందడి చేయనున్నారు. ఒక్క రోజు ఆరు సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. అందులో కొన్ని చిత్రాలు ఎవరికీ తెలియనివి.
![Telugu Movies This Week : చిన్న సినిమాల జాతర - ఈ వారం ఏడు సినిమాలు, అవేంటో తెలుసా? Sudigali Sudheer Anasuya's Wanted Pandugadu, Aadi Sai Kumar Payal Rajput's Tees Maar Khan to Tejaswi Anveshi Jain's Commitment And Dhanush Thiruchitrambalam telugu movies releasing on 18th august Telugu Movies This Week : చిన్న సినిమాల జాతర - ఈ వారం ఏడు సినిమాలు, అవేంటో తెలుసా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/15/f58f292682b91d1a616359915b31e39f1660559115422313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల దగ్గర భారీ పోటీ నెలకొంది. 'బింబిసార' (Bimbisara Movie), 'సీతా రామం' (Sita Ramam Movie), 'కార్తికేయ 2' (Karthikeya 2 Movie) సినిమాలకు థియేటర్లలో స్పందన బావుంది. వచ్చే వారం 'లైగర్' (Liger Movie) రానుంది. అందుకని, ఈ వారం థియేటర్లలోకి భారీ, మీడియం సినిమాలు ఏవీ రావడం లేదు. దాంతో చిన్న సినిమాలు క్యూ కట్టాయి.
ఈ వారం మొత్తం ఏడు సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో 18వ తేదీన వస్తున్న ధనుష్ 'తిరు'... 19వ వస్తున్న 'వాంటెడ్ పండు గాడ్', 'తీస్ మార్ ఖాన్', 'కమిట్‌మెంట్' తప్పిస్తే మిగతావన్నీ చిన్న చిత్రాలే!
'తిరు' - ధనుష్ హీరో...
రాశీ ఖన్నా, నిత్యా మీనన్ హీరోయిన్లు
తెలుగులో ఈ వారం వస్తున్న చిత్రాల్లో చెప్పుకోదగ్గది 'తిరు' (Thiru Telugu Movie). తమిళ సినిమా 'తిరుచిత్రాంబళం' (Thiruchitrambalam Movie)కు తెలుగు అనువాదమిది. గురువారం (ఆగస్టు 18న) విడుదలవుతోంది. ఇందులో ధనుష్ (Dhanush) హీరో. రాశీ ఖన్నా, నిత్యా మీనన్ హీరోయిన్లు. హీరో తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించారు. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు సినిమాలో ఉన్నాయి. అయితే... తెలుగులో ఆశించిన రీతిలో ప్రమోషన్స్ చేయడం లేదు. అనిరుధ్ సంగీతం అందించిన పాటలు, ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. 'తిరు' తప్పిస్తే... మిగతా సినిమాలన్నీ ఆగస్టు 19న విడుదల అవుతున్నాయి.
గ్లామర్ అండ్ కామెడీతో 'వాంటెడ్ పండు గాడ్'
థియేటర్లలో ఈ వారం విడుదల అవుతున్న స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లో 'వాంటెడ్ పండు గాడ్' ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అనసూయ (Anasuya Bharadwaj), సునీల్, 'సుడిగాలి' సుధీర్ (Sudigali Sudheer), 'వెన్నెల' కిశోర్, దీపికా పిల్లి, సప్తగిరి, బ్రహ్మానందం తదితరులు నటించడం ఒక కారణం అయితే... దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు సమర్పణలో వస్తుండటం మరో కారణం. ఈ చిత్రానికి శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించారు. గ్లామరస్ సాంగ్స్, కామెడీతో సినిమా ఆకట్టుకుంటోంది.
ఆది మాస్ అండ్ పాయల్ గ్లామర్‌తో 'తీస్ మార్ ఖాన్'
ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తున్న మరో తెలుగు సినిమా 'తీస్ మార్ ఖాన్' (Tees Maar Khan Movie). ఇందులో ఆది సాయి కుమార్ హీరో. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్. ఆల్రెడీ రిలీజ్ చేసిన 'సమయానికి తగు మాట్లాడవా' పాటలో పాయల్ గ్లామర్ కొంత మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ సినిమా 'తీస్ మార్ ఖాన్' అని ఆది చెబుతున్నారు.
బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ 'కమిట్‌మెంట్'
ఆగస్టు 19న వస్తున్న మరో తెలుగు సినిమా 'కమిట్‌మెంట్' (Commitment Telugu Movie). ఇందులో తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, రమ్య పసుపులేటి, అమిత్ తదితరులు నటించారు. మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, ఇతరత్రా అంశాలతో సినిమా రూపొందిందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. సమాజానికి సందేశం ఇస్తున్నా... ప్రచార చిత్రాల్లో శృంగారాత్మక సన్నివేశాలే హైలైట్ అవుతున్నాయి.
Also Read : ఫ్లాప్ ఇచ్చిన రోజు హిట్ కొట్టడానికి వస్తున్న ప్రభాస్ - ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్
'మాటరాని మౌనమిది', 'అం అః', 'లవ్ 2' అనే మరో మూడు సినిమాలు కూడా ఆగస్టు 19న విడుదల అవుతున్నాయి. చివరి రెండు సినిమాలు అయితే చాలా మంది ప్రేక్షకులకు తెలియవు కూడా! ఈ ఏడు సినిమాల్లో ఏది విజయం సాధిస్తుందో చూడాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)