Indian2 Update: విశ్వనటుడితో తమన్నా.. పాన్ ఇండియా ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసిన మిల్కీ..
ఏ ముహూర్తాన ఇండస్ట్రీలో అడుగుపెట్టిందో కానీ తమన్నా జోరు పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. కెరీర్ క్లోజ్ అన్న ప్రతిసారీ అంతకుమించిన వేగంతో దూసుకొస్తోంది. తాజాగా కమల్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది మిల్కీ.

విశ్వ నటుడు కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ఇండియన్ 2 ( భారతీయుడు 2). 1996లో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టందుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలై సంచలన విజయం అందుకుంది. కమల్-శంకర్ కెరీర్లో ది బెస్ట్ మూవీ అనిపించుకుంది. దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతోన్నది 'ఇండియన్ 2'. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే ఈ ప్రాజెక్టులోకి కొత్తగా వచ్చి చేరింది మిల్కీ బ్యూటీ తమన్నా. అందాల చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ కదా మిల్కీ బ్యూటీ మరో హీరోయినా అని అడగొద్దు. ఎందుకంటే చందమామని మిల్కీ రీప్లేస్ చేసింద.
Also Read: అషూ రెడ్డి ప్రెగ్నెంట్.. తల్లి చేతిలో చావుదెబ్బలు, వీడియో వైరల్
అసలేం జరిగిందంటే... ఈ సినిమా ప్రారంభమైనప్పటి నంచీ ఇందలో వర్క్ చేస్తున్న టీమ్ లో ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారు. కీలక పాత్రలో నటించిన నెడిముడి వేణు అనారోగ్యంతో చనిపోగా, ఆ తర్వాత వివేక్ హార్ట్ ఎటాక్ తో కన్ను మూశాడు. ఇక ఆ మధ్య ఫ్లోర్లో క్రేన్ల మధ్య షూటింగ్ చేస్తుండగా క్రేన్ కూలి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ కి చెందిన వారు మృతిచెందారు. దీంతో ఈ సినిమా షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. భారీ అంచనాల నడుమ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలనున్న మూవీ విషయంలో వరుస అవాంతరాలు మూవీటీమ్ ని మాత్రమే కాదు అభిమానుల్ని కలవరపెడుతున్నాయి. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది కాజల్. దీంతో మరో హీరోయిన్ కోసం వేట మొదలెట్టిన దర్శకుడు శంకర్ తమన్నాని ఫైనల్ చేసినట్టు టాక్. కాజల్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆ గోల్డెన్ ఛాన్స్ తమన్నాకు దక్కింది.
Also Read: కామెడీ అంటే వెకిలి చేయడమా..? సన్నీపై షణ్ముఖ్ సీరియస్..
ఇప్పటికే సినిమా పూర్తిచేయాలంటూ నిర్మాత కోర్టు వరకూ వెళ్లడంతో మళ్లీ పనిలో వేగం పెంచాడు శంకర్. వీలైనంత తొందరగా ఇండియన్ 2 పూర్తిచేసే ఆలోచనలో ఉన్నారు. . సినిమా పూర్తి చేయడం కోసం నిర్మాత కోర్టు దాకా వెళ్లడంతో మనసు మార్చుకున్న శంకర్ ఈ మూవీని పూర్తి చేసే పనిలో వేగం పెంచారు. ప్రస్తుతం శంకర.. రాంచరణ్ 15వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న భోళా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది తమన్నా. రీసెంట్ గా తమన్నా 'సీటీమార్', 'మ్యాస్ట్రో' చిత్రాలతో వచ్చి మెప్పించింది. శంకర్ ప్రాజెక్టు ఒకే అయితే పాన్ ఇండియా ప్రాజెక్టులో నటించే క్రేజీ ఆఫర్ తమన్నా ఖాతాలో పడినట్టే. దీనిపై ఇంకా అఫీషియల్ న్యూస్ రావాల్సి ఉంది.
Also Read: సెలబ్రిటీల పెళ్లిళ్లకు వీళ్లే బ్రాండ్ అంబాసిడర్లు..
Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?
Also Read: అల్లు అర్జున్ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?
Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబర్ మృతి...
Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

