Vicky-Katrina Wedding: సెలబ్రిటీల పెళ్లిళ్లకు వీళ్లే బ్రాండ్ అంబాసిడర్లు..
కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ల పెళ్లి చాలా గ్రాండ్ గా జరగబోతుంది. దీనికోసం స్పెషల్ గా 'షాదీ స్క్వాడ్' అనే వెడ్డింగ్ ప్లానర్ ను నియమించుకున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. రాజస్థాన్ లో గ్రాండ్ గా వీరి పెళ్లి జరగబోతుంది. అతి తక్కువ మంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి వేడుకను ప్లాన్ చేసుకున్నారు. ఈరోజు సంగీత్ ఈవెంట్ తో మొదలయ్యే హడావిడి నాలుగైదు రోజులు కంటిన్యూ అవ్వనుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. డిసెంబర్ 9న పెళ్లి ముహూర్తమని తెలుస్తోంది. మీడియాలో ఎక్కడ చూసినా.. వీరి పెళ్లికి సంబంధించిన వార్తలే.
రీసెంట్ గా.. వీరి పెళ్లి సంబంధించిన ఓ వెల్కమ్ నోట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అందులో గెస్ట్ లను మొబైల్ ఫోన్లను రూమ్ లోనే పెట్టి పెళ్లికి రావాలంటూ రిక్వెస్ట్ చేశారు. ఇక పెళ్లి కోసం వచ్చిన అతిథుల కోసం స్పెషల్ వంటకాలను సిద్ధం చేస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు, ముంబై, ఢిల్లీ, చండీగఢ్.. ఇలా చాలా ప్రాంతాల నుంచి కూరగాయలు, మసాలాలు, ఇతర దినుసులు, స్వీట్స్ లారీల కొద్దీ తెప్పించారట. దేశీ వంటకాలతో పాటు విదేశీ వంటకాలు కూడా ఉంటాయట.
చాలా గ్రాండ్ గా వీరి పెళ్లి వేడుక జరగబోతుంది. దీనికోసం స్పెషల్ గా 'షాదీ స్క్వాడ్' అనే వెడ్డింగ్ ప్లానర్ ను నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వేడుకలకు ఈ కంపెనీ చాలా ఫేమస్. అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ పెళ్లికి కూడా వీళ్లనే హయ్యర్ చేసుకున్నారు. అలానే ప్రియాంక చోప్రా-నిక్ జోనస్ ల ఎంగేజ్మెంట్ కి సంబంధించిన పనులన్నీ కూడా 'షాదీ స్క్వాడ్' దగ్గరుండి చూసుకుంది. సెలబ్రిటీల వెడ్డింగ్ అంటే ఈ వెడ్డింగ్ ప్లానర్ ఉండాల్సిందే. ఈ కంపెనీను పొగుడుతూ.. గతంలో అనుష్క శర్మ ఓ పోస్ట్ కూడా పెట్టింది.
View this post on Instagram
Also Read: ప్రతీ తెలుగువాడు చూడాల్సిన సినిమా.. బాలయ్య సినిమాకి కూతురు రివ్యూ..
Also Read: ఎయిర్ పోర్ట్ దాడి ఘటన.. విజయ్ ని విడిచిపెట్టేలా లేదు..
Also Read: మరీ అంతలా తిట్టాలా? పద్ధతిగా చెప్పొచ్చుగా! - విడాకుల తర్వాత ట్రోల్స్‌పై సమంత స్పందన
Also Read: బ్రేకింగ్... ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రభాస్ కోటి రూపాయల విరాళం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌చేయండి